తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Sep 20, 2021, 5:56 AM IST

Updated : Sep 20, 2021, 9:51 PM IST

21:43 September 20

 ప్రతి ఒక్కరికి దళితబంధు ఇస్తాం..!

కరీంనగర్​ కలెక్టరేట్​లో దళితబంధు పథకం అమలుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Harish Rao on Balit Bandu) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ఆ ఛార్జ్‌షీట్​లో ఏముందంటే!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో (Tollywood Drugs Case).. సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై ఛార్జ్‌షీట్ (Chargesheet on kelvin) దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ.. నటుల విచారణను ప్రస్తావించింది

పరువునష్టం దావా వేశా

పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేటీ రామారావు ( twitter war between ktr and revanth) మరోసారి తీవ్రంగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారనీ... తనపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్ (ktr)... దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. కోర్టులో పరువునష్టం దావా (defamation case) వేసినట్టు ట్వీట్‌ చేశారు.

ప్రపంచంలోనే వృద్ధ కవలలు

అత్యంత వృద్ధ కవలలుగా (Oldest Twins in the World) గిన్నీస్ బుక్​లో చోటు సంపాదించుకున్నారు జపాన్​కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. (Oldest Twin Sisters) 107 సంవత్సరాల 330 రోజుల వయస్సుతో ఈ రికార్డు సాధించారు. (Oldest twins alive)

 కోల్​కతా లక్ష్యం 93

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు బ్యాట్స్​మెన్ తడబడ్డారు. దీంతో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19 ఓవర్లలో 92 పరుగులే చేయగలిగింది. 

20:46 September 20

స్వీపర్​కు ఉద్యోగమిచ్చిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఈనాడు- ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉన్నతవిద్య చదివి జీహెచ్​ఎంసీలో స్వీపర్​గా పనిచేస్తున్న రజనీ కుటుంబాన్ని ఆదుకున్నారు. 'ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌.. ఉద్యోగం స్వీపర్‌'’ పేరుతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఆమెకు పురపాలకశాఖలో ఔట్​సోర్సింగ్​లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్​గా ఉద్యోగ అవకాశం కల్పించారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

మైనర్ పిటిషన్​..షాకిచ్చిన  సుప్రీం

దేశంలోని పాఠశాలలను తెరవాలంటూ (Schools reopening) ఓ మైనర్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ పరిష్కారాలపై కాకుండా చదువుపై దృష్టిపెట్టాలని పిటిషనర్​కు సూచించింది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని (Supreme Court on school reopen) స్పష్టం చేసింది.

త్వరలో చిన్నారులకూ ఫైజర్ టీకా.!

ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో (Pfizer kids under 12) ఫైజర్ టీకా సురక్షితంగా పనిచేస్తోందని ఆ సంస్థ (Pfizer Covid vaccine) తెలిపింది. వీరిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

 కోహ్లీ నయా రికార్డు

ఐపీఎల్​లో మరో రికార్డు సాధించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ(virat kohli rcb news). ఆర్సీబీ తరఫున 200 మ్యాచ్​లు(virat kohli records) ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. లీగ్​లో మరే ఆటగాడు కూడా ఇప్పటివరకు ఓ ఫ్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచ్​లు ఆడలేదు. 

19:40 September 20

టాప్​ న్యూస్​ @ 8PM

 భారీ వర్షం కురిసే అవకాశం!

రాష్ట్రాన్ని మళ్లీ వర్షం ముంచెత్తుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో గంటపాటు కురిసిన వర్షం... జనజీవనాన్ని స్తంభింపజేసింది. రానున్న మూడు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

 

సాగర్​లో వ్యర్థాల తొలగింపు 

హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో... వ్యర్థాలు తొలగింపు (removing immersed idols) ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సాగర తీరంలో ఉన్న వ్యర్థాలను... క్రేన్ల సాయంతో తొలగిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. పూలు, సామాగ్రి, ఇతర చెత్తా చెదారం, కాగితాలు సైతం తొలగించడంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిమగ్నమైంది.

 మోదీ-బైడెన్​ భేటీలో అఫ్గాన్​పై కీలక చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర భేటీ ఖరారైంది. సెప్టెంబర్​ 24 ఇరు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

 నాడు గుడికట్టి  నేడు అమ్మేస్తున్నాడు..!

గుడి కట్టి మొక్కినా గుర్తింపు లేదని... సీఎం కేసీఆర్​ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడో వ్యక్తి(CM KCR statue for sale) . సీఎం కేసీఆర్​ విగ్రహానికి పూజలు చేసిన అభిమాని ఇప్పుడు... ముఖ్యమంత్రి విగ్రహాన్ని అమ్మేస్తున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగింది.

