తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - top news of the hour

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Sep 19, 2021, 6:04 AM IST

Updated : Sep 19, 2021, 9:42 PM IST

21:31 September 19

టాప్​ న్యూస్ @ 10 PM

  • బై.. బై.. బాలాపూర్​ గణపయ్య

బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం (balapur Ganapati Immersion) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర పోలీస్​ శాఖ డీజీ శిఖా గోయల్​ సమక్షంలో... గంగమ్మ ఒడికి గణనాథుడిని సాగనంపారు.

  • నువ్వా... సీఎం గురించి మాట్లాడేది!

మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు (Minister Malla Reddy Comments) చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

  • కేరళపై కొవిడ్​ పంజా..

కేరళలో కొత్తగా 19,653 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఒక్కరోజే 1,697 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఎలా ఉందంటే..?

  • ఒక్క ఓటు.. మారుస్తుంది ఫేటు

ఏపీలోని కృష్ణా జిల్లావ్యాప్తంగా.. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ(mptc zptc results 2021) రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 41 జడ్పీటీసీ స్థానాలకు, 648 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు(mptc zptc results 2021).. జరుగుతుండగా... రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానపు ఫలితం ఉత్కంఠగా మారింది.

  • అదరగొట్టిన గైక్వాడ్

ఐపీఎల్​ రెండో దశ(ipl second phase schedule 2021) తొలి మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్​, అడం మిల్నే, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.

20:57 September 19

టాప్​ న్యూస్ @ 9 PM

  • నిమజ్జనం వైభవం .. పైనుంచి చూస్తేనే సరి..

హైదరాబాద్​లో గణేశుని నిమజ్జనం(ganesh immersion hyderabad) ప్రక్రియ కన్నుల పండువగా సాగుతోంది. ఈ ప్రక్రియను(ganesh immersion hyderabad) మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మహమూద్​ అలీ ఏరియల్​ వ్యూ (aerial view of hyderabad) ద్వారా పరిశీలించారు.

  • పెద్ద సమస్యే...!

తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు ఓ మందుబాబు. అంతేకాదు దానిని ఆచరించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు(mptc zptc results in ap 2021) ప్రక్రియలో అతడు చేసిన పని వెలుగులోకి రావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.  

  • ఫస్ట్​టైం ఇలా..

ఆర్మీ మహిళా అధికారికి తొలిసారిగా కీలక బాధ్యతలు అప్పగించింది సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ. ఆఫీసర్​ కమాండింగ్​గా మహిళా అధికారిని నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

  • మంటల నుంచి రక్షణ

కాలిఫోర్నియాలో కొనసాగుతున్న కార్చిచ్చు నుంచి ప్రఖ్యాత సీక్వోయా జాతీయ పార్కులోని వృక్షాలను రక్షించేందుకు అక్కడి సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. చెట్ల కాండాలకు అల్యూమినియం కాగితం చుట్టి తాత్కాలికంగా రక్షణ కల్పిస్తున్నారు.  

  • కుర్రాళ్లు కుమ్మేస్తారు

ఐపీఎల్​ రెండోదశలో కోల్​కతా నైట్​రైడర్స్(Kolkata Knight Riders)​ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్‌ హస్సీ(David Hussey) అన్నాడు. ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణాల ఆటతీరుతో ప్రపంచం షాక్​కు గురవుతుందని అభిప్రాయపడ్డాడు.

19:43 September 19

టాప్​ న్యూస్ @ 8PM

  • నేడు కొవిడ్​ కేసులు ఎన్నంటే..!

రాష్ట్రంలో కొత్తగా 173(corona cases) కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి దెబ్బకు మరొకరు బలయ్యారు. వైరస్ బారి నుంచి 315 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • డ్రోన్​దాడిని తిప్పికొట్టేందుకు

డ్రోన్​ దాడులను(Drone Attack) ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు.. కీలక నిర్ణయం తీసుకున్నాయి. తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను(Drone Attack) నేలకూల్చడానికి ప్రాణాంతకం కాని పంప్ యాక్షన్ గన్​లను ఇకపై వినియోగించనున్నాయి.

  • అమెరికా గురి ఎలా తప్పింది..!

