తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 11 AM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్‌టెన్ న్యూస్ @ 11 AM

By

Published : May 24, 2021, 10:59 AM IST

1. దేశంలో కరోనా మారణహోమం

దేశంలో కొవిడ్​ మరణాలు మరోసారి పెరిగాయి. ఆదివారం మరో 4,454 మంది కొవిడ్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య మూడు లక్షల మార్క్​ను దాటింది. కొత్తగా 2.22 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. అమెరికాతో జైశంకర్​ చర్చ

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా పర్యటన ప్రారంభం అయింది. కరోనాపై పోరులో సహకారంపై అమెరికా ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరపనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. నత్తనడకన టీకాల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ విజృంభణ కొనసాగుతున్న వేళ.. టీకాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఆగస్టు-డిసెంబరు మధ్యకాలంలో 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని, 18 ఏళ్లు నిండిన 95 కోట్ల మందికీ ఈ సంవత్సరాంతానికి టీకాలు అందుతాయని నీతిఆయోగ్‌ చెబుతోంది. కానీ వాస్తవంగా ఆ పరిస్థితి కనబడటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. డిజిటల్‌ బోధనపై విద్యాశాఖ కసరత్తు

కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. సాఫీగా సాగిపోయే తరగతుల్లో కలకలం రేపి విద్యార్థులను పాఠశాలలకు దూరం చేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఎన్నో యోచనలు చేసింది. కొంత వరకు సఫలీకృతం అయినా చిన్న చిన్న లోపాలతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలోని లోపాలను సరిదిద్దుకొని డిజిటల్‌ తరగతులు మళ్లీ ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. గాంధీలో బ్లాక్ ఫంగస్ బాధితులు..

ఎవరి నోట విన్నా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే మాట వినిపిస్తోంది. ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కొత్త వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాంధీలో బ్లాక్​ ఫంగస్​తో చికిత్స పొందుతున్న వారి 102కు చేరింది. మరోవైపు రోగులకు చికిత్స అందించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6.ఘర్షణలో 13 మంది సైనికులు మృతి

మయన్మార్​లో ప్రజాస్వామ్య మద్దతుదారులతో జరిగిన ఘర్షణల్లో 13 మంది సైనికులు మృతిచెందారు. మయన్మార్- చైనా సరిహద్దుల్లోని మ్యూస్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7.అరుదైన 'వీరగల్లు' శిల్పం

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని సోమరాజుకుంటలో నాలుగు అరుదైన శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు వీరగల్లులు కాగా ఒకటి నాగలింగం మరొకటి కాలభైరవ శిల్పమని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు ఈ వారం తొలి సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజ్​ బీఎస్​ఈ 004 పాయింట్లు మెరుగుపడి 50,744కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్​ నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధి చెంది 15,214 వద్ద ట్రేడ్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9.డోపింగ్​పై పృథ్వీ..

టీమ్​ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా.. గతంలో డోపింగ్​కు ఎందుకు పాల్పడ్డాడో వివరించాడు. అది తాను తెలియక చేసిన తప్పని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9.'అంతర్జాతీయ వేదికపై నిక్యాంక జోడీ​'

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా బిల్​బోర్డ్​ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకలో ఆమె భర్త నిక్​ జోనస్​తో కలిసి సందడి చేసింది. వీరి జోడీ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!

ABOUT THE AUTHOR

...view details