మహంత్​ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు.

19:07 September 20

టాప్​ న్యూస్​ @ 7PM

 మొదటి భార్య కుమార్తెపై తండ్రి దాడి

మూడేళ్ల బాలికను ఓ వ్యక్తి ప్లాస్టిక్​ తాడుతో దారుణంగా కొట్టాడు. రెండో భార్య ముందు మొదటి భార్య కుమార్తెపై తండ్రి దాడి చేశాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది. అన్నం తినడం లేదని.. మూడేళ్ల వయసున్న చిన్నారిని ఓ వ్యక్తి ప్లాస్టిక్​ తాడుతో తీవ్రంగా కొట్టాడు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్​ ఛాలెంజ్​కు సిద్ధం

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(konda vishweshwar reddy) విసిరిన వైట్​ ఛాలెంజ్​కు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay on white challenge) ప్రకటించారు.

తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్ సరస్వతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డుతో (National Florence Nightingale Award 2020) సత్కరించింది. వర్చువల్​గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. ఈ అవార్డును బ్రిగేడియర్ సరస్వతికి ప్రదానం చేశారు.

రాజ్ కుంద్రాకు  బెయిల్

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది.

: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు (సెప్టెంబర్ 20) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.

17:49 September 20

టాప్​ న్యూస్​ @ 6PM

వైట్​ ఛాలెంజ్​కు సిద్ధం

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్​ ఛాలెంజ్​కు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని వెల్లడించారు.   కామారెడ్డి  జిల్లా తాడ్వాయిలో బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది.

ఆ బస్సు ప్రయాణం.. ప్రాణంతో చెలగాటం!

బస్సుపై అత్యంత ప్రమాదకర రీతిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఘటన కర్ణాటక కోలార్​ జిల్లాలోని శ్రీనివాసపుర్​లో జరిగింది. ఎలాంటి భయం లేకుండా, ప్రాణాలను లెక్కచేయకుండా.. విద్యార్థులు.. ఆ ప్రైవేటు బస్సు మీద, కిటీకీలు, రాడ్డులు పట్టుకుని ప్రయాణిస్తున్నారు.

పెళ్లికి ఒప్పుకోలేదని కూతురినే..!

తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని.. కన్న కూతురిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు. మరోవైపు.. కట్టుకున్న భార్యను గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ రెండు ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో(​Up Crime News) జరిగాయి. హరియాణాలో జరిగిన మరో ఘటనలో ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతిని పిస్తోలుతో కాల్చి చంపాడు ఓ కిరాతకుడు.

 

2021-22లో వైజాగ్​కు అవకాశం

2021-22 సీజన్​కు సంబంధించి స్వదేశీ సిరీస్​ల వివరాలను ప్రకటించింది బీసీసీఐ(bcci news). ఈ సీజన్​లో న్యూజిలాండ్​, వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికాలకు ఆతిథ్యం ఇవ్వనుంది భారత్.

 ప్రపంచంపై చైనా మరో కత్తి!

చైనాలో అతిపెద్ద సంక్షోభం (China Financial Crisis 2021) తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్​గ్రాండే దివాలా (Evergrande crisis) అంచుకు చేరింది. ఈ పరిస్థితి ముదిరితే.. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

16:44 September 20

టాప్​ న్యూస్​ @ 5PM

'సినీ ప్రముఖులపై బలమైన ఆధారాల్లేవు'

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో (Tollywood Drugs Case).. సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై ఛార్జ్‌షీట్ (Chargesheet on kelvin) దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ.. నటుల విచారణను ప్రస్తావించింది

 

 చేవెళ్ల నుంచే పాదయాత్ర 

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra)  చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

 పిడుగుపాటుతో తల్లీ, కుమారుడు మృతి

బైకుపై వెళ్తున్న దంపతులపై పిడుగు పడి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన (thunder strike on couple ) మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల (mancherial) రైల్వే వంతెన వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

రానాతో 'లీడర్'​ సీక్వెల్​..

హీరో రానాతో 'లీడర్​ 2'(leader movie telugu) సినిమా చేస్తానని స్పష్టతనిచ్చారు దర్శకుడు శేఖర్​ కమ్ముల. దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల తమిళ హీరో ధనుష్​తోనూ ఓ సినిమా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆ దేశంలో ఐపీఎల్​పై నిషేధం..!