అఫ్గాన్ నుంచి బయటకు వచ్చే ముందు కాబుల్​లో రెండుసార్లు డ్రోన్ దాడులు (US drone strike) నిర్వహించింది అమెరికా. ఈ దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించినా... ఇందులో మరణించింది అమాయక పౌరులే. (Kabul drone strike civilian casualties). అయితే, అమెరికా గురి తప్పడానికి కారణమేంటి? అసలు ఘటన ఎలా జరిగిందో ఓసారి చూద్దాం.

  • రోహిత్​ లేకుండానే..

ఐపీఎల్​ రెండో దశ(ipl second phase) తొలి మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది సీఎస్కే. సారథి రోహిత్​ శర్మ లేకుండానే బరిలో దిగనుంది ముంబయి ఇండియన్స్​.

  • ఆ క్రేజీ జోడి.. నాలుగోసారి

 త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ ఓ పాత్రలో మెరవబోతున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలకు కలసి పనిచేసి హ్యాట్రిక్ కొట్టిన త్రివిక్రమ్-బన్నీ ద్వయం.. మరోసారి అలరించనుంది. ఈ షూటింగ్ లోకేషన్​ నుంచి విడుదలైన ఓ స్టిల్​లో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

18:50 September 19

టాప్​ న్యూస్ @ 7PM

  • అంతా పక్కాగా ఉంది

భాగ్యనగరంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(GHMC Mayor) స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.  

  • కొత్త సీఎం ఆయనే..

పంజాబ్​ కొత్త సీఎంగా(Punjab New CM) చరణ్​జీత్ సింగ్ చన్నీని(Charanjit Singh Channi) కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ ఇన్​ఛార్జ్​ హరీశ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • సాగరంలో పట్టేశారు..

భారీ స్థాయిలో డ్రగ్స్ తరలిస్తున్న ఇరాన్​ పడవ (Boat carrying drugs in India) పోలీసులకు చిక్కింది. భారత జలాల్లోకి ప్రవేశించిన పడవను గుజరాత్ ఏటీఎస్(Gujarat ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది పట్టుకున్నారు. ఏడుగురు ఇరానీలను అరెస్టు చేశారు.

  • అవునా..! అలాంటి ఫోన్లు వస్తున్నాయా..

భూకంపాలను గుర్తించే స్మార్ట్​ ఫోన్లు త్వరలో మార్కెట్​లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం వాతావరణం, పిడుగులు పడే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి లాంటి సమాచారాన్ని ముందస్తుగానే అందించిన స్మార్ట్​ఫోన్లు.. ఇకపై భూకంపాలను గుర్తించి, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తాయి.  

  • ఆ రోజు స్పెషల్​ షో..

బాలకృష్ణ-వి.వి.వినాయక్​ కాంబోలో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబరు 25 నాటికి ఈ చిత్రం విడుదలై 19 ఏళ్లు కానున్న సందర్భంగా మరోసారి ఈ సినిమా ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు. ఎక్కడంటే..

17:51 September 19

టాప్​ న్యూస్ @ 6PM

  • నగరంలో వాన..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాన దంచికొడుతున్నా... గణేశ్​ శోభాయాత్ర అదే ఉత్సాహంతో సాగుతోంది. అయితే భారీవర్షంతో రోడ్లపైకి నీరు చేరి అక్కడక్కడా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

  • రోజుకు 328 మంది బలి..

గడిచిన మూడేళ్లలో సుమారు 3.92 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో (road accidents in India 2020) మరణించారని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB report 2020) వెల్లడించింది. గతేడాది లక్షా 20 వేల మంది చనిపోయారని తెలిపింది. సగటున రోజుకు 328 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంది.

  • మూవీ లవర్స్​కు బంపర్ ఆఫర్

సినిమాలు చూడటం మీకు హాబీనా? మిమ్మల్ని మీరు మూవీ బఫ్ అనుకుంటున్నారా? హారర్ సినిమాలను (Horror Movies) వరుసబెట్టి చూసేస్తున్నారా? వీటికి అవునన్నది సమాధానమైతే.. మీకో సువర్ణ అవకాశం! జస్ట్ 13 సినిమాలు చూసి పెడితే చాలు.. మీకు 1300 డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఓ ఫైనాన్స్ సంస్థ.. ఆ వివరాలు మీకోసం.  

  • తగ్గేదేలే...

