- 'విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదు'
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఆనకట్ట, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వద్ద... సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఇతరులెవరినీ పవర్ హౌజ్‌లోకి అనుమతించడం లేదు. మరోవైపు జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి, కమిషన్‌కు లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మా పెళ్లికి వాళ్లు ఒప్పుకోరు.. అందుకే చనిపోతున్నాం
"నా గర్ల్‌ఫ్రెండ్‌ది నాదీ వేర్వేరు కులాలు. మా పెళ్లికి వాళ్ల అమ్మ, బావ ఒప్పుకోరు. వాళ్లు ఒప్పుకోకుండా మేం పెళ్లి చేసుకోలేం. అలాగని ఒకర్ని వదిలి మరొకరం బతకలేం. అందుకే చనిపోదామని నిర్ణయించుకున్నాం. అమ్మా.. అన్నా.. నన్ను క్షమించండి." అంటూ 20 ఏళ్ల యువకుడు అతని ప్రేయసి(18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్తుగా తాగివాహనం నడిపితే జైలుకే..
ఫుల్‌గా మందు తాగి.. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మద్యం తాగి రోడ్డుపైకి వచ్చే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక నుంచి వారంలో మూడ్రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి.. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
సామాన్యులపై మరో భారం పడింది. వంట గ్యాస్ ధర రూ.25.50 పెరిగింది. దీనితో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 834.50కి చేరింది. 19కేజీల సిలిండర్‌పై రూ. 76 పెరిగి రూ. 1,550కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 1005 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 61,588 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...