ఎన్జీటీ ఆగ్రహం
సింగరేణి అక్రమ మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేస్తున్నారని ఎన్జీటీ మండిపడింది. నందు నాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ వేలం ఆపెయ్యండి..!
హైదరాబాద్ ఖానామెట్‌లో సుమారు రెండెకరాల విస్తీర్ణంలోని 17వ ప్లాటు వేలం బిడ్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మహిళ సజీవదహనం
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్స్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని హౌస్ కీపర్ యశోద(40) సజీవదహనమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తప్పని టీకా పాట్లు
కరోనా టీకా కోసం జనం తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఎదురుచూస్తున్నారు. అయినా కొన్నిచోట్ల వ్యాక్సిన్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకా కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ హోదాలో తొలిసారి.!
కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి రేపు తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.