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ మొదలవనున్న వేళ ఆర్​సీబీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ ప్రారంభంలో ఆడినట్లే ఇప్పుడూ ఆడతామని స్పష్టం చేశాడు. నూతన ఆటగాళ్ల చేరికతో జట్టు బలోపేతంగా తయారైందని అభిప్రాయపడ్డాడు.

  • ఈమె చాలా హాట్​ గురూ..!

'ఇస్మార్ట్​ శంకర్'​తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కన్నడ భామ నభా నటేష్​.. తన అందంతో యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్​మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్​ ఫొటోలను పోస్ట్​ చేస్తూ కుర్రకారులను మాయ చేస్తోంది.  

16:52 September 19

టాప్​ న్యూస్ @ 5PM

  • 11ఏళ్లుగా.. ఈరోజున లక్షమందికి అన్నదానం

హైదరాబాద్​ మహానగరంలో ఏటా గణేశ్​  నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓ వ్యాపార వేత్త పదకొండేళ్లుగా నిమజ్జనోత్సవంలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు.  

  • ఒక్కరోజు హడావుడేనా?

రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్​ జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News). గత పది రోజులుగా వ్యాక్సినేషన్​ ప్రక్రియకు సంబంధించిన గ్రాఫ్​ను ట్విట్టర్​లో షేర్ చేశారు.

  • ఐటీ జాబ్​ కావాలా..?

ఐటీలో కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. ఎన్​క్యూటీ(నేషనల్​ క్వాలిఫయర్​ టెస్ట్​).. రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది(tcs nqt 2021) టీసీఎస్​. 2021 డిసెంబర్​, 2002 మార్చి కోసం ప్రకటన విడుదల చేసింది(nqt 2021). ఈ పరీక్షతో ప్రయోజనం ఏంటి? ఎవరికి అర్హత? వంటి వివరాలు తెలుసుకోండి.

  • వామ్మో..! ఇది మామూలు స్టంట్​ కాదు..

ఫ్రాన్స్​ పారిస్​లోని ప్రఖ్యాత ఐఫిల్​ టవర్​ వద్ద ఓ వ్యక్తి.. శనివారం ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. ఐఫిల్​ టవర్ మొదటి అంతస్తు నుంచి ట్రోకాడెరో స్క్వేర్ ప్రాంతంలోని ఓ థియేటర్​ పైకప్పునకు కట్టిన సన్నటి తాడుపై నడిచాడు  నాథన్​ పౌలిన్​ అనే రోప్​వాకర్​ ఆర్టిస్ట్​.

  • మొక్కలు నాటిన అమీర్​ఖాన్​..

కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్​ను బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, విలక్షణ చిత్రాల హీరో అమీర్‌ఖాన్‌ స్వీకరించారు. హైదరాబాద్ నగరానికి చేరుకున్న అమీర్‌ఖాన్‌... బేగంపేట విమానాశ్రయం ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.  

15:51 September 19

టాప్​ న్యూస్ @ 4PM

  • వెళ్లొస్తా.. అందరూ జాగ్రత్త..

గత తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. వచ్చే ఏడాది కలుసుకుందామంటూ వీడ్కోలు తీసుకున్నారు.

  • పంజాబ్​ నూతన సీఎం ఆయనేనా..!

పంజాబ్​​ నూతన సీఎంగా  సుఖ్​జిందర్​ సింగ్ రంధావా పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి అందరి ఆ ఆమోదంతో ఈ ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

  • గడపదాటొద్దు..

అఫ్గాన్​ రాజధాని కాబుల్​లో పనిచేసే మహిళలు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశాలిచ్చింది తాలిబన్​ ప్రభుత్వం. డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పింది.

  • ఈవారం ఎలా..!

దేశీయ స్టాక్ మార్కెట్లలో (Stock Market) బుల్ రన్ కొనసాగుతోంది. సూచీలు రికార్డు స్థాయిలో కదలాడుతున్నాయి. మరి ఈ వారం మార్కెట్ల పోకడ ఎలా ఉండనుంది? (Stock Market next week outlook) ఏఏ అంశాలు ప్రభావం చూపనున్నాయి? ఓసారి కన్నేద్దాం.

  • తల్లిదండ్రులపై కేసు పెట్టిన స్టార్​హీరో..