ప్రపంచమంతా ప్రస్తుతం ఐపీఎల్​ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓ దేశ ప్రజలు మాత్రం ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఆ దేశంలో ఐపీఎల్ మ్యాచ్​ల​ ప్రసారంపై నిషేధం విధించడమే. ఇందుకు గల కారణం తెలిస్తే మాత్రం షాకవుతారు.

15:36 September 20

టాప్​ న్యూస్​ @ 4PM

 డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్

 కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌లో నటుల విచారణను  ఎక్సైజ్ శాఖ ప్రస్తావించింది. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఛార్జ్​ షీట్​లో పేర్కొంది. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని తెలిపింది.

అక్టోబర్ 20 నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర  

అక్టోబర్ 20 నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల తెలిపారు.

 ఇవాళ, రేపు భారీ వర్షాలు!

తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy Rain Alert in telangana) కురిసే అవకాశముందని ఐఎండీ సంచాలకులు వెల్లడించారు.

 క్షణాల్లో 3 కిలోల బంగారం చోరీ

అదో జువెలరీ షాపు. మధ్యాహ్నం వేళ ఓ ఇద్దరు మహిళలు.. బంగారం కొనడానికి అక్కడకు వచ్చారు. కాసేపు నగలు కొంటున్నట్లుగా నటించారు. కానీ, చివరకు ఆ షాపు నుంచే రూ.1.2 కోట్లు విలువైన బంగారాన్ని దోచేశారు.

తాలిబన్ల​ గుండెల్లో​ ఆ గుబులు!

ఇస్లామిక్​ స్టేట్​.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే తాలిబన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి(taliban isis news). తాలిబన్ల​ వాహనాలు, ఫైటర్లే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది ఐఎస్​(taliban isis difference). ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో అల్లాడుతున్న తాలిబన్లకు ఇస్లామిక్​ స్టేట్​ తలనొప్పి వ్యవహారంగా మారింది.

14:38 September 20

టాప్​ న్యూస్​ @ 3PM

అలా అయితే ఆర్​టీసీ బస్సుల్లోకి నో ఎంట్రీ!

మీరు ఇంకా టీకా ఒక్క డోసు కూడా తీసుకోలేదా? అయితే మీరు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోలేరు! కనీసం టీకా ఒక్క డోసు కూడా తీసుకోని వారికి రవాణాతో పాటు ప్రభుత్వ భవనాల్లోకి అనుమతి లేదని అహ్మదాబాద్​ యంత్రాంగం ప్రకటించింది(ahmedabad vaccine news today).

ఆ సీఎంకు జ్యోతిషంపై అపార నమ్మకం!

పంజాబ్​ ముఖ్యమంత్రిగా(Punjab CM News) ప్రమాణ స్వీకారం చేశారు చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అమరీందర్​ సింగ్​ రాజీనామా తర్వాత.. సీఎం రేసులో పలువురు నేతల పేర్లు వినిపించినప్పటికీ చన్నీ వైపే మొగ్గుచూపింది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఉన్నత విద్యావంతుడైన చన్నీ.. రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.

 

అక్కడ.. రోడ్లు, ఇళ్లకు రైతుబంధు.!

నాగార్జున సాగర్(Nagarjuna Sagar Lands) ప్రధాన రహదారి వెంట 30 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించి ఉన్న ప్రాంతాలు, ప్రజాపంపిణీ బియ్యం సరఫరా గోదాములు నిర్మించిన ప్రాంతం, సిమెంటు రహదారులు నిర్మించిన కాలనీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. వీటన్నింటినీ వ్యవసాయ భూములుగా చూపిస్తూ రెవెన్యూ(Revenue) సిబ్బంది నూతన పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారు. అంతే కాదు ఆ భూములకు రైతుబంధు(Raithu bandhu) కూడా మంజూరు చేస్తోంది. ఈ సంగతంతా ఈనాడు(Eenadu), ఈటీవీ- భారత్(Etv Bharat)​ నిఘాలో వెలుగుచూసింది.

ఒంటరిగా వెళ్లే దంపతులే వారి లక్ష్యం?

జన సంచారం లేని దారుల్లో వాళ్లు గుంటనక్కల వలె వేచి చూస్తారు. దారిలో ఏదైనా జంట కనిపిస్తే చాలు పండుగ చేసుకుంటారు. ఒంటరిగా వెళ్తున్న దంపతులపై (mob attacks on couple ) మాటు వేసి... మారణాయుధాలతో వెంటాడి, వేటాడి దోచుకోవడమే వారి లక్ష్యం. ఇంతటి భయంకరమైన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడంటే..

