- ముఖ్యమంత్రి మార్పు ఖాయం!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై భాజపా నేతలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉభయ సభలు వాయిదా..
చమురు ధరలపై పార్లమెంటు రెండో రోజూ దద్దరిల్లింది. ఈ విషయంపై చర్చ జరపాలని విపక్షాలు చేపట్టిన ఆందోళనల నడుమ లోక్ సభ, రాజ్య సభ రెండు సార్లు వాయిదా పడ్డాయి అనంతరం సభలు తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- త్వరలోనే నోటిఫికేషన్..
త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని, మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి పోగొట్టామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అత్యాచార దోషికి జీవితఖైదు..
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో దోషికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. కుమారుడికి సహకరించిన తల్లికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిషన్‌రెడ్డి డిమాండ్..
సంఘ విద్రోహ శక్తులే భైంసాలో ఘర్షణలకు కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హింసను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తప్పుడు ఓట్లు వేయొద్దు..