తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Sep 17, 2021, 5:55 AM IST

Updated : Sep 17, 2021, 10:01 PM IST

21:58 September 17

టాప్​ న్యూస్​ @10PM

ఇది సమయం కాదు

జీఎస్టీ(GST Council Meeting) పరిధిలోకి పెట్రోల్​, డీజిల్​ను చేరిస్తే.. పెరుగుతున్న ధరలతో కాస్త ఉపశమనం లభిస్తుందనుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన 45వ జీఎస్టీ సమావేశంలో(GST Council Meeting Today) దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. జీఎస్టీలోకి పెట్రో ధరలను తెచ్చేందుకు ఇది సమయం కాదని మండలిలోని సభ్యులు భావించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman News) వెల్లడించారు. 

కొత్తగా 241 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 241 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. మరో 298 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.


మోదీ కీలక వ్యాఖ్యలు

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంపై అంతర్జాతీయ సమాజం విస్త్రతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్నారు ప్రధాని మోదీ. ఈ విషయంలో ఐరాసకు భారత్​ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్​సీఓ-సీఎస్​టీఓ సదస్సుకు వర్చువల్​గా హాజరైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.


అబ్బాయిలకే చదువులు..

6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు క్లాసులకు హాజరుకావాలని తాలిబన్లు ఆదేశించారు(taliban girls education). ఈ ప్రకటనలో బాలికలు, మహిళల చదువుకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం సర్వత్రా చర్చనీయాశమైంది. తాలిబన్ల పాలనలో మహిళలు ఇళ్లకే పరిమితమవ్వాలన్న ఆందోళనలు మరింత పెరిగాయి.


అలా ఆడితే కుదరదు

డిఫెండింగ్ ఛాంపియన్​ టైటిల్ నిలబెట్టుకోవాలంటే ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021)​ చెలరేగి ఆడాల్సిన అవసరముందని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్(kevin pietersen ipl). చెన్నైకి కూడా ఈసారి టైటిల్ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు.

21:09 September 17

టాప్​ న్యూస్​ @9PM

పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారు

పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారని పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన దళిత, గిరిజన దండోర సభలో రేవంత్​ ప్రసంగించారు.


కనిపించగానే కాల్​ చేస్తే రూ.30 వేల రివార్డు..

పన్నెండేళ్ల నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం తప్పిపోయిందని ఓ జంతు ప్రేమికురాలు అల్లాడిపోయింది. కనిపించకుండా పోయిన రోజు నుంచి ప్రతీ చోట వెతుకుతూనే ఉంది. కనపడిన వాళ్లందరినీ.. తన కుక్క అగుపించిందా అని అడుగుతూనే ఉంది. కనిపిస్తే చెప్పండని వేడుకుంటూనే ఉంది. ఏడు నెలలయినా.. దొరకకపోవటంతో... తన కుక్కను వెతికేందుకు జనాలు ఆసక్తి చూపాలని సరసమైన రివార్డు ప్రకటించింది.


అంతలోనే తుపాకీ తూట్లకు బలి

పెళ్లైన ఓ వ్యక్తి.. యువతి ఆరేళ్లుగా ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇరువురినీ తుపాకీతో కాల్చి దారుణ హత్యకు ఒడిగట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో(Shahjahanpur News) జరిగింది.


మళ్లీ 'పెట్రో' భారం

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Diesel Price) భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.


డిఫరెంట్​ లుక్​లో అదాశర్మ

సోషల్​మీడియాలో నిత్యం తమ అందచందాలతో అభిమానులను అలరిస్తుంటారు కథానాయికలు. ఇవాళ కూడా పలువురు ముద్దుగుమ్మలు తమ ఫొటోలను పోస్ట్​ చేసి తమవైపు చూపు తిప్పుకునేలా చేశారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దాం...

20:08 September 17

టాప్​ న్యూస్​ @8PM

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్​ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్పొన్నారు.


అమ్మాయిలు ఇళ్లకే!

6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు క్లాసులకు హాజరుకావాలని తాలిబన్లు ఆదేశించారు(taliban girls education). ఈ ప్రకటనలో బాలికలు, మహిళల చదువుకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం సర్వత్రా చర్చనీయాశమైంది. తాలిబన్ల పాలనలో మహిళలు ఇళ్లకే పరిమితమవ్వాలన్న ఆందోళనలు మరింత పెరిగాయి.