 

'ఆ నిర్ణయంతో జట్టుపై ప్రభావం'

ఐపీఎల్​(IPL 2021) ఆర్సీబీ కెప్టెన్సీ(Kohli RCB Captaincy) నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు సారథి విరాట్​ కోహ్లీ ప్రకటించాడు. దీనిపై మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ స్పందిస్తూ(Gambhir on Kohli Captaincy).. విరాట్​ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు.

13:50 September 20

టాప్​ న్యూస్​ @ 2PM

  • యూనివర్సిటీలో కాల్పుల కలకలం..

రష్యాలోని పెర్మ్‌లోని యూనివర్సిటీలో సోమవారం కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

  • సవాళ్ల పర్వం..

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ( KTR AND REVANTH TWITTER WAR )మధ్య సవాళ్ల పర్వం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. సామాజిక మాధ్యమం ట్విటర్​ వేదికగా సవాళ్లు విసురుకుంటున్నారు. (TOLLYWOOD TWITTER WAR) డ్రగ్స్ వ్యవహారంలో కొన్నిరోజులుగా రేవంత్‌రెడ్డి (REVANTH REDDY).. కేటీఆర్​పై (KTR) ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని మంత్రి ఖండిస్తూ వస్తుండగా.. తాజాగా 'వైట్‌ ఛాలెంజ్‌' (WHITE CHALLENGE) పేరుతో రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ వేడిపుట్టించింది.

  • విచారణ చేస్తే బండారం బయటపడేది..

వైట్​ ఛాలెంజ్​లో భాగంగా... గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్దకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Tpcc chief Revanth Reddy) చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Congress leader Shabbir Ali) కూడా ధర్నలో (protest) పాల్గొన్నారు. రేవంత్​ వైట్​ ఛాలెంజ్​ను (revanth reddy White challenge) స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం అక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

  • రంగంలోకి విజయవాడ పోలీసులు..

విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ సంస్థ పేరుతో రెండు కంటెయినర్లలో హెరాయిన్​ పట్టుబడిన కేసులో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సంస్థ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు. కాకినాడ, విజయవాడ, చెన్నైలో సంస్థ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు ఈ అక్రమ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

  • విస్కీ.. బ్రాందీలే 'మందులు'..

విస్కీ తాగితే వైరస్​ నయమవుతుందా? ముక్కులో విస్కీ చుక్కలు పోసుకుంటే వైరస్​ నుంచి కోలుకుంటామా? సాంకేతికత అందుబాటులో లేని 1918 కాలంలో స్పానిష్​ఫ్లూ సోకింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు ఇలాంటి ప్రయోగాలు చేసేవారట. ప్రాణాంతక ఫ్లూ నుంచి ప్రజలను రక్షఇంచడం కోసం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారట.

12:52 September 20

టాప్​ న్యూస్​ @1PM

  • ఉపసంఘం సమావేశం..

గెజిట్​ నోటిఫికేషన్​ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (godavari Sub-Committee) సమావేశమైంది. హైదరాబాద్​లోని జలసౌధలో జీఆర్​ఎంబీ ఉపసంఘం (Grmb Sub-Committee) భేటీ అయింది. బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండే (bp pandey) నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా గెజిట్ అమలుపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం చర్చించనుంది.  

  • సీఎంగా చన్నీ ప్రమాణం..

పంజాబ్​ ముఖ్యమంత్రిగా చరణ్​జీత్​ సింగ్​ చన్నీ ప్రమాణం చేశారు(punjab new cm). కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

  • ఒకే వ్యక్తికి 5 డోసుల వ్యాక్సిన్​..

కరోనా టీకా(Covid vaccine) తీసుకున్నాక కొవిన్​ పోర్టల్​ ద్వారా ధ్రువపత్రం(vaccine certificate) అందిస్తోంది ప్రభుత్వం. అయితే.. టీకా రెండో డోసు(Covid vaccine second dose) తీసుకున్న ఓ వ్యక్తి తన ధ్రువపత్రం చూసి ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. అందులో ఏకంగా 5 డోసులు తీసుకుని.. ఆరో డోసుకు షెడ్యూల్​ చేసుకున్నట్లు ఉంది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో జరిగింది.

  • ఉత్తర కొరియా ఆగ్రహం!

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్​ల కొత్త కూటమిని(AUKUS Alliance) అత్యంత ప్రమాదకర చర్యగా పేర్కొంది ఉత్తర కొరియా(north korea criticizes US). ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం గల జలాంతర్గాములను అందించేందుకు అమెరికా కుదుర్చుకుంటోన్న ఒప్పందాన్ని తప్పుపట్టింది. అది తమ దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది.

  • గూగుల్ నుంచి 'ఒరిజినల్​ ఆలు చిప్స్'..

త్వరలో తీసుకురానున్న పిక్సెల్​ 6 సిరీస్(Google Pixel 6)​ ఫోన్​తోపాటు దాని 'గూగుల్​టెన్సార్ చిప్​​'​ ప్రమోషన్ కోసం విభిన్నంగా ప్రయత్నించింది గూగుల్. ఆలు చిప్స్​ ప్యాకేజీలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ ఆలు చిప్స్​ ఎక్కడ దొరుకుతాయి? వాటి టేస్ట్ ఎలా ఉంటుందంటే..?

11:48 September 20

టాప్​ న్యూస్​ @12PM

  • ఇక తగ్గేదే లే..

పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేటీ రామారావు మరోసారి తీవ్రంగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారనీ... తనపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్... దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. కోర్టులో పరువునష్టం దావా వేసినట్టు ట్వీట్‌ చేశారు.

  • రాకపోకలు పునరుద్ధరణ..

హైదరాబాద్‌ (Hyderabad) మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవం (ganesh immersion) తుది దశకు చేరుకుంది. వినాయక విగ్రహాలను భక్తులు పెద్దఎత్తున ఊరేగింపు మధ్య ట్యాంక్‌బండ్‌ (tankbund)కు తరలిస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

  • కత్తులతో దాడి..

హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా గణేశ్​ నిమజ్జన ఉత్సవాలు(Assault in Ganesh immersion 2021) ముగిశాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో స్టెప్పులేస్తూ వినాయకుణ్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపారు. చాలా చోట్ల ఉత్సవాలు ప్రశాంతంగా ముగియగా.. కొన్నిచోట్ల మాత్రం స్వల్ప గొడవలు చోటుచేసుకున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో గణపతి శోభాయాత్ర(Assault in Ganesh immersion 2021)లో.. చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిపైఒకరు కత్తులతో దాడి చేసుకునే దాకా వెళ్లింది.

  • రోహిత్ తర్వాత మ్యాచ్​లో ఉంటాడా?

చెన్నై సూపర్​కింగ్స్​తో(CSK Vs MI 2021) మ్యాచ్​లో రోహిత్​ శర్మ ఆడకపోవడంపై ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్​ నిరాశ చెందారు. ఇదే విషయమై ముంబయి కోచ్​ మహేలా జయవర్ధనే స్పష్టత ఇచ్చాడు. కోల్​కతాతో తర్వాత జరిగే మ్యాచ్​లో అతడు ఆడతాడని తెలిపాడు.


ప్రయాణం ఆగదు..

ప్రజలకు సేవ చేసేందుకు మళ్లీ వచ్చానని నటుడు సోనూసూద్(Sonu Sood Latest News) ట్వీట్ చేశారు. కొంత మంది అతిథులు రావటం వల్ల నాలుగు రోజులుగా మీకు సేవ చేయలేకపోయానని అన్నారు.

11:12 September 20

టాప్​ న్యూస్​ @11AM

  • మరో 30,256 కరోనా కేసులు..

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య(Coronavirus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 30,256 మంది​ వైరస్​​ (Corona virus India) బారినపడ్డారు. మరో 295 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే 43,938 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు.

  • అమెరికాలో మోదీ షెడ్యూల్​ ఇదే!

తీరికలేని భేటీలతో ప్రధాని మోదీ అమెరికా(modi us visit 2021) పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ.. అగ్రరాజ్యంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో పాటు అనేకమంది ఉన్నతాధికారులను మోదీ కలవనున్నట్టు తెలుస్తోంది(modi us visit).

  • కాంగ్రెస్​ అధిష్ఠానం చెప్పాలనుకునేది ఇదేనా?

పంజాబ్​లో ముఖ్యమంత్రి(punjab chief minister) మార్పుతో ఎమ్మెల్యేలంతా తమకే విధేయులుగా ఉంటారే తప్ప రాష్ట్ర నాయకులకు కాదన్న సందేశాన్ని కాంగ్రెస్​ అధిష్ఠానం పార్టీ నేతలకు పంపగలిగింది. తమను విస్మరించడంగానీ, తమ మాటను కాదనడంగానీ చేయలేరన్న సూచనలు ఇవ్వగలిగింది. అధిష్ఠానం నిర్ణయాలను పెడచెవిన పెడుతున్న రాజస్థాన్​ సీఎం గహ్లోత్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​లకు పరోక్ష సూచనలు చేసింది.

