ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఐదు గ్రామాలు ఇప్పించలేరా? ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు. హైదరాబాద్ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ను కలిపేయాలని అడగగలమా..!botsa on puvvada comments: విలీన మండలాలను తెలంగాణలో కలపాలన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం నిర్మాణం విభజన చట్ట ప్రకారమే జరుగుతోందన్న మంత్రి బొత్స... హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా అని ప్రశ్నించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనన్న మంత్రి బొత్స... మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి చూసుకుంటే సరిపోతుందన్నారు. భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా ? AP Minister Ambati Comments: పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలానికి ముంపు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పువ్వాడకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ఆ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని.. కొత్తవి సృష్టించేందుకు ప్రయత్నించొద్దని కోరారు.' ఎత్తు పెంచుతుంటే.. ఏం చేస్తున్నారు..?'Reavnth Comments on Polavaram: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. వరదలకు కారణం పోలవరం ఎత్తు పెంచటమేనని మంత్రి చెప్పిన మాటలు నమ్మాలా..? విదేశాల కుట్రతో క్లౌడ్ బరస్ట్ కావటం వల్లేనన్న ముఖ్యమంత్రి మాటలు నమ్మాలా..? అంటూ ప్రశ్నించారు. నిజానికి పోలవరమే కారణమైతే... ఇన్ని రోజులు ఏం చేశారని నిలదీశారు. 'పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు' Puvvada on Polavaram: పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు.రాష్ట్రానికి కేంద్ర హైలెవల్ కమిటీ..!Central High level Committee: త్వరలోనే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందం రాష్ట్రానికి రానుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అధికారులను హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశించినట్టు పేర్కొన్నారు.నుపుర్ శర్మకు ఊరట.. సుప్రీం కీలక ఆదేశం Nupur Sharma Supreme Court: భాజపా మాజీ నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. తనపై నమోదైన కేసులను ఒకే కోర్టుకు మార్చాలని నుపుర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది సుప్రీం. మరోవైపు, నుపుర్ శర్మను హత్య చేసేందుకు ఓ వ్యక్తి పాకిస్థాన్ నుంచి దేశంలోకి ప్రవేశించాడు. అతడిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది.అగ్నిపథ్‌కు 'కులం' చిచ్చు.. రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్తీవ్ర వ్యతిరేకత మధ్య అమలులోకి వచ్చిన అగ్నిపథ్‌పై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. అగ్నివీరుల నియామకంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భాజపా నేత ఒకరు సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. భానుడి భగభగలు.. టెంపరేచర్ ఆల్‌టైం రికార్డ్ UK HEATWAVE 2022: భానుడి భగభగలతో బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం హీత్రోలో ఉష్ణోగ్రత అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. బ్రిటన్వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం నదులు, సరస్సుల్లో దిగి.. ఐదుగురు మునిగి చనిపోయారు.ఆసియా గేమ్స్ రీషెడ్యూల్ వాయిదా పడిన 2022 ఆసియా గేమ్స్ రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా. 2023 సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపింది.