తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM

By

Published : May 23, 2021, 1:00 PM IST

  • ఈటల కుమారుడిపై కేసీఆర్​కు ఫిర్యాదు..

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్​కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్​ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎంకు దరఖాస్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీకా వేసుకుంటే బీరు ఫ్రీ..

సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికల వేళ.. ప్రజలను రాజకీయ పార్టీలు 'ఉచిత' హామీలతో ఆకట్టుకోవడం చూస్తుంటాం! కానీ, అమెరికాలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ఉచిత పంపకాల కార్యక్రమం నడుస్తోంది. కారణం- కొవిడ్​ టీకా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 10 తర్వాత స్తబ్ధత..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పన్నెండో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేంద్రం వల్లే వ్యాక్సినేషన్​ జాప్యం..

గ్లోబల్ టెండర్లు పిలిచినా కేంద్రం నిబంధనల వల్ల కావాల్సిన వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరోసారి నష్టాల ఊబిలో టీఎస్​ఆర్టీసీ..

మూలిగే నక్కపై తాటిముంజ పడినట్లుంది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. కార్మికుల సమ్మె, లాక్​డౌన్​తో తీవ్రంగా నష్టపోయిన సంస్థ.. కోలుకుంటున్న తరుణంలో కరోనా రెండో దశ మరోసారి కష్టాలు తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేటి రాత్రివరకు.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాను ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్​ పొడిగింపు..

దిల్లీలో ఈనెల 31 వరకు లాక్​డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. మే 31 తర్వాత కేసులు తగ్గితే దశల వారీగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కలెక్టర్ అత్యుత్సాహం..

లాక్​డౌన్ సమయంలో బయటకు వచ్చిన ఓ యువకుడి చెంప చెళ్లుమనిపించారు ఓ కలెక్టర్. యువకుడి ఫోన్​నూ పగులగొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు కలెక్టర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ సిరీస్​లో కరోనా కలకలం..

ఆదివారం నుంచి జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్​ వన్డే సిరీస్​లో కరోనా కలవరం సృష్టించింది. తొలుత ముగ్గురు సభ్యులకు పాజిటివ్​గా తేలగా, మరోసారి పరీక్షలు చేస్తే అందులో ఇద్దరికి నెగిటివ్​ వచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రముఖ బ్యానర్​లో తేజ సినిమా?

యువహీరో తేజ సజ్జా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో ఓ సినిమా చేయనున్నాడని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details