ఇక పూర్తిగా దేశీయంగానే!

దేశీయంగా పూర్తి స్థాయిలో ఏసీలు, ఎల్​ఈడీల విడి భాగాల ఉత్పత్తికి.. 52 కంపెనీలు రూ.5,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల రంగానికి(White Goods PLI Scheme) కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకుని ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి.


కెరీర్ ముగిసినట్లు కాదు

టీ20 ప్రపంచకప్(mohammed siraj t20 world cup)​ జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందని తెలిపాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు.


వన్నె తగ్గని అందం..

ఒకప్పుడు తన అందం, నటనతో హీరోయిన్​గా అలరించి ఎంతోమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది నటి స్నేహ. క్లాస్​, డీసెంట్​ పాత్రలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచింది. ఇప్పుడు సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ సపోర్టింగ్​ రోల్స్​ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సీనియర్​ నటి అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఈమె ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

20:07 September 17

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్​ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్పొన్నారు.


 

18:42 September 17

టాప్​ న్యూస్​ @7PM

లావాదేవీలపై తనీష్‌ను ప్రశ్నించిన ఈడీ

టాలీవుడ్​లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి ఈడీ విచారణకు నటుడు తనీష్​ హాజరయ్యారు. మనీలాండరింగ్​ వ్యవహారంలో సుమారు 7 గంటలపాటు తనీష్​ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రశ్నించారు. తనను మళ్లీ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదన్న నటుడు తనీష్.. విచారణకు రమ్మంటే మళ్లీ వస్తానన్నారు.  


బ్యాగులో రూ.లక్ష నగదు.. ఎత్తుకెళ్లిన కోతి

కోతులు చేసిన అల్లరి కారణంగా.. డబ్బులు పోగొట్టుకున్నారు ఓ న్యాయవాది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ రామ్​పుర్​లో జరిగింది. న్యాయవాది వినోద్ వద్ద రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ బ్యాగును తీసుకుని ఓ చెట్టు ఎక్కిన వానరం.. అందులో నుంచి రూ.50 వేల కట్టను తీసి కిందకు విసిరింది. అయితే ఇంకో రూ.50 వేల కట్టల నుంచి మాత్రం ఒక్కో నోటు తీసి, గాల్లోకి విసిరింది. దీంతో రూ.8,500 వరకు వినోద్ నష్టపోయారు. ఈ కోతి చేష్టలను గమనించి పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.


బిడ్డకు తండ్రి ఆయనే...

తల్లయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న బంగాలీ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్​ జహాన్​(Nusrat Jahan Husband) బిడ్డకు తండ్రి ఎవరో తెలిసింది. భర్తతో విడిపోయిన తర్వాత.. ప్రముఖ నటుడితో డేటింగ్​లో ఉన్నట్లు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె(Nusrat Yash Baby) బిడ్డకు తండ్రెవరనే విషయం హాట్​ టాపిక్​గా మారింది.

17,600 దిగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్ల (Stock Market) రికార్డులకు వారాంతంలో బ్రేక్​ పడింది. సెన్సెక్స్ (Sensex Today) 126 పాయింట్లు తగ్గి.. 59,100 మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ (Nifty Today) 44 పాయింట్లు​ నష్టంతో 17,600 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.


రికార్డు ధరే లక్ష్యంగా!

ప్రధాని నరేంద్రమోదీ(e auction of pm gifts) పుట్టినరోజును పురస్కరించుకుని.. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్​లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు సంబంధించిన పరికరాలు, దుస్తులను వేలానికి ఉంచారు. ప్రస్తుతం ఇవి రికార్డు ధరతో దూసుకెళ్తున్నాయి. అక్టోబర్ 7 వరకు ఈ వేలం కొనసాగనుంది.


 

17:57 September 17

టాప్​ న్యూస్​ @6PM

  • పిలిస్తే మళ్లీ హాజరవుతా.. 

