తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
TOP TEN NEWS @3PM

By

Published : Apr 9, 2021, 2:59 PM IST

  • ఏప్రిల్ నుంచే సాయం..

ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి సాయంపై మంత్రులు సబితా, గంగుల సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ టీచర్లకు చేసే సాయంపై విధివిధానాలు, కార్యాచరణపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అక్కపైనే హత్యాచారం..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆజంగఢ్​ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. సొంత సోదరిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడో దుండగుడు. ఏప్రిల్​ 6న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆయన పేరు వింటేనే వణుకు..

టైగర్ నరేంద్ర పేరు వింటేనే మజ్లీస్ నేతల్లో వణుకు పుట్టేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తితో కార్యకర్తలు పని చేయాలని సూచించారు. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హరీశ్ రావు శంకుస్థాపన..

సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.6 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు, ఎక్స్​ప్రెస్ బస్టాండు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పెరిగిన రద్దీ, అవసరాల దృష్ట్యా నూతన మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అడుగడుగునా అభిమానం..

ఖమ్మం జిల్లాలో షర్మిల చేపట్టిన సంకల్పయాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఘన స్వాగతం లభించింది. వందల సంఖ్యలో వాహనాల కాన్వాయ్​తో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలు దేరిన షర్మిలకు చౌటుప్పల్​లో కార్యకర్తలు.. ఆమెకు పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సవాల్​గా తీసుకోండి..

నేటి మహిళలు ఇంటిని చక్కబెట్టుకుంటూ, విధుల్నీ సమర్థంగా నిర్వర్తిస్తూ... కత్తిమీద సామే చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి తెలియకుండానే మూస ధోరణిలోకి వెళ్లిపోవడం, గుర్తింపు దొరకడం లేదని కుంగిపోవడం జరుగుతుంటాయి. అలాకాకుండా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగితే... అనుకున్నది సాధ్యమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్లాట్​ఫామ్​ టికెట్ల అమ్మకాలు బంద్!​

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ముంబయి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్​ఎమ్​టీ సహా మొత్తం 6 స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిబంధనలు ఉల్లంఘిస్తే.. యమలోకానికే!

దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతున్నా.. చాలా మంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ గమనించి, వినూత్నంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. కొవిడ్​ నిబంధనలు పాటించకపోతే.. యమలోకానికే వెళ్తారని, ఆ వేషధారణలో వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తోంది. అంతేకాకుండా.. వారికి మాస్క్​, శానిటైజర్​లనూ అందిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బరిలో దిగితే రికార్డులే!

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేడు చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. అయితే ప్రతి సీజన్​లో ఆటగాళ్లు ఏదో ఒక రికార్డును నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈసారి ఏఏ రికార్డులు సాధించే అవకాశం ఉందో తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'వకీల్​సాబ్ 'ఎలా ఉందంటే?

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వకీల్​సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details