1. కొండపోచమ్మకు గండి
కొండపోచమ్మ సాగర్ పంట కాల్వను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. నిన్న శివారువెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ పంట కాల్వకు గండి పడి... ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రామమంతా జలమయమైంది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రైవేటులోనూ నాణ్యమైన వైద్యం అందించాలి
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఓవైసీ, కామినేని ఆస్పత్రులను సందర్శించి... వైద్యులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సర్పంచ్ సస్పెండ్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేశ్‌ను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సస్పెండ్ చేశారు. హరితహారం మొక్కలను కాపాడకలేకపోవడం, తడి పొడి చెత్త వేరు చేయడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడం వల్ల సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కీలక నిజాలు వెల్లడి
తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. వారిద్దరూ అరెస్టయిన రోజు రాత్రంతా పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించారని మహిళా కానిస్టేబుల్ రేవతి వాంగ్మూలం ఇచ్చారు. లాఠీలపై, ఓ టేబుల్‌పై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సర్కార్ తక్కువ చూపిస్తోంది
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సమస్య ఏమాత్రం పెద్దది కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాన్ని అంగీకరించి సమస్యపై పోరాడాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.