మనీలాండరింగ్‌ వ్యవహారంలో తనీష్​ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ఈడీ తనీష్‌ను ప్రశ్నించింది. ఈడీ అధికారులు మళ్లీ విచారణకు పిలిస్తే హాజరవుతానని తనీష్​ తెలిపారు.

  • తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంపై అంతర్జాతీయ సమాజం విస్త్రతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్నారు ప్రధాని మోదీ. ఈ విషయంలో ఐరాసకు భారత్​ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్​సీఓ-సీఎస్​టీఓ సదస్సుకు వర్చువల్​గా హాజరైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

  • భారత్​పై ఐసిస్ గురి

అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్​.. భారత్​లో పాగా వేసేందుకు(ISIS in India) విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఎన్​ఐఏ వెల్లడించింది. 37 కేసులను విచారించిన అనంతరం ఈ నిర్ధరణకు వచ్చింది. ఆన్​లైన్​లో నిరంతర ప్రచారం ద్వారా యువతకు గాలం (isis recruitment in india )వేస్తున్నట్లు పేర్కొంది.

  • ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడా?

టీ20 కెప్టెన్సీ(virat kohli t20 captaincy record)కి గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్​కు గురిచేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అతడి నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఐపీఎల్ కెప్టెన్సీ(virat kohli ipl captaincy record) నుంచి కూడా తప్పుకోవాలని సూచిస్తున్నారు.

  • అఖండ' కొత్త అప్డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో బాలకృష్ణ, విజయ్​ సేతుపతి, ఆమిర్​ ఖాన్​, గోపిచంద్​ చిత్ర వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం...

16:47 September 17

టాప్​ న్యూస్ @ 5 PM

కేసీఆర్‌ భయపడుతున్నారు

విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని అమిత్​ షా స్పష్టం చేశారు.


కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి

విమోచన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకే నిర్మల్ సభ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని.. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్​లో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించారు.


రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ

సైదాబాద్​ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మేజిస్ట్రేట్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

పింఛను​ ఖాతాలో రూ.52కోట్లు జమ

పింఛను ఖాతాలో రూ.52కోట్ల బ్యాలెన్స్ చూసి ఓ వృద్ధుడు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యాడు. బిహార్​ కటిహార్​లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960కోట్లు జమ అయిన కొద్ది గంటల్లోనే ముజఫర్​పుర్​(Muzaffarpur News) ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


మా​ బావే సీఎం అయినా..

వీధుల్లో యాచిస్తూ కనిపించిన​ మాజీ సీఎం మరదలు ఇరా బసు(Ira Basu) గురువారం తిరిగి స్వగృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఇరా బసు.. తన పింఛను సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ హామీ ఇచ్చారని తెలిపారు. వీధుల్లో తిరిగే పరిస్థితి ఏర్పడిన కారణంగా తన సోదరి మీరా భట్టాచార్య, బుద్ధదేవ్ దంపతులపై(Ira Basu Buddhadeb Bhattacharya) కోపం లేదని పేర్కొన్నారు.

16:25 September 17

టాప్​ న్యూస్ @ 4 PM

  • యూట్యూబ్ ద్వారా మంత్రికి ఆదాయం

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ(Nitin Gadkari News) ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా తను భారీ ఆదాయాన్ని సమాకూర్చుకుంటున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో నేర్చుకున్న రెండు విషయాల్లో ఇదీ ఒకటని చెప్పారు.

  • శారదక్క లొంగుబాటు

అనారోగ్యంతో బాధపడే మావోయిస్టులందరూ లోంగిపోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హరిభూషన్ భార్య శారదక్క లొంగిపోగా.. హింస ద్వారా ఏమీ సాధించలేమని ఆమె భావించారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో 115 మంది మాత్రమే ఉన్నారని.. వాళ్లలో రాష్ట్రానికి చెందిన వాళ్లు 15 మందేనని తెలిపారు. మిగతా వాళ్లంతా గొత్తికోయలేనని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • కొత్త దర్శకుడికి సమంత గ్రీన్​సిగ్నల్​!