అనుమతి లేకుండా తన పేరు ఉపయోగిస్తున్న తండ్రి చంద్రశేఖర్​పై(hero vijay family) హీరో విజయ్ కేసు పెట్టారు. ఆయన స్థాపించిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

14:39 September 19

టాప్​ న్యూస్ @ 3PM

  • వానలోనూ అదే జోరు..

భాగ్యనగరాన్ని మరోసారి వరణుడు(Rain in Hyderabad) పలకరించాడు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం(Rain in Hyderabad) కురిసింది. మహాగణపతి నిమజ్జనానికి వెళ్లిన భక్తులు వానలో తడిసిముద్దయ్యారు. 

  • అరుదైన గౌరవం

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్​లాండ్​లోని దావోస్​లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం నిర్వహించే వార్షిక సదస్సు-2022 కు హాజరుకావాల్సిందిగా డబ్య్లూఈఎఫ్​ నుంచి కేటీఆర్​కు ఆహ్వానం అందింది. 

  • అందరూ చూస్తుండగానే..

ఉత్ర్​ప్రదేశ్​ మొరాదాబాద్​లో పట్టపగలే అందరూ చూస్తుండగా.. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షతో ఆ వ్యక్తిని మరో వ్యక్తి అతి దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. నడి రోడ్డుపై జరుగుతున్న ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

  • బోటు ప్రమాదంలో 8 మంది మృతి

ఓ బోటు ప్రమాదంలో 8 మంది మృతిచెందగా ఏడుగురు గల్లంతయ్యారు. చైనా గుయీజ్​హూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

  • వాళ్లు రెడీ.. మీరు రెడీనా..!

కొత్తగా ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఫ్రిడ్జ్​లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్​. పండుగ సీజన్​ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్​ (Amazon Great Indian Festival), ఫ్లిప్​కార్ట్​ (Flipkart Big billon days)​ స్పెషల్​ సేల్​కు సిద్ధమయ్యాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

13:40 September 19

టాప్​ న్యూస్ @ 2PM

  • 231 విగ్రహాలు నిమజ్జనం

 భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. ట్యాంక్‌బండ్‌పైన 15 క్రేన్లతో గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనం జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 231 విగ్రహాలు నిమజ్జనం చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఎప్పటికప్పుడు లైవ్ అప్​డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • నిమజ్జనోత్సవంలో సజ్జనార్‌ సందడి..

భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనాలు సందడిగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నిమజ్జనోత్సవంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొని సందడి చేశారు. విభిన్నమైన రీతిలో వినాయకుడిని ఊరేగించారు. ఆర్టీసీ బస్సులో కూర్చుని కుటుంబసభ్యుల సందడి మధ్య వినాయక విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్లారు.

  • కలెక్టర్​గా ఏడో తరగతి విద్యార్థిని

చిన్న నాటి నుంచి ఎంతో చురుకుగా ఉండే ఓ 11 ఏళ్ల బాలిక.. ఐఏఎస్​ కావాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఆమెను చూసి విధి కన్నెర్రజేసింది. బ్రెయిన్​ ట్యూమర్​ రూపంలో తన జీవితాన్ని తలకిందులు చేసింది. అయినా కలెక్టర్​ కావాలన్న ఆమె కోరిక తీరింది. ఉత్తర్​ప్రదేశ్​లోని అహ్మదాబాద్​ జిల్లాకు(Ahmedabad news) ఒక రోజు కలెక్టర్​గా(one day collector)విధులు నిర్వర్తించి తన కలను సాకారం చేసుకుంది. అది ఎలాగంటే?

  • రికార్డులే రికార్డులు

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. మరో అరుదైన రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొటితే టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు(Rohit Sharma T20 Sixes) కొట్టిన భారత తొలి బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు. అయితే ఆదివారం ఐపీఎల్​లో(IPL 2021) జరగనున్న చెన్నైతో జరగనున్న తొలిమ్యాచ్​లోనే ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

  • పరీక్షలు పెద్దవేం కావు

12:52 September 19

టాప్​ న్యూస్ @1PM

  • బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?

భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో.. లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్​ లడ్డూను 18.90 లక్షలకు మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్​లు దక్కించుకున్నారు. లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణరావు ప్రారంభించారు. 

