తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news Telangana
టాప్​ న్యూస్

By

Published : Jan 6, 2022, 4:58 PM IST

  • ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు.

  • ' ఎంపీని అలా చేయడం దారుణం'

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం రమణ్​ సింగ్​ పరామర్శించారు. కరీంనగర్‌ తరహా ఘటన దేశ రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేదని ఆయన​ అన్నారు. గేట్లు ధ్వంసం చేసి ఒక ఎంపీని అరెస్టు చేయడం దారుణమన్నారు.

  • కేసీఆర్​ వర్కర్లుగా రాష్ట్ర పోలీసులు

Tharun Chug on police: కరీంనగర్​ జైలులో ఉన్న భాజపా నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​ చుగ్​ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని తరుణ్​ చుగ్​ అన్నారు. భాజపా కార్యకర్తలపై పోలీసుల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు నివేదిక ఇస్తామని.. ఈ ఘటనపై తాము గవర్నర్​ను కూడా కలవబోతున్నట్లు చెప్పారు.

  • మీరు ప్రాక్టికల్​గా ఆలోచించండి

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్‌ కోరారు. పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

  • వెంటాడిన మృత్వువు

మృత్వువు వారిని వెంటాడింది. ఊహించని ప్రమాదం ఇద్దరు యువకులను బలితీసుకుంది. రెండు బైకులు ఢీకొని కిందపడిన ఇద్దరిపై నుంచి కారు దూసుకెళ్లింది.

  • విమానంలో 125 మందికి కరోనా

Amritsar Airport Covid Test: ఇటలీ నుంచి పంజాబ్​కు వచ్చిన ఛార్టెర్డ్​ విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో మొత్తం 179 మంది భారత్​కు వచ్చారన్నారు.

  • సోషల్ మీడియా స్టార్​గా కోడిపెట్ట.. !

Eggs in the size of grapes: ద్రాక్ష పండు సైజులో కోడిగుడ్లను ఎప్పుడైనా చూశారా? లేదంటే... కేరళకు వెళ్లాల్సిందే! మలప్పురానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉన్న ఓ కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది.

  • నాలుగో రోజు లాభాలకు బ్రేక్​

Stock Market Close: స్టాక్​ మార్కెట్లపై మళ్లీ బేర్​ పంజా విసిరింది. సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పతనమై.. 60 వేల మార్కును కోల్పోయింది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ షేర్లు డీలాపడ్డాయి.

  • 'సర్కారు వారి పాట' అప్డేట్..!

Sarkaru Vaari Paata Songs: సూపర్​స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించి అదిరిపోయే అప్డేట్​ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎస్ తమన్. ఈ సినిమా మ్యూజిక్​ వర్క్​ జరుగుతోందని, త్వరలోనే దానిని ప్రేక్షకులకు వినిపించడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

  • ఆటకు వరుణుడు ఆటంకం

జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరుగుతున్న భారత్​, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్​ నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం కొనసాగుతుండటం వల్ల కాస్త ఆలస్యంగా మ్యాచ్​ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details