తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు

By

Published : Sep 10, 2021, 5:58 AM IST

Updated : Sep 10, 2021, 10:05 PM IST

22:02 September 10

టాప్ న్యూస్ @ 10 PM

సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం

మెగాహీరో సాయిధరమ్ తేజ్​కు యాక్సిడెంట్ జరిగింది. కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై నుంచి పడిన అతడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

రాష్ట్రంలో 85,149 ఇంజినీరింగ్‌ సీట్లకు అనుమతి

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 161 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 85,149 సీట్లకు అనుమతి లభించింది. కన్వీనర్‌ కోటాలో 60,697 ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ కానున్నాయి. 91 కళాశాలల్లో 7,640 బి-ఫార్మసీ సీట్లకు అనుమతి వచ్చింది. 

కేటీఆర్​ లేఖ

రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​కు లేఖ రాశారు. టెక్స్ టైల్ పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రొడభన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని లేఖలో కోరారు.


100% మందికి తొలి డోసు

కరోనా టీకా పంపిణీలో(Corona vaccination) గోవా కీలక మైలురాయిని అందుకుంది. అర్హులైనవారందరికీ కొవిడ్​ తొలి డోసు టీకా వేసినట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్​ సావంత్​ ప్రకటించారు. గోవాలో నూరు శాతం వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.


మరో 25,010 మందికి వైరస్

కేరళలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 25,010 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 177 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మహారాష్ట్రలో కొత్తగా 4,154 కేసులు వెలుగుచూశాయి.

20:54 September 10

టాప్ న్యూస్ @ 9 PM

కడుపు కోత..

ఆ తల్లికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయినా పిల్లలున్నారని గుండె నిబ్బరం చేసుకుంది. బాధను దిగమింగుకుని వారిని పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమారుడు చేతికందాక ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకుంటాడని సంబరపడింది. చిన్న కుమారుడు అన్నకు సాయంగా ఉంటాడని భావించింది. కానీ విధి వారి పట్ల చిన్నచూపు చూసింది. పాతికేళ్ల కుమారుడు కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్న తల్లే కొడుక్కి చితి పెట్టాల్సి వచ్చంది. నల్గొండ జిల్లా ముప్పారం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.


మహిళపై అత్యాచారం.. ఆపై రాడ్​తో..

2012లో దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్భయ అత్యాచార ఘటన తరహాలోనే ఇప్పుడు మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 34ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆ తర్వాత ఆమె జననాంగంలో ఇనుప రాడ్ దూర్చి.. చిత్రహింసలకు గురిచేశాడు.


ఉపాధ్యక్షుడి సోదరుడిని చంపిన తాలిబన్లు!

అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్​ను తాలిబన్లు చంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పంజ్​షీర్​ను నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ నరమేధం సృష్టిస్తున్నారు. స్థానికులు ప్రాణ భయంతో పంజ్‌షీర్‌ను వదిలి వెళ్తున్నారు.


కరోనా కారణం కాదు

భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) నాటకీయ పరిణామాల మధ్య కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ఇప్పుడా మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయాలని ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు నిర్ణయించాయి. ఈ సిరీస్​ ఫలితంపై ఐసీసీ(ICC News) ఎలాంటి ప్రకటన విడుదల చేయని నేపథ్యంలో.. ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్ హారిసన్​(ECB CEO) చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.


ఆర్జీవీ రచ్చ రచ్చ..!

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma). ఇప్పుడు 'క్రాక్​' ఐటెంగాళ్​(Krack Item Girl) అప్సర రాణి అందాన్ని ట్విట్టర్​ వేదికగా వర్ణించాడు. ఆమెతో పాటు ఓ పబ్​కు వెళ్లి డీజే పాటకు సరదాగా చిందులేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

20:04 September 10

టాప్ న్యూస్ @ 8 PM

తిరుపతి లడ్డూ రుచిని తలపించేలా

వినాయక చవితి ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన వినాయకుడు బాలాపూర్ గణేశుడు. భక్తుల పాలిట కొంగుబంగారంగా పిలుచుకునే బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ.. ఏటా వేలంపాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. కరోనా కారణంగా గతేడాది వేలంపాటను రద్దు చేసిన బాలాపూర్ ఉత్సవ సమితి.. ఈ ఏడాది సంబురాల్లో మరింత జోరుగా లడ్డూ వేలంపాట నిర్వహించబోతుంది. గత 15 ఏళ్లుగా బాలాపూర్ గణేశుడికి లడ్డూను అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న ఉమామహేశ్వరావు దంపతులతో మా ప్రతినిధి సతీశ్​ ముఖాముఖి.


