1.దేశహితం కోసం సత్యాగ్రహం...
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న రహదారుల దిగ్బంధాన్ని శాంతియుతమైన సత్యాగ్రహంతో పోల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సాగు చట్టాలు రైతులకే కాదు దేశ ప్రజలందరికీ హానికరం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2.తెలంగాణను తాకిన పోరాటం...
దిల్లీలో రైతులు 'చక్కా జామ్' పేరుతో రహదారుల దిగ్బంధం పిలుపుతో రాష్ట్రంలో పలు చోట్ల రైతులు నిరసనలు చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారులను దిగ్బంధించారు. దిల్లీలో అరెస్టు చేసిన రైతు నేతలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3.ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్...
రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోవిన్ యాప్‌లో తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఈరోజు కేవలం పోలీస్ సిబ్బంది కొవిడ్ టీకాలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4.మరోసారి విమర్శలు...
అటవీ అధికారులపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శెట్టిపల్లిలో పోడు రైతులను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చలో శెట్టిపల్లికి పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5.పారదర్శకంగా బడ్జెట్...
కరోనా సమయం నుంచి తెలంగాణకు కేంద్రం సముచిత న్యాయం చేసిందని హైదరబాద్‌లోని భాజపా కార్యాలయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా బడ్జెట్‌ను రూపొందించిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి