- మరో 45,209 కరోనా కేసులు..
భారత్‌లో తాజాగా 45,209 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువైంది. మరో 501 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 873 కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా 873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... నలుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,643 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేటీఆర్ ఫైర్..
తెరాస అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తోంది. భాజపా విద్వేషాలు రెచ్చగొట్టే పంథాను అనుసరిస్తోంది.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి పనులతో పాటు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, మంటల్లో చలికాచుకోవాలని ప్రయత్నించడం సమర్థనీయం కాదు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ తేజం...
తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త... కొవిడ్‌కు సరికొత్త చికిత్సను కొనుగొన్నారు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్ర మెంఫిస్ నగరంలో ఉన్న సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న తెలుగు సైంటిస్ట్... కరోనా సోకినవారిలో ‘ఇన్‌ఫ్లమేటరీ కణ మరణం’ అనే ప్రక్రియను గుర్తించారు.దాన్ని విచ్ఛిన్నం చేసే చికిత్సలను కనుగొన్నారు. ఆమే.. తెలుగు తేజం తిరుమల దేవి కన్నెగంటి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తల్లీకూతుళ్ల దుర్మరణం..
హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొనగా... 11 నెలల చిన్నారితో పాటు తల్లి కూడా మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఔరా రమాదేవి..!