భేటీ ఫలప్రదం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి, సమీకృత పాలనపైనే ఆస్ట్రేలియా-భారత్​ మధ్య చర్చలు, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో చర్చలు ముగిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు.


ఎస్​బీఐ డెబిట్​ కార్డ్ పోయిందా?

దొంగిలించడం, పోగొట్టుకోవడం వంటి కారణాలతో ఎస్​బీఐ డిబిట్​ కార్డ్​ పోగొట్టుకుంటే.. ఫోన్ ద్వారా కార్డ్ బ్లాక్ చేసేందుకు మత్రమే అనుమతి ఉండేది. కొత్త కార్డ్ కావాలంటే.. బ్యాంక్​​ బ్రాంచ్​కి వెళ్లాల్సి వచ్చేది. కానీ కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు ప్రక్రియలను సులభంగా ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్​బీఐ. ఈ కొత్త పద్దతి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...


కరోనా కారణం కాదు

భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) నాటకీయ పరిణామాల మధ్య కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ఇప్పుడా మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయాలని ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు నిర్ణయించాయి. ఈ సిరీస్​ ఫలితంపై ఐసీసీ(ICC News) ఎలాంటి ప్రకటన విడుదల చేయని నేపథ్యంలో.. ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్ హారిసన్​(ECB CEO) చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.


అస్సలు తగ్గట్లే!

తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్న కేతిక శర్మ.. అభిమానుల మనసు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది.

19:00 September 10

టాప్ న్యూస్ @ 7 PM

హెచ్చరిక ఉపసంహరణ

ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గడం వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 42.9 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.


నాగుపాము హల్‌చల్‌

ఏపీలోని తిరుపతిలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఓ స్కూటీ నుంచి బయటకొచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. దీంతో ప్రజలు రోడ్డు వెంబడి పరుగులు తీశారు.


కానీ ఆమె పక్కదారి పట్టింది

ఆమెకు భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉన్నంతలో బతుకుతున్నారు. కానీ ఆమె చేసిన పని వారి కుటుంబంలో విషాదం నిప్పింది. క్షణికమైన సుఖం కోసం తప్పటడుగు వేసి తన పిల్లలను అమ్మలేని వారిగా చేసింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.


23న అమెరికా పర్యనటకు మోదీ

ఈనెల 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్​తో పాటు క్వాడ్​, జీ-7 దేశాధినేతలను మోదీ కలవనున్నారు.


టీమ్​ఇండియా మరవొద్దు

మాంచెస్టర్​ టెస్టును రద్దు చేసేందుకు బీసీసీఐ, ఈసీబీ (eng vs ind) అంగీకరించాయి. ఈ మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయాలనే బీసీసీఐ ప్రతిపాదనను స్వాగతించాడు టీమ్​ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ మ్యాచ్​ను ఆడొచ్చని సూచించాడు.


 

17:52 September 10

టాప్ న్యూస్ @ 6 PM

అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక

సైదాబాద్​లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. చిన్నారి ఇంటి పక్కనే గదిలో నివాసం ఉండే రాజు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

పండుగ జరుపుకున్న సీఎం కేసీఆర్‌

ప్రగతి భవన్‌లో వినాయక చవితి(Ganesh chaturthi) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్(cm kcr) దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి కేటీఆర్‌(ktr) సతీసమేతంగా పాల్గొన్నారు.

ఇంట్లోనే మృతదేహంతో ఏడాదిగా...

తల్లి మృతదేహాన్ని ఇంటి బేస్​మెంట్​లోనే దాచిపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాదిగా అధికారులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.

కిచెన్​లో ఛార్జింగ్​

ఎలక్ట్రిక్ స్కూటర్​ను(Electric Scooter) అపార్ట్​మెంట్ ఐదో అంతస్తుకు తీసుకెళ్లి కిచెన్​లో ఛార్జింగ్ పెట్టాడు ఓ యజమాని. ఛార్జింగ్ స్టేషన్​ ఏర్పాటుకు బిల్డింగ్ మేనేజ్​మెంట్ అనుమతి ఇవ్వనందున లిఫ్ట్​లో స్కూటర్​ను తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో లింక్డిన్​లో షేర్ చేయగా అది కాస్తా వైరల్​గా మారింది.


ఆ స్టార్స్​ ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో బంధాలకు కొదువ లేదు. ఫేమ్​ వచ్చేంతవరకు మేము ఫలానా వారికి 'బంధువులం' అని చెప్పుకునే చాలా మంది నటీనటులున్నారు. అయితే సొంతంగా గుర్తింపు తెచ్చుకునే వరకు అప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్​గా ఉన్న తమ రిలేటివ్ పేరుని బయటపెట్టని నటులు కూడా ఉన్నారు. వారి గురించే ఈ కథనం.

16:48 September 10

టాప్ న్యూస్ @ 5 PM

నిందితుడిని ఎన్​కౌంటర్​ చేయాలి

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో నిన్న అదృశ్యమైన ఆరేళ్ల బాలిక.. పక్కింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో కాలనీవాసులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిందితుడు రాజును ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.


జోక్యం వద్దు

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్​లో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.


అసలు నిజం ఇదీ...

పంజ్​షేర్(taliban panjshir war)​ తమ వశమైనట్టు తాలిబన్లు ప్రకటించేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే.. నెల తిరగకుండానే పంజ్​షేర్​ కోట కూలిపోయిందంటే నమ్మశక్యంగా లేదు! పంజ్​షేర్​లో ఇప్పుడు పరిస్థితులేంటి? తాలిబన్ల మాటల్లో అసలు నిజమెంత?(panjshir latest news)

తక్కువ వడ్డీ రుణం ఏదో తెలుసా?

రుణాల్లో.. బంగారంపై రుణం (Gold loan), ఫిక్స్​డ్ డిపాజిట్​పై రుణం, వ్యక్తిగత రుణాలు (Personal loan) చాలా పాపులర్. మరి ఇందులో ఏ రుణంపై తక్కువ వడ్డీ (Low interest loans) ఉంటుంది? వేటి ద్వారా ప్రయోజనాలు ఎక్కువ? అనేది తెలుసుకుందాం.

'సీటీమార్' ఎలా ఉందంటే?

కబడ్డీ నేపథ్య కథతో తీసిన 'సీటీమార్'.. థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? మాస్​కు మెచ్చే అంశాలు ఏమేం ఉన్నాయో తెలియాలంటే ఈ చిత్రం సమీక్ష చదవాల్సిందే.

15:55 September 10

టాప్ న్యూస్ @ 4 PM

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు కింది స్థాయి గాలులు రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొంది.


ఇంట్లోకి పాము- బుజ్జగించి బయటకు పంపిన మహిళ

పామును సడెన్​గా చూస్తే ఏం చేస్తాం? ఏం ఆలోచించకుండా దూరంగా పరిగెడతాం. ధైర్యం చేసే కొందరు.. చంపేందుకు వెనుకాడరు. కానీ.. ఈ మహిళ చేసిన పని నవ్వులు పూయిస్తోంది. ఇంట్లోకి రాబోతున్న సర్పంతో మాట్లాడి, బుజ్జగించి బయటకు పంపించేసింది.


ఏ క్షణమైనా చొరబాటు!

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​లోకి చొరబడేందుకు 25 మంది ఐసిస్ సానుభూతిపరులు(ISIS News) అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా కేరళకు చెందినవారని, ఐసిస్​ పట్ల ఆకర్షితులై 2016 తర్వాత దేశం వీడి అప్గాన్ వెళ్లారని పేర్కొన్నాయి. జైళ్లలో ఉన్న ఖైదీలను తాలిబన్లు విడుదల చేశాక వీరికి విముక్తి లభించినట్లు చెప్పాయి.

త్వరలోనే స్పష్టత!
మాంచెస్టర్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఆఖరి టెస్టు(Manchester Test) రద్దు కావడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా(BCCI Vice President) స్పందించారు. చివరి టెస్టును పూర్తిగా రద్దు చేయలేదని.. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్​ను తిరిగి నిర్వహించాలనే దానిపై ఈసీబీతో కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. మరోవైపు క్రికెటర్ల ఆరోగ్యం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని బీసీసీఐ(BCCI News) తేల్చి చెప్పింది.

14:40 September 10

టాప్ న్యూస్ @ 3 PM

మల్లారెడ్డి బర్త్​డే వీడియో వైరల్

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు(Minister malla reddy birthday) సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్​లో ఘనంగా జరిగాయి. అభిమానుల మధ్య మంత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన టపాసులను మల్లారెడ్డి కాల్చారు. విల్లు ఆకారంలో ఉన్న టపాసులు ఈ సంబురాల్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

ఇదెక్కడి న్యాయం.?!

ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతున్నా కొన్ని విషయాల్లో మాత్రం అమ్మాయిలపై వివక్ష ఆగడం లేదు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందున్నా ఇంకా 'ఆడ'పిల్లే అనే విమర్శలు వింటూనే ఉన్నాం. నగరాల్లో, పట్టణాల్లో స్త్రీ, పురుష సమానత్వం విషయంలో పరిణతి కనిపించినా.. మారుమూల గ్రామాలు, గిరిజనవాసుల్లో మాత్రం ఇంకా ఆ పోకడ ఆగలేదు. అందుకే పదిహేనేళ్లకే పెళ్లి పీటలెక్కిన గిరిజన మహిళ పూర్ణ.. ఈ పితృస్వామ్య వ్యవస్థను తనదైన శైలిలో నిలదీస్తోంది.


రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆధార్ సంఖ్యను మార్చడం(Aadhar Card Update) కుదరదని ఉడాయ్ స్పష్టం చేసింది. ఇందుకు అనుమతిస్తే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొంది దిల్లీ హైకోర్టుకు తెలిపింది.


ఆరు విదేశీ సంస్థలు గుడ్​బై

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నేళ్లలోనే విదేశీ కంపెనీలు పోటీ నుంచి తప్పుకొంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో అమెరికా దిగ్గజం ఫోర్డు కూడా చేరింది. గత ఐదేళ్లలో ఫోర్డుతో కలిపి ఆరు కంపెనీలు భారత్‌ను వీడాయి. వీటిల్లో జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌, హార్లీడెవిడ్‌సన్‌, యూఎం మోటార్‌ సైకిల్స్‌ సంస్థలు ఒక్క అమెరికావే కావడం గమనార్హం.

రణ్​బీర్​కు అమితాబ్ ఖరీదైన గిఫ్ట్..

యువ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్​పై(Ranbir Kapoor Brahmastra) తన అభిమానాన్ని సోషల్​ మీడియా వేదికగా తరచూ చాటుకుంటారు బాలీవుడ్​ మోగాస్టార్​ అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan and Ranbir Kapoor relation)​. అలాగే ఓసారి ఖరీదైన వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చి రణ్​బీర్​ను థ్రిల్​ చేశారు బిగ్​బీ. దాని ధరెంతో తెలుసా?

12:30 September 10

టాప్ న్యూస్ @12NOON

  • ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి(Khairtabad Ganesh) ఈయేడు తన తొలిపూజను అందుకున్నాడు. తెలంగాణ, హరియాణా రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయలు.. విఘ్నేశ్వరునికి మొదటి పూజ చేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్లాలని లంబోదరుడిని వేడుకున్నారు.

  • మన బొజ్జ గణపయ్యకు ఏమి ఇష్టమో తెలుసా..?

శివ పూజకు కేవలం నీళ్లు, పూలు సరిపోయినట్లే గణనాథుని పూజించడానికి కూడా ఆకులు, పూలే ఉపయోగిస్తుంటాం. శివుడైనా అభిషేక ప్రియుడు కానీ.. విఘ్ననాథుని పూజించడానికి అది కూడా అవసరం లేదు.. అత్యంత సాధారణమైన వాటితోనే సంతృప్తి పొందుతాడీ పార్వతీ తనయుడు. ఏమాత్రం కష్టపడకుండా ఇలా అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో లభించే పదార్థాలతోనే గణపయ్య సంతుష్టి చెందడానికి పురాణపరంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు కూడా చెబుతుంటారు. అలాంటివాటిలో కొన్నిటి గురించి చూద్దాం రండి...

  • ఆవిరి కుడుములు తింటే ఎంత మంచిదో తెలుసా?

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగ రోజునే కాదు.. నవరాత్రులూ భూమిపై పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారుచేసి గణపతికి నైవేద్యంగా సమర్పించే వారూ చాలామందే! అయితే ఎంతో అమోఘమైన రుచిని నింపుకొన్న ఈ ఆవిరి కుడుములు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి, మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ ఆవిరి కుడుముల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

  • మమతపై పోటీకి సై.. భాజపా అభ్యర్థి ఈవిడే...

బంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. భవానీపుర్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీపై భాజపా తరఫున ప్రియాంక తిబ్రీవాల్ పోటీపడనున్నారు.

  • లంకలో ఆకలికేకలు.. అల్లాడుతున్న ప్రజలు!

ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక(Srilanka Food Crisis) అల్లాడుతోంది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరి అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు శ్రీలంకకు ఏమైంది? ఈ సంక్షోభానికి(Srilanka Food Crisis) దారి తీసిన పరిస్థితులపై ప్రత్యేక కథనం..

