- ముూడో ముప్పు లేనట్లే..
భారత్‌లో కరోనా మూడో దశ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఒకవేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిద్ధంగా ఉండాలి..
కొవిడ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు.. ప్రభుత్వ గొప్ప ఆలోచన అని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఉన్న కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని గవర్నర్ పరిశీలించారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శత జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు..
ఈనెల 28న పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయన గురించి రాసిన 8 పుస్తకాలను ఈరోజే ప్రచురించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డెత్ గేమ్..
హైదరాబాద్ కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు మరో ప్రాణం బలైపోయింది. పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు మణికంఠ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఏపీపీఎస్సీ(APPSC) పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమీక్షా సమయం..