  • తప్పిన ప్రమాదం..

కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ.. కింద పడిపోయింది. అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆమెను రైల్వే ప్లాట్​ఫామ్​పైకి లాగి కాపాడారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ మహిళ.

  • సోషల్‌ మీడియా స్టార్‌గా కేంద్ర మంత్రి..

ఆయన పేరున్న సినిమా నటుడు కాదు. ప్రముఖ క్రికెటర్‌ అంత కన్నా కాదు. అయినా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌(Nitin Gadkari Youtube).. ఇలా ఏ సామాజిక మాధ్యమాన్ని తెరచి చూసినా లక్షలాది మంది ఫాలోవర్లు. ఇంత మంది అనుసరించే ఆయనే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari twitter followers). ఇంత ఆదరణ కలిగి ఉండడానికి కారణం మాటలతో ఆయన వేసే మంత్రమే. మరి ఇంతకీ ఏమిటా మంత్రం?

09:53 September 20

టాప్​ న్యూస్​ @10AM

  • సిద్ధంగా ఉన్నా..

రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ సిద్ధమేనా అని ప్రశ్నించారు.

  • తగ్గిన పసిడి ధర..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • భారీగా పెరగనున్న ఎంబీబీఎస్​ సీట్లు..

రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్​ సీట్లు (MBBS SEATS) అందుబాటులోకి రానున్నాయి. రానున్న ఈ రెండేళ్లలో మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలను (Government Medical Colleges) నెలకొల్పనున్నారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున కొత్తగా రానున్నాయి.

  • కౌలు సాగులో అగ్రస్థానంలో ఏపీ..

కౌలు సాగు (Lease cultivation)లో ఏపీ (AP) మొదటి స్థానంలో నిలిచింది. 2018 జులై నుంచి 2019 జూన్‌ మధ్య కేంద్ర గణాంకశాఖ నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వే (National Sample Survey) లో ఈ విషయం వెల్లడైంది.

  • మూలుగుతున్న నిధులు..

ఏపీలో (Andhra Pradesh) సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు విదేశీ సంస్థల(foreign founds) నుంచి తీసుకున్న రుణ అడ్వాన్సుల్లో రూ.960 కోట్లు ఇప్పటికీ ఖర్చుచేయలేదని కేంద్రం పేర్కొంది. ఈ పథకాల అమలు, వ్యయంపై సమగ్ర వివరాలు తెలియజేయాలని కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ఉన్నతాధికారి లేఖ(central letter to state) రాశారు.

08:51 September 20

టాప్​ న్యూస్​ @9AM

  • అమ్మ చేసిన అంగడి బొమ్మ..

పిల్లలంటే ఇష్టపడని తల్లి ఉండదు. పిల్లల కోసం పస్తులుండైనా వారి కడుపు నింపుతుంది. వారికేదైనా చిన్న గాయమైతే తాను తల్లడిల్లుతుంది. కన్నబిడ్డకు కష్టం రాకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డల క్షేమమే తన క్షేమంగా వారి కోసం ప్రతిక్షణం తపిస్తుంది. అంత గొప్ప అమ్మ స్థానంలో ఉన్న ఓ మహిళ తన అవసరాల కోసం కన్నబిడ్డను వాడుకుంటోంది. మత్తులో తూలేందుకు వినాయక నిమజ్జనం సాక్షిగా చంటిబిడ్డను అంగడిబొమ్మను చేస్తోంది.

  • నేడే బాధ్యతల స్వీకరణ..

టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ (Tsrtc chairman)గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్(mla bajireddy govardhan)​ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.15 గంటలకు బస్​భవన్​లో కార్యక్రమం జరగనుంది.

  • రైలు కింద పడిన మహిళ..

కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ.. కింద పడిపోయింది. అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆమెను రైల్వే ప్లాట్​ఫామ్​పైకి లాగి కాపాడారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ మహిళ.

  • 'అల.. సైమాలో'..

సైమా అవార్డ్స్​-2020లో(Siima Awards 2020) 'అల.. వైకుంఠపురములో' సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 10 పురస్కారాలను అందుకుంది. 2020 ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(allu arjun awards), ఉత్తమ నటిగా పూజా హెగ్డే నిలిచారు. జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు దక్కింది.

  • అగ్నిపర్వత విస్ఫోటనం..

స్పెయిన్​లోని లా పాల్మా దీవిలో భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం(volcano eruption) చెందింది. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతోంది లావా. 50 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.

07:56 September 20

టాప్​ న్యూస్​ @8AM

  • ఆ ఒక్కటే దూరం..

భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చేందుకే తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్(dharani portal issues) ప్రారంభించింది. కానీ ధరణి పోర్టల్(dharani portal issues)​ ప్రారంభానికి ముందు నిలిచిపోయిన మ్యుటేషన్లతో యజమానులు అవస్థలు పడుతున్నారు. పాత విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తయి.. మ్యుటేషన్ కాకుండా ఉన్నవారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • గద్దెనెక్కని ప్రతిపాదనలు..

రెండేళ్లకోసారి ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మేడారం మహాజాతర(medaram maha jathara)కు సమయం ఆసన్నమైంది. అధికారులు, నేతలు మాత్రం జాతర(jathara) నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పనులు ప్రారంభిస్తేనే జాతర సమయంలో భక్తులు సౌకర్యవంతంగా అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. 

  • పింఛను పెంచుకోవచ్చు..

వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులకు పింఛను చెల్లించేందుకు ఉద్దేశించిన పథకంలో మార్పులు చేయాలని కేంద్రం (CENTRAL GOVERNMENT) యోచిస్తోంది. ఎన్‌పీఎస్‌ (EPS) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించి, అందులోని మొత్తంపై వడ్డీని పింఛనుగా (PENSION) ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది.

  • అద్భుతమైన విజయంతో అగ్రస్థానంలోకి..

ఐపీఎల్‌(IPL 2021) రెండో అంచెకు ఆసక్తికర ఆరంభం! విపత్కర పరిస్థితుల్లో నుంచి తేరుకుంటూ చెన్నై విజయాన్నందుకుంది. 24కే 4 వికెట్లు కోల్పోయినా, రుతురాజ్‌ అద్భుత పోరాటంతో(Ruturaj Gaikwad IPL Innings) పోటీ ఇవ్వగలిగే స్కోరు సాధించిన సూపర్‌కింగ్స్‌.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబయికి కళ్లెం వేసింది. చెన్నై ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో(IPL Points Table 2021) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.

  • కోల్​కతాతో ఆర్​సీబీ పోరు..

ఐపీఎల్​-2021(IPL Second Phase 2021) రెండోదశలోని రెండురోజు మరో కీలకపోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం జరగనున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​(RCB Vs KKR 2021) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్​లో వరుస అపజాయాలతో కొట్టుమిట్టాడుతున్న కేకేఆర్​ టీమ్​ ఈ మ్యాచ్​ విజయంతో గెలుపుబాట పట్టాలని యోచిస్తుండగా.. కేకేఆర్​పై విజయం సాధించిన ప్లేఆఫ్స్​కు(IPL Playoffs 2021) చేరువవ్వాలని ఆర్​సీబీ ప్రణాళికలు రచిస్తుంది.

06:49 September 20

టాప్​ న్యూస్​ @7AM

  • పిల్లల్లో కొవిడ్​ తీవ్రత తక్కువే..

చిన్నపిల్లల్లో కరోనా వ్యాప్తి(Corona effect on children), సోకాక వ్యాధి తీవ్రత తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World health organization) తెలిపింది. కానీ.. ఏడాదిలోపు శిశువుల్లో మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువ అని స్పష్టం చేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ కేసుల వృద్ధి కనిపిస్తోందని వెల్లడించింది.

  • మయన్మార్​లో భూకంపం..

మయన్మార్​లో భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 5.0గా నమోదైంది.

  • 0.47% పాజిటివిటీ రేటు..

రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్​ కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

  • 'వర్క్​ ఫ్రం హోం'కు ఫుల్​స్టాప్​..

కరోనా భయంతో సుమారు ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని(WORK FROM HOME)’ అవకాశం కల్పించిన ఐటీ(IT) కంపెనీలు.. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించే ప్రణాళికలు రచిస్తున్నాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు కసరత్తు చేస్తున్నాయి.

  • సుప్రీం ఆగ్రహం..

ట్రైబ్యునళ్లలో చేపట్టాల్సిన నియామక ప్రక్రియలో కేంద్రం చూపుతున్న అలసత్వాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు (Supreme Court). సెలెక్షన్‌ కమిటీ చేసిన సిఫార్సులను కాదని, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు కేంద్రం ఇటీవల చేపట్టిన నియామకాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

05:43 September 20

టాప్​ న్యూస్​ @6AM

  • గణపయ్యకు ఘన వీడ్కోలు..

రాష్ట్రవ్యాప్తంగా గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న విఘ్నేశ్వరుడు.. గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. మళ్లీ రావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ భక్తులు లంబోదరుడిని సాగనంపారు. ఆట పాటలు, కోలాటాల మధ్య గణనాథుడికి వీడ్కోలు పలికారు.

