తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM

By

Published : May 23, 2021, 11:00 AM IST

  • ఒకే రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​..

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఓ రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లను వైద్యులు గుర్తించారు. దేశంలో ఇలాంటి కేసు నమోదవటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా 2.40 లక్షల కేసులు..

దేశంలో కరోనా మరణాలు నాలుగు వేల లోపునకు పడిపోయాయి. శనివారం మరో 3,741 మంది మరణించారు. కొత్తగా 2.40 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈటల కుమారుడిపై ఫిర్యాదు..

తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్కు​ మహేశ్ దరఖాస్తు చేసుకోగా.. తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుమారుడిని చంపి.. ఇంట్లోనే పూడ్చి..

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కుమారుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది ఓ తల్లి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 10 తర్వాత స్తబ్ధత..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పన్నెండో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మందుబాబుల క్యూ..

హైదరాబాద్​ నగరంలో మద్యం, మాంసం, నిత్యావసర దుకాణాలు కిటకిటలాడాయి. ఉదయం 6 గంటలకే మందుబాబులు వైన్​షాపుల ముందు బారులు తీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆనందయ్యది నాటు మందు..

ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆయుష్​ శాఖ కమిషనర్ కర్నల్ రాములు స్పష్టం చేశారు. కృష్ణపట్నంలో పర్యటించిన కమిషనర్ నేతృత్వంలోని వైద్య బృందం మందు తయారీ విధానాన్ని పరిశీలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మళ్లీ పెట్రో బాదుడు..

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 17 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్​కు రూ.93.21కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో నిందుతుడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిట్టి.. అన్నింటిలోనూ మేటి!

నవ్వుతో మాయచేసి తొలి సినిమాతోనే అభిమానుల్ని సొంతం చేసుకుంది 'జాతిరత్నాలు' హీరోయిన్​ ఫరియా అబ్దుల్లా. అయితే తనకు చిన్ననాటి నుంచే నటనపై అవగాహన, ఆసక్తి ఉన్నాయని చెప్పిన ఈ భామ.. ఎన్నో స్టేజ్​ ప్రదర్శనలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తానని ధీమా వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details