  • రేవంత్ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం

గాంధీభవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో అధికార పార్టీ వైఫల్యాలపై ఎలా పోరాడాలన్న అంశంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

  • ​ హైకమాండ్​ తర్జనభర్జన

పంజాబ్​ తదుపరి సీఎంపై ఆదివారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది(punjab cm election). కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.(punjab congress crisis)

  • నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం అల్లకల్లోలం

తెల్లారి లేస్తే మనకి లెక్కలతోనే పని. డబ్బు లెక్కలు తప్పామంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి. అదే మన శరీరం కొన్ని లెక్కలు తప్పిందంటే ఏకంగా ఆరోగ్యమే తలకిందులైపోతుంది. అందుకు నిదర్శనం- తాజాగా ప్రభుత్వం వెలువరించిన లెక్కలు.. తెలంగాణలో 56 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం మరణాలకు రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలే కారణమట. మరో పక్క ప్రపంచవ్యాప్తంగానూ అధిక రక్తపోటు సమస్య లక్షలాది ప్రాణాలను హరిస్తోందని ఇటీవలే లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనమూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రక్తపోటు లెక్కల కథేమిటో చూద్దాం!

  • ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు

టీ20 ప్రపంచకప్​లో యువరాజ్​ సింగ్ వరుసగా ఆరు బంతుల్లో(Yuvraj Singh 6 Sixes) ఆరు సిక్సులు బాది సరిగ్గా 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ ఇన్నింగ్స్​ను మరోసారి గుర్తు చేసుకుందాం.

11:51 September 19

టాప్​ న్యూస్ @12PM

  • సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద కోలాహలం.. 

సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాల కోలాహలం నెలకొంది. నిమజ్జనానికి 9 క్రేన్లు ఏర్పాటు చేసింది జీహెచ్​ఎంసీ. విగ్రహాలు తీసుకువచ్చిన వాహనాలు మొరాయిస్తే తరలించేందుకు మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ పరిధిలో 134 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. 240 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ పనులు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు, లైవ్ అప్​డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఐదుగురు దుర్మరణం

నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కట్టంగూర్ మం. ముత్యాలమ్మగూడెం శివారులో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద కారు కంటైనర్‌ను ఢీకొని చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ముత్యాలమ్మగూడెం వద్ద మరో ప్రమాదంలో ఇద్దరు మృతి మృతి చెందారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • గాలి ద్వారా వ్యాపించేలా కరోనా..

కరోనా డెల్టా వేరియంట్​ (Corona Delta variant)​ గురించి శాస్త్రవేత్తలు మరో ఆందోళనకరమైన విషయాన్ని కనుగొన్నారు. గాలి ద్వారా వ్యాపించేలా ఈ వైరస్​ రూపాంతరం (UMD research on Corona) చెందుతున్నట్లు తెలిపారు. అయితే దీనిని అడ్డుకునేందుకు పలు సూచనలు చేశారు పరిశోధకులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • వారికి నో ఎంట్రీ!

ఐపీఎల్​ రెండో దశ(IPL 2021) జరగనున్న నేపథ్యంలో మ్యాచ్​లను చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా కొవిడ్​ నిబంధనలు పాటించాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సినేషన్​(2 Doses of Covid Vaccine) తీసుకున్న వారికే అనుమతించడం సహా 16 ఏళ్ల లోపు వారికి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్​లను నిర్వహించనున్న మూడు వేదికల్లో విధించిన రూల్స్(Covid-19 Rules in UAE) ఏమిటో తెలుసుకుందాం.

  • హనీమూన్‌కెళ్లాం..!

ఈ కరోనా ఏమో గానీ అందరినీ పిలిచి ఆడంబరంగా చేసుకోవాల్సిన వివాహాలు కాస్తా నిరాడంబరంగా జరిగిపోతున్నాయి. పెళ్లికిసంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పంచుకుంటే తప్ప ఫలానా వాళ్ల పెళ్లైపోయిందన్న విషయం తెలియట్లేదు. బబ్లీ బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌ పెళ్లి విషయం కూడా అందరికీ ఇలాగే తెలిసింది. సెప్టెంబర్‌ 9న సంజయ్‌తో తన వివాహం జరిగినట్లు తన పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుల జంట హనీమూన్‌లో భాగంగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ల పెళ్లి ముచ్చట్లు, ప్రేమ కబుర్లేంటో మనమూ తెలుసుకుందాం.

