- ఆగని మరణాలు..
దేశంలో మరోసారి నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 2.57 లక్షల మందికి వైరస్ సోకిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిబంధనలు మరింత కఠినం..
ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నేటి నుంచి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నామని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు..
కరోనాతో తీవ్రంగా బాధపడుతూ... ప్రాణవాయువు అవసరమైన వారికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఆక్సిజన్‌ను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని గాంధీ, కింగ్ కోఠీ, టిమ్స్, ఛాతీ అసుపత్రులకు... అవసరమైన ప్రాణవాయువును క్షణం కూడా ఆలస్యం కాకుండా... అందించేందుకు ఈ వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్‌తో మరో వ్యక్తి..
కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. వికారాబాద్‌లో ఇటీవలె కరోనాను జయించిన ఓ వ్యక్తికి... బ్లాక్ ఫంగస్ సోకింది. పరిస్థితి విషమించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వందో రోజుకు విశాఖ స్టీల్‌ప్లాంట్ దీక్షలు..
వాళ్లంతా ఆ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులు. ఎప్పట్లాగే విధులు నిర్వహిస్తుండగా గుండెల్లో గుబులు పుట్టించే వార్త. ఆ సంస్థని ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు వందో రోజుకు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఔషధం భారీ ఉత్పత్తికి సన్నాహాలు!