11:59 September 10

టాప్ న్యూస్ @12NOON

  • 'తెలంగాణ ప్రగతి ప్రస్థానం అవిఘ్నంగా సాగాలి'

తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని ఆ విఘ్నేశ్వరునికి మొక్కుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వినాయక చవితి సందర్భంగా.. సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే మూడో దశ ముప్పు పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరుస పండుగల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు విస్మరిస్తే ముప్పు పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు.

  • బైడెన్​ కొత్త ప్లాన్​- వైరస్ కట్టడికి కఠిన నిర్ణయాలు

అమెరికాపై కరోనా(America Covid Cases) మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​(Joe Biden).. వైరస్​ కట్టడికి నూతన కార్యచరణ ప్రకటించారు. అమెరికన్లందరికీ టీకాలు(America Covid Vaccination) వేయడం, ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం, ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడడంపై ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణాల్లో మాస్క్ ధరించనివారికి జరిమానాను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు.

  • ఇంట్లో గణపతి కొలువు.. నెట్టింట కొత్త పోస్టర్ల నెలవు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొత్త సినిమాల ప్రకటలు, ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న, జరిగిన చిత్రాల పోస్టర్లూ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చవితి పండగ రోజు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొత్త పోస్టర్లేంటో చూద్దాం.

  • 'అన్నాత్తే' ఫస్ట్​లుక్ అదుర్స్.. 'ఖిలాడి' సాంగ్ వచ్చేసింది

వినాయక చవితి పండగ పురస్కరించుకుని సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'ఖిలాడి', 'అన్నాత్తే', 'మహాన్'​, నితిన్​ కొత్త సినిమా కబుర్లు ఉన్నాయి.

10:49 September 10

టాప్ న్యూస్ @11AM

  • భాగ్యనగరంలో గణేశుడి పండుగ షురూ..

భాగ్యనగరంలో వినాయకచవితి సందడి మొదలైంది. ఓవైపు గణనాథులు మండపాలకు చేరుతుంటే.. మరోవైపు భక్తులు ఆ విఘ్నేశ్వరుడి సేవకు అవసరమయ్యే సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఈ నవరాత్రులకు కావాల్సిన సామగ్రి కొనుగోళ్లతో.. నగరంలోని పలు మార్కెట్లు(Rush at markets in Hyderabad)​ కిటకిటలాడుతున్నాయి.

  • మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా (Corona Cases in India) ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,973 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 260 మంది కొవిడ్​(Covid-19) బారిన పడి మరణించారు.

  • స్వల్పంగా పెరిగిన పసిడి ధర

ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. వెండి ధర సైతం మరింత పుంజుకుంది. రెండు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.

  • కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న రషీద్ ఖాన్

టీ20 ప్రపంచకప్​ కోసం అఫ్గానిస్థాన్​ స్క్వాడ్​ను ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అయితే.. ఈ జట్టుకు తనను సారథిగా నియమిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తపరిచాడు స్టార్​ ఆటగాడు రషీద్ ఖాన్(Rashid Khan Captain). కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేశాడు.

  • 'ఆర్​ఎక్స్ 100' దర్శకుడితో ధనుష్!

కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​(Dhanush)​.. తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్​ దర్శకుడు శేఖర్​ కమ్ములతో మూవీ ప్రకటించిన ధనుష్​.. తాజాగా మరికొందరు తెలుగు దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లు టాక్​ వినిపిస్తోంది.

10:02 September 10

టాప్ న్యూస్ @10AM

  • భాగ్యనగరంలో గణేశుడి సందడి

భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గల్లీకో గణపతితో నగరమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సందడి అంతాఇంతా కాదు. తెల్లవారుజాము నుంచే నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంగణమంతా లంబోదరుడి నామస్మరణతో మార్మోగింది.

  • చిన్నారుల భవితపై నీలినీడలు!

కరోనా కారణంగా సుదీర్ఘకాలంగా బడులు మూతపడ్డాయి. గ్రామీణ భారతంలో 37శాతం, పట్టణాల్లో 19శాతం విద్యార్థులు చదువులమ్మ ఒడికి శాశ్వతంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిద్దామిలా..

ఆర్థికంగా ఇప్పుడు ఎక్కడున్నాం..? కొన్నాళ్ల తర్వాత ఎలా ఉంటాం..? ఈ సమీక్ష నిరంతరం సాగుతూనే ఉండాలి. ఇటీవల కరోనా సంక్షోభం (Corona Pandemic) తర్వాత చాలామంది ఆర్థిక ప్రణాళికలు దెబ్బతిన్నాయి. అయితే, వీటిని సాధ్యమైనంత వేగంగా దారిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలో చూద్దామా?

  • భారత్​ సరిహద్దులకు దగ్గర్లో 30 విమానాశ్రయాలు!

భారత సరిహద్దుకు చేరువగా టిబెట్​, షిన్​జియాంగ్ ప్రావిన్స్​లో కొత్తగా 30 విమానాశ్రయాలను(China Building Airport) చైనా నిర్మిస్తోంది. టిబెట్‌లో ఓ హైస్పీడ్ బుల్లెట్​ రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా సరిహద్దుల్లోకి శరవేగంగా సైన్యాన్ని తరలించాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది.

  • గోపీచంద్​ను ఇమిటేట్ చేసిన నటి

గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'(seetimaarr movie). కబడ్డీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను రూపొందించారు. వినాయక చవితి కానుకగా నేడు (సెప్టెంబర్ 10) థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. 

08:44 September 10

టాప్ న్యూస్ @9AM

  • భక్తులకు అప్పుడే అయోధ్య రాముడి దర్శన భాగ్యం..!

అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్​ వర్గాలు(Ayodhya Temple Trust) తెలిపాయి. 2023 నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పాయి.

  • దిగజారిన రాష్ట్ర విద్యాసంస్థల ర్యాంకులు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో రాష్ట్రంలోని విద్యాసంస్థల స్థానం పడిపోయింది. ఓవరాల్‌, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఒక్క ఐఐటీహెచ్‌ తప్ప మిగిలిన అన్ని సంస్థల ర్యాంకులు గత ఏడాదితో పోలిస్తే దిగజారాయి. ఓవరాల్‌ విభాగంలో మొత్తం 100 స్థానాల్లో తెలంగాణ నుంచి నాలుగు సంస్థలు చోటుదక్కించుకోగా.. వాటిలో మూడు కేంద్రీయ విద్యాసంస్థలే.

  • వినాయకుడి ఆర్థిక పాఠాలు.. తెలుసుకుందామా?

వినాయక చవితి(Ganesh Chaturthi 2021) అంటే అందరికీ ఇష్టమే. మండపాలు కట్టి ఊరేగించినా.. ఇంట్లో పెట్టుకుని పూజించినా.. గణేశుడిపై నమ్మకం ఉంచితే ఏ విఘ్నాలు కలగకుండా మనల్ని కాపాడతాడనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. వినాయకుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఎన్నో ఆర్థిక పాఠాలూ ఉన్నాయి.

  • చదువేమో ఎమ్మెస్సీ.. ఉద్యోగమేమో స్వీపర్...

జీవితం వడ్డించిన విస్తరి కాదు. సామాన్యులకైతే అసలే కాదు. ఇష్టాలను కష్టాలు కబళిస్తాయి. లక్ష్యాలకు బాధ్యతలు అడ్డుపడతాయి. ప్రయత్నాలు గురి తప్పుతాయి. పరిస్థితులతో రాజీపడి బతుకు బండిని లాగాల్సి వస్తుంది. ఈ మహిళ గాథ అలాంటిదే.

  • వినోదానికి కొత్త భాష్యం- స్మార్ట్‌ ఫోనే మల్టీప్లెక్స్‌!

కరోనా లాక్​డౌన్​తో డిజిటల్​ వినోదానికి ఆదరణ బాగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దలు వరకు అందరూ ఇదే దారి పడుతున్నారు. ఒకప్పడు సినిమా రిలీజ్​ అంటే.. టికెట్ల కోసం థియేటర్లు వద్ద బారులు తీరే జనం.. ఇప్పుడు దర్జాగా ఇంట్లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. వినోదానికి కొత్త ఒరవడి నేర్పిన ఓటీటీలు(OTT annual subscription) ఎన్నో..! సినిమాలు, వెబ్​సిరీస్​ల కంటెంట్​తో ఆడియన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇల్లే ఓ సినిమా హాల్​గా మారిపోతుంది! స్మార్ట్​ఫోనే మల్టీప్లెక్స్​ అయిపోయింది.

07:59 September 10

టాప్ న్యూస్ @8AM

  • పోలీసులపై రాళ్లు రువ్విన స్థానికులు

హైదరాబాద్‌ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే కాలనీలో నిన్న అదృశ్యమైన చిన్నారి.. పక్క ఇంట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. 