10:47 September 19

టాప్​ న్యూస్ @11AM

  • రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో.. లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్​ లడ్డూను 18.90 లక్షలకు మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్​లు దక్కించుకున్నారు. లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణరావు ప్రారంభించారు. 2019లో బాలాపూర్ లడ్డూ 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు.

  • కొనసాగుతున్న  శోభాయాత్ర..

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్‌ మహాగణపతి ఊరేగింపు సాగుతోంది. ఊరేగింపు రథంపై భక్తులకు దర్శనమిస్తున్న మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

  • మరో 30వేల మందికి వైరస్​

దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus update) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,773 మంది​ కొవిడ్​ (Corona virus India) బారినపడ్డారు. మరో 309 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే 38,945 మంది వైరస్​ను జయించారు.

  • ఉద్ఘాటన వైపు అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Yadadri temple) ఉద్ఘాటన పర్వానికి సమయం ఆసన్నమైంది. హరిహరుల ఆలయాల్లో ముందస్తు కైంకర్యాలు ప్రారంభించి, ప్రసాదాల తయారీ యంత్రాల ట్రయల్​ రన్​ నిర్వహించారు.

  • పెరిగిన బంగారం ధర..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

09:53 September 19

టాప్​ న్యూస్ @10AM

  • తెలంగాణ కుర్రాడికి గ్రాండ్​మాస్టర్​ హోదా

తెలంగాణకు చెందిన కుర్రాడు రాజా రిత్విక్​(Raja Rithvik Chess) చెస్​ గేమ్​లో గ్రాండ్​మాస్టర్​గా అవతరించాడు. హంగేరీలో జరుగుతోన్న వెజర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్‌ టోర్నీలో నాలుగు రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న రిత్విక్‌ .. 2501 ఎలో రేటింగ్‌ చేరుకోవడం వల్ల జీఎం హోదా దక్కింది. రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మూడో చెస్​ ఆటగాడిగా.. దేశంలో 70వ గ్రాండ్​మాస్టర్​గా రాజా రిత్విక్​ నిలిచాడు.

  • నిమజ్జనం వేళ.. నిర్లక్ష్యం వద్దు

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు(Ganesh immersion 2021) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నిమజ్జన వేళ జనం ఎక్కువ గుమిగూడే అవకాశమున్నందున ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉండటం వల్ల నిమజ్జన వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మూడో ముప్పు విజృంభించి విలయం సృష్టిస్తుందని హెచ్చరించారు.

  • కాంగ్రెస్​కు చిక్కులు!

పంజాబ్​ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్‌ సింగ్​(amarinder singh news) రాజీనామా చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా ఆయన ఏకపక్ష వైఖరే కారణంగా తెలుస్తోంది. కాగా అమరీందర్​ అనుసరిస్తున్న ఒంటెద్దు తీరుతో అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి(Punjab politics news) ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఒత్తిడితో ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

  • తాలిబన్లతో చర్చించా..

అఫ్గానిస్థాన్​లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లతో(Afghanistan Taliban) చర్చించినట్లు వెల్లడించారు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan on Taliban). ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరైన పనే చేశారని అన్నారు.

  • మహేశ్​బాబును సిగరెట్​ మాన్పించిందట!

అవును.. మీరు విన్నది నిజమే! టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. ఓ పుస్తకం తన సిగరెట్​ మాన్పించేసిందని అంటున్నారు. అంతేకాదు మన టాలీవుడ్​ సినీ నటుల్లో ఎంతో మందికి పుస్తక పఠనం అలవాటు ఉంది. మరికొంత మందికి పుస్తకాలు చదవటమే కాదు.. సేకరించటమూ ఇష్టమట. అలా వారు చదివిన పుస్తకాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వాటి సంగతులేంటో చూసేయండి.

08:50 September 19

టాప్​ న్యూస్ @9AM

  • మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్‌ మహాగణపతి ఊరేగింపు సాగుతోంది. ఊరేగింపు రథంపై భక్తులకు దర్శనమిస్తున్న మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

  • పరిషత్ ఎన్నికల కౌంటింగ్

ఆంధ్రప్రదేశ్​లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. దీని కోసం 958 హళ్లను ఏర్పాటు చేశారు. 609 మంది ఎన్నికల అధికారులు... 1,047 మంది సహాయ ఎన్నికల అధికారులు... 11,227 మంది పర్యవేక్షకులు... 31,133 మంది సహాయ పర్యవేక్షకులు విధుల్లో పాల్గొన్నారు. 