స్టార్​ హీరోయిన్​ సమంత(samantha movie list 2021) ఓ కొత్త దర్శకుడికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

  • పాక్-కివీస్ సిరీస్ రద్దు

పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్(new zealand pakistan tour) రద్దయింది. భద్రతాపరమైన కారణాల వల్ల మ్యాచ్​ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకుంది కివీస్ యాజమాన్యం.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు ఏర్పడిన త్రైపాక్షిక రక్షణ కూటమిపై(aukus alliance) అంతర్జాతీయంగా పలుదేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా, ఫ్రాన్స్‌ ఈ కూటమి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ఆస్ట్రేలియా అణుజలాంతర్గాముల(aukus australia) తయారీకి సహకారం అందించడం.. అణునిరాధీకరణకు వ్యతిరేకమని చెప్పాయి. అటు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలనే లక్ష్యంతోనే కూటమిగా ఏర్పడినట్లు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ స్పష్టం చేశాయి.

14:40 September 17

టాప్​ న్యూస్ @ 3 PM

సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ పేరు సిఫార్సు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేల నియామకానికి సిఫార్సునిచ్చారు. కొత్త సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ పేరు సిఫార్సు చేయగా... ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేరు సిఫార్సు చేశారు.

మళ్లీ రికార్డ్​..

కొవిడ్​ వ్యాక్సినేషన్​లోcoronavaccination India) భారత్​ దూసుకెళ్తోంది. ఇవ్వాళ ఒక్కరోజే.. మధ్యాహ్నం 1.30 వరకు కోటికిపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

5000కు బిడ్డను అమ్మేసిన తల్లి

కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన బిడ్డను రూ.5000కు అమ్మేసింది. అయితే ఇప్పుడు తన బిడ్డను తిరిగివ్వాలంటూ.. డిమాండ్​ చేస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు

ఎలక్ట్రిక్​ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ (Ola Electric record) సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన ఈ-స్కూటర్ల (Ola Electric Scooter sales) విక్రయాలు సాధించింది. ఆంచనాలకు మించి ఆర్డర్లు రావడం వల్ల తాత్కాలికంగా విక్రయాలను నిలిపివేసింది.


మరి ఈసారి ఎవరో?

ఐపీఎల్​ అంటే క్రికెట్​ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే విషయాలు బౌండరీలు, సూపర్​ ఓవర్లు.. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! కరోనాకు ముందు ఐపీఎల్​లో మ్యాచ్​తో పాటు వినోదం కూడా ఉండేది. దానికి తోడుగా చీర్​ లీడర్స్​ డ్యాన్స్​లు అందర్ని ఆకట్టుకునేవి. కరోనా పుణ్యమా అంటూ గతేడాది నుంచి ఐపీఎల్​లో ఇవేమి కనిపించడం లేదు. అలా ఫ్యాన్​ను మరో విధంగా అలరించే వినోదం లేకపోకపోయినా.. ఈ మధ్య అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడి కుర్రకారు మనసులు కొల్లగొడుతున్నారు. అలా టోర్నీలో ఇప్పటివరకు ఒకచూపుతోనే సోషల్​మీడియాలో ట్రెండ్​ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి ఈసారి అలాంటి భామలు ఎవరు తళుక్కుమంటారో చూడాలి.

13:59 September 17

టాప్​ న్యూస్ @2PM

  • ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం

రాష్ట్రంలో మూడు జూట్ మిల్లులను వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉత్పత్తులను 20 ఏళ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జూట్ పరిశ్రమలకు సంబంధించిన పంటను రాష్ట్రంలోనే పండించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

  • తీవ్రవాదం పెను సవాల్

ఎస్​సీఓ 20వ వార్షిక సదస్సులో(Modi SCO Summit) వర్చువల్​గా ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని అభిప్రాయపడ్డారు. అతివాదం, తీవ్రవాదం పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్​లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని మోదీ(Modi SCO Speech) పేర్కొన్నారు.

  • ఏ పని చేస్తే ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?

మారుతున్న జీవనస్థితిగతుల కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతుంది. మరి అందరికీ వీలయ్యే ఓ పని చేయటం వల్ల ఎక్కువకాలం జీవించొచ్చని ఓ సర్వేలో తేలింది. ఇంతకీ అది ఏంటంటే?

  • టీ20 కెప్టెన్సీ రోహిత్​కే ఎందుకు?

