- టీకాలు ఉచితంగానే..
కరోనా టీకాను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోసు ఖరీదు రూ.400 ఉన్నప్పటికీ.. తాము సేకరించి అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీకా ధరలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ట్వీట్‌పై స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరమవుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదే ఉద్ధృతి..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 7వేల మందికిపైగా వైరస్ సోకింది. కొవిడ్ కాటుకు మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక కేసులు 58వేలు దాటాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాంధీలో కిషన్‌రెడ్డి..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. రాష్ట్ర మంత్రులు అనవసరంగా కేంద్రంపై ఆరోపణలు చేసున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే కేసులు, మరణాలను బట్టి కేంద్రం కేటాయింపులు చేస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమ్మో అరెస్టులా..
ఆర్థిక నేరాల్లో ఆరితేరిన ఓ నిందితుడిని ఇటీవల నగర పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు చేసిన వైద్యపరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణైంది. దీంతో అరెస్ట్ చేసిన బృందంలోని ఐదుగురు పోలీసుల్లో కలవరం మొదలైంది. మూడు రోజులుగా వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాను తొలుత జయించేది గ్రామాలే..