  • రైతుకు సగటు రాబడి ఎంతో తెలుసా?

మన రైతుల ఆదాయం నానాటికి దిగజారిపోతోంది. దేశంలో మొత్తం 10.18 కోట్ల భూమి కమతాలుంటే అందులో 2.50 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులే 72.6 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 2.50 ఎకరాల్లోపు ఉన్నవారు 53 శాతం, తెలంగాణలో 42.2 శాతం మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూములు, రైతు కుటుంబాలు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై జాతీయ నమూనా సర్వే చేసింది. ఈ వివరాలను కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసింది.

  • పెళ్లికొడుకు నచ్చలేదని..

ఎవరినైనా ప్రేమిస్తే కొందరు ఇంట్లో వాళ్లను ఒప్పిస్తారు. వాళ్లు ఒప్పుకోకుంటే అప్పుడే ప్రేమించినవాళ్లతో వెళ్లిపోతారు. లేకుంటే తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక వాళ్లు చూసిన వారినే పెళ్లి చేసుకుంటారు. ఓ అమ్మాయి కూడా పేరెంట్స్​ చూసిన సంబంధాన్నే చేసుకుంది. కానీ... పెళ్లి జరిగి గంట కూడ కాకుండానే ప్రియుడితో వెళ్లిపోయింది.

  • అనుమానితులకు సమన్లు

కేసులో నిందితుడు కానప్పటికీ, నేరం చేశాడేమోనన్న అనుమానంతో సమన్లు(court summons) ఇవ్వాలంటే దృఢమైన, విశ్వసనీయమైన సాక్ష్యాలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేగాని విచారణ జరుగుతున్నప్పుడుగానీ, దర్యాప్తులో భాగంగా గానీ ఎవరిపైనైనా అనుమానం వచ్చినప్పుడు వారికి ఇష్టం వచ్చిన రీతిలో సమన్లు ఇవ్వకూడదని పేర్కొంది.

07:51 September 19

టాప్​ న్యూస్ @8AM

  • రూట్ చూస్కొని వెళ్లండి.. 

గణేశుడి మహా శోభాయాత్రకు మహానగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు సంస్థ, జలమండలి ఇలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహాగణపతి శోభాయాత్రల దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions in Hyderabad) విధించారు. పనులపై బయటకు వెళ్లేవారు, కార్యాలయాలకు వెళ్లేవారు.. ఆంక్షలు చూసుకుని, గూగుల్​మ్యాప్స్​లో తాము ఎప్పటికప్పుడు చేసే రూట్​ అప్​డేట్స్​ను ఫాలో అవుతూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

  • గణనాథునికి ఇష్టమైన పూర్ణం బూరెలు!

వినాయక చవితికి మరో స్పెషల్ వంటకం పూర్ణం బూరెలు. గణనాథునికి ఇష్టమైన ప్రసాదంగా చెప్పుకునే ఈ పూర్ణాలు తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీని తయారీ విధానాన్ని తెలుసుకోండిలా..


వాటి పాత్రెంతో కీలకమట!

మొక్కల(Leafy vegetables) ద్వారా ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఆహార పదార్థాలు కరోనాను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తున్నాయని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఆకుకూరలు(Leafy vegetables), కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకుంటున్న వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు తేలింది.

  • జీఎస్‌టీఆర్‌-1 దాఖలుకు వీలుండదు

జీఎస్‌టీఆర్‌-3బీని (GST return) ఒక్క నెల ఆపేసినా జీఎస్‌టీఆర్‌-1 దాఖలుకు ఇకపై వీలుండదు. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకిరానుంది.

  • మరిన్ని అవకాశాలు వస్తాయి

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్​స్టార్ సంస్థ.. తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్న హీరో రామ్​చరణ్​ మాట్లాడుతూ.. దీని ద్వారా నటులు, సాంకేతిక వర్గాలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

06:45 September 19

టాప్​ న్యూస్ @7AM

  • శోభాయమానంగా శోభాయాత్ర..

  భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. కాసేపట్లో బాలాపూర్‌ గణేశ్ లడ్డూ వేలంపాట ప్రారంభంకానున్నది. గణేశ్‌ ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్‌ లడ్డూ వేలంపాట.. కొవిడ్‌ కారణంగా గతేడాది జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లడ్డూ ఎంత ధర పలుకుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. బాలాపూర్ లడ్డూ వేలం నుంచి, ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం వరకు ఎప్పటికప్పుడు లైవ్ అప్​డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • గంగ ఒడికి చేరనున్న ఖైరతాబాద్ మహాగణపతి..

ఖైరతాబాద్​ మహాగణపతి గంగ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. తొమ్మిది రోజులపాటు భక్తులకు కనువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడు.. నేడు గంగ ప్రవేశం చేయనున్నాడు. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం గణనాథుడిని సాగనంపేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • నాయకుల్లా వ్యవహరించండి

కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). తమ బృందాలకు.. కార్యదర్శుల్లా కాకుండా నాయకుల్లా వ్యవహరించాలని సూచించారు.

  • విజయం ఎవరిదో!

ఐపీఎల్​ 14వ సీజన్​(ipl 2021 time table) రెండో విడతలో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్(csk vs mi 2021). ఈ రెండు జట్ల మధ్య పోరుతో యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్​ ప్రారంభంకానుంది.

  • ఉత్తమ నటుడిగా మహేశ్‌..

తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది లేడీ సూపర్​ స్టార్ నయనతార. నయన్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ పార్టీకి ఆశ్చర్యపోయినట్లు విఘ్నేష్ శివన్ తెలిపారు.

04:23 September 19

టాప్​ న్యూస్ @6AM

  • నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం..

హైదరాబాద్​లో గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా 27వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించనున్నాయి. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

గణేశ్​ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరంలో పెద్దఎత్తున కొనసాగనున్న నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికెడ్లు ఏర్పాటు చేశారు.

  • మరో 8 ఎంఎంటీఎస్​ సర్వీసులు..

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో 8 ఎంఎంటీఎస్​ సర్వీసులను నడపనుంది. ఉదయం 8:45 గంటల నుంచి రాత్రి 11:20 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

  • మంత్రికి డాక్టరేట్..

ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్​షిప్​ అసోసియేషన్ 28వ వారోత్సవాలు హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.

  • పెళ్లిపిల్ల మాయం..

వివాహమైన అరగంటకే వధువు మాయమైంది. అదేంటనుకుంటున్నారా..? నిజమేనండి. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. పెళ్లి కాగానే.. బ్యూటీ పార్లర్​కు వెళ్లొస్తానని పట్టుబట్టిన ఆ పెళ్లికూతురు మళ్లీ కనిపించలేదు. అసలు ఆ అమ్మాయి ఎటు వెళ్లిందంటే..?

  • నేడే కౌంటింగ్​..

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలవుతాయని.. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

  • చాపకింద నీరులా నల్లధనం..

పన్ను ఎగవేతలు, అక్రమాలతో దేశంలో ఇబ్బడిముబ్బడిగా నల్లధనం (black money) పెరిగిపోయింది. సంస్కరణలతో దాని భరతం పట్టాలని చూసినా నానాటికీ కోరలు చాస్తునే ఉంది. రాజకీయ నాయకులు నిజాయతీపరులైనప్పుడు అవినీతికి తావుండదు. స్కాండినేవియా దేశాల్లో మేలైన ప్రజా జీవనం నెలకొనడానికి కారణమిదే. మరి భారత్​లో పరిస్థితి మారాలంటే?

  • కేపిటల్‌ వద్ద ఉద్రిక్తత..

అమెరికాలోని క్యాపిటల్​ భవనంపై దాడికి పాల్పడినవారికి మద్దతుగా శనివారం అదే ప్రాంతంలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్​ మద్దతుదారులు. ఈ నేపథ్యంలో పార్లమెంటు భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • విజయం ఎవరిదో!

ఐపీఎల్​ 14వ సీజన్​(ipl 2021 time table) రెండో విడతలో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్(csk vs mi 2021). ఈ రెండు జట్ల మధ్య పోరుతో యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్​ ప్రారంభంకానుంది.

  • ఉత్తమ నటుడిగా మహేశ్‌..

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)-2019 వేడుక దుబాయ్​లో ప్రారంభమైంది. 2019కి గాను ఉత్తమ నటుడిగా సూపర్​ స్టార్ మహేశ్ బాబు అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'జెర్సీ' ఎంపికైంది.

Last Updated : Sep 19, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details