ధనాధన్‌ క్రికెట్లో భారత్‌కు కొత్త కెప్టెన్‌ను చూడబోతున్నాం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పొట్టి ప్రపంచకప్‌ అనంతరం టీ20 సారథిగా(Kohli Captaincy) వైదొలుగుతానని విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. పని భారం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 

  • వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు

సోనూసూద్‌ కార్యాలయాల్లో(Sonu Sood IT Survey) ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు(Sonu Sood IT Raid).. పన్ను ఎగవేతను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

12:41 September 17

టాప్​ న్యూస్ @1PM

  • గెజిట్​ అమలుపై సమావేశం

హైదరాబాద్​లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. జీఆర్​ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి. పాండే కన్వీనర్​గా గెజిట్​ నోటిఫికేషన్​ అమలుపై ఉపసంఘం చర్చలు జరుపుతోంది. సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు... రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. 

  • సైనిక సమాచారం లీక్​!

పాకిస్థాన్​కు సైనిక సమాచారం చేరవేసిన ఓ గ్యాస్​ ఏజెన్సీ ఓనర్​ను (pakistan spy arrested in india) పోలీసులు అరెస్ట్​ చేశారు. నర్హార్​ ఆర్మీ బేస్​కు చెందిన కొంత రహస్య సమాచారం సహా పలు ఫొటోలను కూడా పాక్​ గూఢచారులకు సందీప్​ పంపాడని అధికారులు చెప్పారు.

  • జీఎస్​టీ మండలి భేటీ

లఖ్​నవూ వేదికగా జీఎస్​టీ మండలి(GST council meeting) సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman news)​ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • అంతరిక్షంలో 90 రోజులు.. 

రోదసిలో తమ అంతరిక్ష కేంద్రంలో(china astronauts space station) 90 రోజుల పాటు ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములు(China astronaut) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. వారు ప్రయాణించిన అంతరిక్ష నౌక గోబీ ఎడారిలో దిగింది.

కోలుకున్న రవిశాస్త్రి.. 

టీమ్ఇండియా ప్రధానకోచ్​ రవిశాస్త్రితో పాటు బౌలింగ్​, ఫీల్డింగ్​ కోచ్​లు కరోనా నుంచి కోలుకున్నారని(Team India Corona Report) ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. 'ఫిట్​ టు ఫ్లై' పరీక్షలో వచ్చే ఫలితాలను బట్టి వారు స్వదేశానికి తిరిగి వస్తారని ఆయన తెలిపారు.

11:50 September 17

టాప్​ న్యూస్ @12NOON

  • రాజు మృతిపై హైకోర్టులో పిల్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు.

  • అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!

మహిళలపై అత్యాచారాలు, హత్యలు మెట్రో నగరాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)(NCRB report 2020) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన హత్యాచార ఘటనల్లో(Crime rate in India) 40 శాతం ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయని నివేదికలో వెల్లడైంది.

  • 71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూ

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు (Modi Birthday) వేడుకలను ఘనంగా నిర్వహించారు భాజపా కార్యకర్తలు. మధ్యప్రదేశ్​లో 71 అడుగుల భారీ కేక్​ను కట్​ చేయగా.. వారణాసిలో 71 కిలోల లడ్డూను తయారు చేయించారు. ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​.. ప్రధాని మోదీకి (PM Modi News)శుభాకాంక్షలు తెలుపుతూ​ పూరీ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించారు.

  • భారీగా తగ్గిన పసిడి ధర

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోల్చుకుంటే శుక్రవారం భారీగా తగ్గింది. పసిడి బాటలోనే పయనించిన వెండి (Silver price today) ధర కిలోకు రూ.2,047 పతనమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • రాకెట్ రాఘవ కొడుకు ఎంట్రీ

జబర్దస్త్​ కొత్త ప్రోమో(Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. దీని పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 23 రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.

11:11 September 17

టాప్​ న్యూస్ @11AM

  • ఈడీ విచారణకు తనీష్

టాలీవుడ్‌ డ్రగ్స్‌(Tollywood Drug case) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసిన ఈడీ... 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. ఇవాళ నటుడు తనీష్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో తనీష్​కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించనుంది. 

  • దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసు

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరిఫ్ తండ్రి హుస్సేన్, చెన్నకేశవులు భార్య రేణుక నుంచి వాంగ్మూలాలు సేకరించిన అధికారులు నేడు జొల్లు నవీన్, జొల్లు శివ కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకోనుంది.

  • మళ్లీ పాక్​ డ్రోన్ల కలకలం

పంజాబ్​లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను(India Pak border) గుర్తించినట్లు సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఆ డ్రోన్లపై (drones spotted) సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్​వైపు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.

  • దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona update) మూడు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 34,403 మంది వైరస్ (Coronavirus India) బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 37,950 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

  • నితిన్ 'మాస్ట్రో'.. ఎలా ఉందంటే?

ఓటీటీ వేదికగా విడుదలైన 'మాస్ట్రో'.. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇంతకీ దీని కథేంటి? ఎవరెవరు ఎలా చేశారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

09:34 September 17

టాప్​ న్యూస్ @10AM

  • రివార్డు నాకే ఇస్తారా..?

సైదాబాద్​ హత్యాచార ఘటన (Saidabad Incident) నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే... ఏకంగా 5 వేల కాల్స్‌ వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ ఉత్తుత్తివే కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

  • మోదీ అంకితభావంతో.. 

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(Modi birthday) సందర్భంగా.. శుభాకాంక్షలు (Modi birthday wishes) వెల్లువెత్తుతున్నాయి. దేశం కోసం మోదీ అహర్నిశలు సేవ చేస్తూ ఉంటారని కొనియాడారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రధాని అంకితభావంతో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ట్వీట్​ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

  • పాక్ ఉగ్రవాదుల చేతికి!

ఇటీవల తాలిబన్లు (Afghan Taliban) ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​ నుంచి పాకిస్థాన్​కు భారీగా ఆయుధాల సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం వదిలివెళ్లిన అత్యాధునికి వెపన్స్​ను పాక్​లోని ఉగ్రమూకలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అఫ్గాన్​ నుంచి పాక్​కు ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు(Afghan Taliban news) స్వాధీనం చేసుకున్నట్లు పాక్​ స్థానిక మీడియా వెల్లడించింది.

  • ఒకే జట్టుగా టెలికాం..

టెలికాం సంస్థలు(Telecom news) ఒకే గూటికి చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో దేశీయ టెలికాం సంస్థలన్నీ జట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌(Sunil Mittal news) పేర్కొన్నారు. ఈ మేరకు వొడాఫోన్‌ నిక్‌ రీడ్‌తో మాట్లాడినట్లు తెలిపిన ఆయన.. ముకేశ్‌ అంబానీతోనూ చర్చించనున్నట్లు వెల్లడించారు.

  • కాజల్​ నుంచి గుడ్​న్యూస్!

స్టార్​ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal Latest News).. తన అభిమానులకు త్వరలో తీపు కబురు చెప్పనున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని తన భర్త గౌతమ్‌ కిచ్లూతో(Kajal Aggarwal Husband) కలిసి త్వరలోనే ప్రకటిస్తుందనే మాట వినిపిస్తోంది.

08:56 September 17

టాప్​ న్యూస్ @9AM

  • శశిథరూర్​పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy).. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయిసంఘం ఛైర్మన్ హోదాలో హైదరాబాద్​ వచ్చిన థరూర్.. రాష్ట్ర ఐటీ ప్రగతిని, మంత్రి కేటీఆర్​ను ప్రశంసించడంపై రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు థరూర్​కు క్షమాపణలు చెప్పారు. రేవంత్ తీరుపై మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కాంగ్రెస్ సీనియర్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కేసు ముగియాలంటే ఈ రెండు అంశాలు

చిన్నారిపై హత్యాచారం కేసు ( Saidabad Rape Incident case) ముగియాలంటే రెండు అంశాలు కీలకం. ఒకటి మృతదేహం రాజుదే అని సాంకేతికంగా రుజువు చేయడం. రెండోది హత్యాచారం చేసింది రాజే అని నిరూపించడం. ఆ రెండు నివేదికలు అందిన తర్వాత న్యాయస్థానంలో వాటిని సమర్పించిన తర్వాతే కేసు ముగియనుంది.

  • 'గర్భిణుల్లో కొవిడ్‌ ఇన్ఫెక్షన్​ ముప్పు ఎక్కువే!'

గర్భిణులపై కరోనా (Pregnant women covid) చూపించే ప్రభావం ఎక్కువేనని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌ బారిన పడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పరిశోధనలో గుర్తించింది. మహమ్మారి సోకిన గర్భిణులకు తక్షణ వైద్య సహాయం అవసరమని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

  • భవిష్యత్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​!

భారత యువ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​లో(KL Rahul News) నాయకత్వ లక్షణాలున్నాయని అభిప్రాయపడ్డారు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. భవిష్యత్​ కెప్టెన్​గా(Team India Future Captain) అతణ్ని ప్రోత్సహించాలని బీసీసీఐకి ఆయన సూచించారు.

  • బెల్లంకొండకు జోడీగా బాలీవుడ్ భామ!

ప్రభాస్‌.. రాజమౌళిల హిట్‌ సినిమా 'ఛత్రపతి'(chatrapathi hindi remake) ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్‌ గడ నిర్మాత. ఇందులో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ పాత్ర కోసం తొలుత అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు వినిపించాయి.

07:53 September 17

టాప్​ న్యూస్ @8AM

  • నేరాల విచారణలో తెలంగాణ ముద్ర

ఫింగర్‌ ప్రింట్స్‌ ద్వారా నేరస్థులను పట్టుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ.. దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గురువారం జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) ‘భారతదేశంలో వేలిముద్రలు’ పేరిట 2020 సంవత్సరానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

  • కేజీబీవీ విద్యార్థినుల దైన్యం...

హైకోర్టు ఆదేశాలతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం తెరవలేదు. దాదాపు దీనిలో చదువుకునే అమ్మాయిలందరూ పేద కుటుంబాలకు చెందిన వారు. ప్రత్యక్ష తరగతులు ఎలాగో లేవు. కనీసం ఆన్​లైన్​లో అయినా చదువుకునేందుకు చాలా మంది వద్ద కనీసం ఫోన్లు కూడా లేవు. అటు టీవీ పాఠాలు లేక.. జూమ్​ తరగతులు అందక కేజీబీవీ విద్యార్థినులు చదువుకు దూరం అవుతున్నారు.

  • కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు!

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ (Flyover Accident)​ శుక్రవారం తెల్లవారుజామున కూలింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనలో (mumbai flyover collapse) 13 మంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

  • మరోసారి ఆసియా టైటిల్​ విజేతగా పంకజ్​

ఆసియా స్నూకర్​ ఛాంపియన్​షిప్​లో(Asian Snooker Championship 2021) భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్​ క్రీడాకారుడు పంకజ్​ అడ్వాణీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఇరాన్​కు చెందిన అమిర్​ సర్ఖోష్​పై 6-3తో విజయం సాధించాడు.

  • తెలంగాణ యాసలో హీరో నాని డైలాగులు!

'శ్యామ్​ సింగరాయ్​'(Shyam Singha Roy Movie News), 'అంటే సుందరానికి'(Ante Sundaraniki Movie News) చిత్రాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani Movies).. ప్రస్తుతం మరో కొత్త సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. ఈ కొత్త చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. దసరాకి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

06:51 September 17

టాప్​ న్యూస్ @7AM

  • ఉప్పుడు బియ్యం  తీసుకోలేం

తెలంగాణ నుంచి 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase) తీసుకోలేమని కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​కు లేఖ రాశారు. ఇప్పటికే నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉండటం వల్ల అంతకు మించి తీసుకోలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​తో ఫోన్​లో మాట్లాడారు.

  • నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి.. సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి.. ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. విగ్రహాలను వెంటనే తొలగిస్తామన్న హామీ నేపథ్యంలో అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • ఆ మాత్రం చెల్లించాల్సిందే

మెరుగైన రహదారులు కావాలంటే టోల్​ ఛార్జీలు చెల్లించాల్సిదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) స్పష్టం చేశారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Delhi Mumbai expressway) పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ట్రక్కుల ప్రయాణ సమయం, ఇంధన వ్యయాలను తగ్గించడంలో ఎక్స్‌ప్రెస్‌వేలు తోడ్పడతాయని పేర్కొన్నారు.

