1.ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే తీసుకోండి...
వరంగల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.సీఎం స్పందించరేం...
పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యలపై గవర్నర్, హైకోర్టు స్పందించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షకు సంజయ్ మద్దతు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.మరణించినా... ఇద్దరిని బతికించాడు...
కన్నతండ్రి మరణిస్తే.. ఆ బాధ నుంచి తేరుకోవడం ఎవరికైనా చాలా కష్టం. కానీ కర్ణాటకలోని ఓ వైద్యుడు మాత్రం ఆ బాధను పంటి కింద భరించి, మరో ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ ఇద్దరు హుద్రోగులకు విజయవంతగా చికిత్స అందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.కామ్రెడ్లు సత్తా చూపిస్తారా...
దేశంలో ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడింది. వామపక్ష భావజాలంతో ప్రజలను ఆకట్టుకుని.. సీట్లు కొల్లగొట్టిన పార్టీలు ఇప్పుడు పూర్తిగా డీలాపడ్డాయి. మరి రానున్న 5 అసెంబ్లీల ఎన్నికల్లో కామ్రేడ్ల పరిస్థితి ఏంటి? బిహార్ ఎన్నికల్లో మెరిసిన లెఫ్ట్ పార్టీలు.. బంగాల్లో తమ ఉనికిని చాటుకుంటాయా? కేరళలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.ఇంటర్ పరీక్షలు ఇలా రాసేయండి...
అరకొరగా విన్న ఆన్‌లైన్ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.