  • గంగమ్మ ఒడికి గణపయ్య..

భాగ్యనగరంలో గణేశుడి శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గతేడాది కొవిడ్‌ కారణంగా సాదాసీదాగా జరిగిన వేడుకలు.. ఈసారి వైభవంగా జరిగాయి. వర్షం కురిసినప్పటికీ నిమజ్జన వేడుకలు సందడిగా సాగాయి. ట్యాంక్‌బండ్‌ వద్ద ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. మొత్తం పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.

  • బాలాపూర్​ లడ్డూ చరిత్ర..

భాగ్యనగర గణేశ్​ ఉత్సవాలు అనగానే గుర్తొచ్చే బాలాపూర్‌ లడ్డు.. ప్రతి ఏటా పాత రికార్డులను తిరగరాస్తూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. కరోనా కారణంగా 2020 సంవత్సరం మినహాయిస్తే.. 1994 నుంచి ఇప్పటి వరకు బాలాపూర్‌ లడ్డూ వేలం జరుగుతూనే ఉంది. లడ్డూను దక్కించుకోడానికి ఏటికేడు పోటీ పెరుగుతూనే ఉంది. లడ్డూను దక్కించుకోవడానికి ఎంత మొత్తం వెచ్చించేందుకైనా భక్తులు వెనుకాడటం లేదు. ఫలితంగా 1994లో కేవలం రూ.450లతో మొదలైన లడ్డూ ధర.. ఈ సంవత్సరం ఏకంగా రూ.రూ.18.90 లక్షలు పలికింది.

  • విఫలమైన వ్యవసాయశాఖ..

దొడ్డు బియ్యం (ఉప్పుడు బియ్యం) కొనేది లేదని కేంద్రప్రభుత్వం చెబుతోంది. సన్నరకం వరి మాత్రమే సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. అయినా సన్నరకాల సాగు విస్తీర్ణం పెంచడంలో వ్యవసాయశాఖ విఫలమవుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వీటిని సగం విస్తీర్ణంలోనే వేసినట్లు తాజా సమాచారం. 

  • వైకాపా సునాయాస విజయం..

ఏపీలో పరిషత్‌ ఎన్నికల్లో(parishat elections) అధికార వైకాపా (ycp)సునాయాసంగా గెలుపొందింది. అన్ని ప్రాంతాల్లోనూ... వైకాపా జెండా రెపరెపలాడింది. ప్రతిపక్ష తెలుగుదేశం(tdp) ఎన్నికలను బహిష్కరించగా.. కొన్నిచోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 

  • సంస్కృతికి తెరపడేదెన్నడు?

మితిమీరిన వ్యక్తిపూజ, ఎల్లలు దాటిన ఆశ్రిత పక్షపాతం, అడ్డూఅదుపు లేని అవినీతితో దేశీయంగా రాజకీయాలకు మకిలి పట్టింది. ఈ సంస్కృతి కాంగ్రెస్​లో మరీ అధికం! 'ప్రజాస్వామ్యమంటే ఏకవ్యక్తి పాలన కాదు' అని చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీనే.. ఆ ప్రమాణం సొంత పార్టీకి వర్తిస్తుందని విస్మరించినట్లు ఇటీవలే పంజాబ్​ సీఎం ఉదంతం చూస్తే బోధపడుతోంది.

  • హస్తం ఎత్తుగడ..

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా (Amarinder Singh resigns) చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ కొత్త సీఎం పేరును ప్రకటించింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జీత్‌కు పట్టం కట్టింది. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

  • భారత్​కు రెట్రో-స్టైల్డ్‌ హార్లే డేవిడ్‌సన్..

త్వరలోనే ప్రీమియం మోటార్​ సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టనుంది దిగ్గజ వాహన తయారీ సంస్థ హీటో మోటోకార్ప్. రెట్రో-స్టైల్డ్‌ హార్లే డేవిడ్‌సన్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  • ప్రతీకారం తీర్చుకున్న సీఎస్​కే..

ఐపీఎల్​ (iPL 2021) రెండో దశ తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్ (Ml vs CSK)​ గెలిచింది. 20 పరుగులు తేడాతో ముంబయి ఇండియన్స్​ను ఓడించింది. సీఎస్​కే విజయంలో రుతురాజ్ గైక్వాడ్​(88*) కీలక పాత్ర పోషించాడు.

  • ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే!

ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు.. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ అవేంటి? ఎప్పుడొస్తున్నాయి? చూద్దాం..

Last Updated : Sep 20, 2021, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details