  • కరోనా నివారణకు 'చీమల పచ్చడి'

కరోనా మహమ్మారి(Corona Pandemic) నివారణకు ఉపయోగపడుతున్నప్పటికీ చీమల పచ్చడిని కొవిడ్ చికిత్సలో ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయలేమని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. శాస్త్రీయత లేని కారణంగా అలా చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

  • 66 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ కోసం ఆర్డర్లు

మరో 66 కోట్ల కరోనా టీకాలను (Covishield Vaccine) అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ఇందుకోసం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నుంచి కొవిషీల్డ్ డోస్‌ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

  • 'టక్‌ జగదీష్‌' ఎలా ఉందంటే..?

నాని, రీతూవర్మ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'టక్​ జగదీష్​'(Nani Tuck Jagadish). వినాయక చవితి సందర్భంగా ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష(tuck Jagadish movie review) ద్వారా తెలుసుకుందాం.

  • కంగ‌న ర‌నౌత్‌ 'తలైవి'గా మెప్పించిందా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha Thalaive movie) జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'తలైవి'(Thalaivi review ). కంగనా రనౌత్​ జయ పాత్రలో నటించారు. వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదలైందీ సినిమా. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
 

06:46 September 10

టాప్ న్యూస్ @7AM

  • అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడు

ప్రథమ పూజ్యుడు, పరిపూర్ణ దివ్యతత్త్వ స్వరూపుడు- మహాగణపతి. ప్రకృతీ పురుషులకు పార్వతీ పరమేశ్వరులు సాకార రూపం. వారిరువురి ఏకత్వమే గణపతి. సమస్త దేవతాగణానికి, సకల మంత్ర సమూహానికి గణేశుడు అధినాయకుడు. అఖిల జగత్తు గణమయం.

  • చరిత్ర పుటల్లో వినాయక చతుర్థి

వినాయక చవితి అంటే బొజ్జగణపయ్యను ఆరాధించే పండుగ మాత్రమే కాదు... దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన వేడుక అంటే నమ్ముతారా...? కానీ ఇది నిజం. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంగా ఎలా అయితే చెప్పుకుంటారో... స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసిన ఏకదంతుడి పండుగ అని కూడా చెప్పుకోవాలి. చరిత్ర పుటల్లో చత్రపతి శివాజి నుంచి బాలగంగాధర తిలక్​ కాలం వరకు గణనాథుడి వేడుకలు ఎలా జరిగేవంటే...

  • 'బేబి రాణి' రాజీనామా ఆమోదం

ఉత్తరాఖండ్​ గవర్నర్​ బేబి రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు. ఆమె స్థానంలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ (new governor of uttarakhand) నియమితులయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్​లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • మద్యం సీసాలు పగులకొట్టి.. పుస్తకాలు ధ్వంసం చేసి..

కాబుల్​లోని నార్వే రాయబార కార్యాలయాన్ని (taliban news) తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను పగులగొట్టి, పిల్లల పుస్తకాలను ధ్వంసం చేశారు. మరోవైపు, హక్కానీ నేతల పేర్లను బ్లాక్​లిస్ట్​ నుంచి తొలగించాల్సిందేనని తాలిబన్లు (Afghan News) అమెరికాను డిమాండ్​ చేశారు. హక్కానీ నెట్‌వర్క్‌ ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్‌లో ఒక భాగమని స్పష్టం చేశారు.

  • సినిమాల సందడి.. మీరు ఏం చూస్తారు?

ఈ శుక్రవారం కూడా సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అందులో రెండు థియేటర్లలోకి రానుండగా, మరో మూడు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి?

05:16 September 10

టాప్ న్యూస్ @ 6AM

  • తొలిపూజకు వేళాయే

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. జైజై గణేశా అంటూ.. మండపాల్లో గణపతులను నెలకొల్పేందుకు నిర్వాహకులు విగ్రహాలను తరలిస్తున్నారు. గణనాథుడి తొలిపూజకు మండపాలు ముస్తాబయ్యాయి. పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కోలాహలంగా మారాయి. గణేశుని నవరాత్రులు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు... ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.

  • ముందుకొస్తున్నముప్పు..

సముద్రం వేడెక్కడం, సాగర మట్టం గణనీయంగా పెరగడం వల్ల అతి భారీ వర్షాలు, తుపాన్ల తీవ్రత హెచ్చుతోంది. ఒక దశాబ్దంలో సముద్రంలో నీటిమట్టం మూడు నుంచి ఐదు మీటర్ల వరకు పెరుగుతోంది. మూడు మీటర్ల నీటిమట్టం పెరిగిందంటే 17 మీటర్ల తీర ప్రాంత భూభాగాన్ని కోల్పోయినట్లేనని భారత ఉష్ణ మండల వాతావరణ సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటరాలజీ) ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ అభిప్రాయపడ్డారు.

  • మార్కెట్లోకి తెలంగాణ సోనా..

మధుమేహం అదుపులో ఉంచే అధిక పోషకాలున్న తెలంగాణ సోనా వరి రకం బియ్యం మార్కెట్‌లో లభ్యమవుతోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వంగడం దేశ, విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. బహుళ ఆదరణ పొందుతున్న బియ్యం గిరాకీ దృష్ట్యా గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ-కామర్స్, ప్రముఖ మాల్స్‌, కిరాణ దుకాణాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జీకాట్‌ మద్దతుతో డెక్కన్‌ ముద్రా సంస్థ బియ్యాన్ని తమదైన శైలిలో మార్కెటింగ్‌ చేస్తోంది.

  • తలలు పట్టుకున్న అధికారులు

హుస్సేన్‌సాగర్‌, పెద్ద చెరువుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ) గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని గురువారం హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రతిమలను ఎక్కడ కలపాలనే విషయమై అధికారులు తలలు పట్టుకున్నారు. ఏ అధికారిని కదిలించినా స్పష్టత లేదన్న సమాధానమే వస్తోంది. నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన నిమజ్జన కోనేరులే దిక్కనే పరిస్థితి ఏర్పడింది.

  • రాష్ట్రానికి అగ్రస్థానం

రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కింది. పీఎం స్వానిధిలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. డిజిటల్ లావాదేవీలతో రాష్ట్రానికి చెందిన వీధివ్యాపారులు 35 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందుకున్నారు.

  • నడిరోడ్డుపై మోడల్ వీరంగం..

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో.. ఫుల్​గా మద్యం సేవించిన ఓ మోడల్​.. నడిరోడ్డుపై హంగామా సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడుతూ.. వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. అంతేకాక అదేసమయంలో వెళ్తున్న ఆర్మీ జీప్​ను కూడా అడ్డగించింది. జీప్​ ముందు భాగాన్ని పదేపదే తన్నింది. దీంతో జీప్ హెడ్​లైట్ పగిలిపోయింది. వెంటనే జీప్​లోంచి దిగిన జవాను.. ఆమెను అడ్డుకునేందుక యత్నించగా.. అతడిని సైతం వెనక్కు నెట్టింది. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక పోలీసులు.. మహిళా కానిస్టేబుల్ సహాయంతో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన బుధవారం జరిగినట్టు తెలుస్తోంది.

  • జాతీయ సమైక్యతా వారధి

తెలుగు భాషను 'సుందర తెలుంగై' అని ప్రశంసించిన విశిష్ట పాత్రికేయుడు, మహాకవి.. సుబ్రహ్మణ్య భారతి. బహుభాషా కోవిదుడైన భారతి.. స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించారు. మనుషుల్లో ఉన్నతాదర్శాలకోసం ఆ రోజుల్లోనే తపించిన అభ్యుదయవాది (subramania bharati biography) సుబ్రహ్మణ్య భారతి శతవర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

  • జియోఫోన్​ రిలీజ్​ వాయిదా..

జియోఫోన్​ నెక్ట్స్​ (jio phone next) విడుదలను వాయిదా వేస్తున్నట్లు జియో గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫోన్​ను దిపావళి సందర్భంగా అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది.

  • యథావిధిగా ఐదో టెస్టు

ఇంగ్లాండ్​తో ఐదో టెస్టుకు ముందు జరిపిన కరోనా పరీక్షల్లో టీమ్ఇండియా ఆటగాళ్లకు నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. భారత శిబిరంలో ఇప్పటికే 5 కొవిడ్​ కేసులు నమోదైన నేపథ్యంలో చివరిదైన మాంచెస్టర్​ టెస్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చేసిన టెస్ట్​ల్లో వైరస్​ లేదని తేలినందున.. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టు యథావిధిగా జరగనున్నట్లు నిర్వహాకులు తెలిపారు. 

  • ప్రియుడిని పెళ్లాడిన లేడీ కమెడియన్

ప్రముఖ హాస్యనటి విద్యుల్లేఖ రామన్.. తమిళ సంప్రదాయంలో తన ప్రియుడిని వివాహమాడింది. సోషల్ వీడియా వేదికగా పలువురు నటీనటులు వీరికి విషెస్ చెబుతున్నారు.

Last Updated : Sep 10, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details