1. మోదీ మెచ్చిన మన మార్కెట్
మన్‌కీ బాత్ కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్‌పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. పాడైపోయిన కూరగాయల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్, 30 కేజీల బయో ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్
శామీర్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లలు 38 లక్షల మందికి పైగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. శామీర్‌పేట ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అక్కాచెల్లెల్లు
కళలు.. సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మన ప్రతిభాపాటవాలను పదిమందికి తెలియజేస్తాయి. లలితకళల్లో ప్రసిద్ధి చెందిన కూచిపూడికి మంచి గుర్తింపు ఉంది. కాకపోతే క్రమేణా ఆ ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే మన సంస్కృతికి చిరునామాగా నిలిచే కూచిపూడికి పునర్వైభవం కోసం తమ వంతు కృషి చేస్తోంది..ఈ నాట్య బృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అఖిలపక్షం భేటీ..
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై నేతలు చర్చించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. టీకా పంపిణీలో భారత్ రికార్డ్
దేశంలో కొవిడ్ మహమ్మారిని అంతం చేసే దిశగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటి వరకు 37 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీ విషయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డులను భారత్ నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.