ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురాజీనామాపై కొనసాగుతున్న సస్పెన్ష్..! Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కార్యకర్తలతో సంప్రదింపులు మూడు రోజులకు చేరిన నేపథ్యంలో.. మిశ్రమ స్పందన వస్తోంది. భాజపాలో చేరేందుకు సిద్ధమైనా.. రాజీనామా చేయాలా..? పార్టీ సస్పెండ్ చేసేవరకు ఆగాలా..? అన్న అయోమయంలోనే రాజగోపాల్‌రెడ్డి ఇంకా ఉన్నారు.చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు నోటీసులుక్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.ఆ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు.. పకడ్బందీగా సాక్ష్యాలు..! Jubileehills gang rape case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో (Hyderabad jubilee Hills gang rapecase) పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల డీఎన్‌ఏ ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. అత్యాచారం చేసిన కారులో పోలీసులు సేకరించిన ఆధారాలను... నిందితుల డీఎన్‌ఏతో సరిపోల్చారు. ఐదుగురు నిందితులపై ఛార్జ్‌షీట్ వేయడానికి ఫోరెన్సిక్ నివేదిక కీలక సాక్ష్యంగా మారింది.యాదాద్రి టూ హన్మకొండ.. Bandi Sanjay Praja Sangrama Yatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న ప్రారంభంకానుంది. ఇప్పటికే పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది. 328 కిలోమీటర్ల మేర సాగే యాత్రను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించనున్నారు. ఆగస్టు 26న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.చెస్ పండగ షురూ.. ప్రారంభించిన మోదీ 44th Chess Olympiad: 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్ పాల్గొన్నారు.సోనియా వర్సెస్ స్మృతి.. ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలు.. మరుగున పడిపోయాయి. బదులుగా ఇప్పుడు భాజపా ఎంపీలే నిరసన బాట పట్టారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ వ్యాఖ్యలపై.. రాష్ట్రపతికి, దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు'దేనికైనా ఓ హద్దు ఉంటుంది' కేసుల విచారణలో జాప్యంపై మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని అన్నారు.17 ఏళ్లకే ఓటు హక్కు...!17 ఏళ్ల దాటిన వారు కూడా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటును కల్పించింది ఎన్నికల సంఘం. ఓటు హక్కు దరఖాస్తు చేసేందుకు ఇక నుంచి 18 ఏళ్లు దాటేవరకు వేచిచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.రవితేజకు షాక్.. ఆ సీన్స్ లీక్! 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో లీకయ్యాయి. ఎడిటింగ్ రూమ్ నుంచే ఇవి లీక్ అయినట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.తారుమారైన ర్యాంకులు.. భారత్ ర్యాంక్ ఎంతంటే?ICC test championship ranking: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకులు తారుమారయ్యాయి. రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక (53.33%) డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. భారీ ఓటమితో పాకిస్థాన్ (51.85%) ఏకంగా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో థర్డ్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకొంది.