తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP TEN NEWS: టాప్​న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY
టాప్​న్యూస్​

By

Published : Jan 4, 2022, 1:00 PM IST

  • కళాశాలలో కరోనా కలకలం..

మహబూబాబాద్ జిల్లా కురవి గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేగింది. ముగ్గురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థినులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇతర విద్యార్థినులకు వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

  • కొవిడ్ పరిస్థితిపై హైకోర్టు

తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజారోగ్య, పోలీస్‌ శాఖలు హైకోర్టుకు నివేదించాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదికలు సమర్పించారు. కొత్త సంవత్సర వేడుకల్లో 907 కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదించారు.

  • ర్యాగింగ్‌ కేసులో విద్యార్థులకు సస్పెన్షన్

సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెన్షన్‌తో పాటు వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

  • 'ఈడబ్ల్యూఎస్' కోటాపై సుప్రీం అత్యవసర విచారణ

నీట్​ పీజీ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వ్యవహారంపై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మానసం పేర్కొంది.

  • ప్రారంభమైన సిరోలెన్స్ సర్వే

రాష్ట్రంలో సిరోలెన్స్ సర్వే ప్రారంభమైంది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి, యాంటీబాడీల తయారీపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, నిజామాబాద్​, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సర్వే చేస్తున్నారు.

  • ఆలయ హుండీలకు కాసుల వర్షం..

కేరళ గురువాయూర్​ ఆలయ హుండీల్లో భారీగా కానుకలు పడుతున్నాయి. అయితే అందులో రద్దు అయిన నోట్లు ఎక్కవ దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లల్లో.. రూ. 1.35కోట్లు విలువ చేసే నగదు.. పాత నోట్లే కావడం గమనార్హం.

  • 'యాపిల్​' ఘనత!

యాపిల్​ సంస్థ మార్కెట్​ విలువ 3 ట్రిలియన్​ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 3 ట్రిలియన్​ డాలర్ల క్లబ్​లో చేరిన తొలి సంస్థగా యాపిల్​ చరిత్ర సృష్టించింది.

  • రెండు ఏటీఎంలు పగలగొట్టి చోరీ

అసోంలోని బొంగైగావ్​ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని భారతీయ స్టేట్​ బ్యాంకుకు చెందిన రెండు ఏటీఎంలను పగలగొట్టి రూ.40 లక్షల నగదును దోచుకెళ్లారు.

  • రంజీ ట్రోఫీ నిర్వహణపై గంగూలీ క్లారిటీ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

  • జక్కన్న ఫ్రిజ్​లో ఫుడ్​ కన్నా ఈగలే ఎక్కువ..

దర్శకుడు రాజమౌళి ఫ్రిజ్​లో ఆహార పదార్థాల కన్నా ఈగలే ఎక్కువగా ఉంటాయని తెలిపారు హీరో ఎన్టీఆర్​. అందుకు గల కారణాన్ని వివరించారు మరో కథానాయకుడు రామ్​చరణ్​.

ABOUT THE AUTHOR

...view details