  • ఆ విషయాల్లో భారత్‌ తలదూర్చదు

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమయ్యారు. తజకిస్థాన్‌ రాజధాని దుషాన్‌బేలో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సు ఈ భేటీకి వేదికైంది. ఇరుదేశాల సరిహద్దుల వద్ద బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • దుల్కర్​​కు అరుదైన గౌరవం

మలయాళ నటుడు దుల్కర్​ సల్మాన్​కు ప్రతిష్ఠాత్మక దుబాయ్ గోల్డెన్ వీసా (dulquer salman movies) మంజూరైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

05:41 September 17

టాప్​ న్యూస్ @6AM

  • సామాన్యులే సాయుధులై..

దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. తెలంగాణ సాయుధ పోరాటం. రాచరికం, భూస్వామ్య వ్యవస్థ, మతోన్మాదంపై ఏకకాలంలో సాగిన ఉమ్మడి సమరమది. నిజాం నిరంకుశానికి.. భూస్వాముల అరాచకానికి, రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్ధృత సాయుధ పోరాటమిది.. సామాన్యులే సాయుధులై చేసిన ప్రతిఘటన ఇది. విమోచనా.. విలీనమా.. అనే మీమాంసలు, శషభిషలు ఎన్ని ఉన్నా మొత్తంగా చరిత్రలో ఇదో విలక్షణ పోరాటం.

  • ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే..

ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • కాంగ్రెస్​ సభకు సర్వం సిద్ధం..

ముఖ్యమంత్రి కేసీఆర్​ సొంత నియోజకవర్గం గజ్వేల్​లో దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభ నిర్వహణకు రాష్ట్ర కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసింది. దళిత, గిరిజనులకు జరుగుతున్న మోసాలను ఎండగట్టేందుకు సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్.. ఇవాళ గజ్వేల్​ను ఎంచుకుంది. ఏడున్నరేళ్లలో కేసీఆర్​ ప్రభుత్వం దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ... ఛార్జిషీట్​ వేయాలని నిర్ణయించిన పీసీసీ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను భారీ సంఖ్యలో తరలించి సభను విజయవంతం చేయాలని నిర్ణయించింది.

  • అమిత్​ షా రాక..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు నిర్మల్‌ జిల్లా ముస్తాబైంది. రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో జరిగే సభకు కేంద్రమంత్రి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభకు లక్షమందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకంటే ఎక్కువే వస్తారని భాజపా శ్రేణులు అంచనా వేస్తున్నారు.

  • నేడు ఈడీ విచారణకు తనీష్​..

డ్రగ్స్ కేసులో ఈడీ పేరుతో మళ్లీ నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగించిందని యువ నటుడు తనీష్ అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనీష్​కు మనీలాండరింగ్​కు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. నేడు ఈడీ ముందు తనీష్ విచారణకు హాజరుకానున్నారు.

  • ఈ నెల 19న ఓట్ల లెక్కింపు..

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ(zptc, mptc) ఓట్ల లెక్కింపునకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) తెలిపింది. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

  • వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు..

ప్రధాని నరేంద్ర మోదీ(PM Gift Auction) స్వీకరించిన కానుకలు, మెమెంటోల(PM Mementos) వేలం వేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.

  • ఆ పత్రికవి రెచ్చగొట్టే కథనాలే..!

సెకండ్‌ వేవ్‌ విజృంభణకు ముందు మహమ్మారి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వెలువరించిన కథనాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మమమ్మారిపై సమర్థవంతంగా పోరాడుతున్న సమయంలో అది పూర్తిగా రెచ్చగొట్టే, దృష్టిని మరల్చే ప్రయత్నమేనని తప్పుబట్టింది. దేశంలో కరోనాపై పోరు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సమర్థంగా కొనసాగుతున్న వేళ అలాంటి వార్తలు దురదృష్టకరమని అభిప్రాయపడింది.

  • అత్యుత్తమ కెప్టెన్ ఎవరో..

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్​లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరో చూద్దాం.

  • రిలీజ్​కు రెడీ..

నేడు (శుక్రవారం) పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు(this week movies releases) ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో రిలీజ్ అవుతున్నాయి?

Last Updated : Sep 17, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details