తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - 5PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 21, 2022, 4:58 PM IST

  • కొనసాగుతున్న 'రాష్ట్రపతి ఎన్నిక' ఓట్ల లెక్కింపు.. ముర్ముకు భారీ ఆధిక్యం!

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎంపీ కోటాలో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు.

  • నూతన ఆవిష్కరణల్లో రెండో స్థానంలో తెలంగాణ

నీతి ఆయోగ్‌ ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2021లో తెలంగాణ సత్తా చాటింది. ఆవిష్కరణల్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు రెండో స్థానం దక్కింది. తొలి ర్యాంకు సాధించిన రాష్ట్రంలో కర్ణాటక, మూడో స్థానంలో హరియాణా నిలిచింది.

  • రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..

రాష్ట్రానికి మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్​లోని జీనోమ్ వ్యాలీలో రూ.1800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు బయోలజికల్ ఈ సంస్థ వెల్లడించింది. మంత్రి కేటీఆర్‌తో భేటీలో చర్చించిన అనంతరం బయోలజికల్ ఈ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదు: బండి సంజయ్‌

సిద్దిపేట అర్బన్ మండలలో ప్రజా గోస భాజపా భరోసా పేరుతో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణ తేవడమే భాజపా లక్ష్యమని వెల్లడించారు.

  • ఎవరిని కదిపినా ఒకటే వ్యథ.. అందరిదీ అదే కన్నీటి గాథ!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎవరిని పలకరించినా ఒక్కటే మాట.. ప్రాణాలు మాత్రమే మిగిలాయి.. కట్టుబట్టలతో బజారున పడ్డాం. రెండు రోజులు భోజనం పెట్టారు. ఆ తర్వాత పట్టించుకునే వారు లేరని బోరున విలపిస్తున్నారు. కడెం ఉద్ధృతికి కకావికలమైన ధర్మపురిలో నష్టపోయింది అంతా చిరు వ్యాపారులే.

  • రూపురేఖలు లేకుండాపోయిన రహదారులు..

భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు వెళ్లే దారులతోపాటు.. మండల కేంద్రాలకు వెళ్లే రహదారులూ దెబ్బతిన్నాయి. వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే.. అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.

  • 'వాటి సంగతేంటి?'.. సోనియాకు 2 గంటల్లో ఈడీ 20 ప్రశ్నలు!

నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. రెండు గంటల్లోనే 20 ప్రశ్నలు సంధించింది. సోమవారం మళ్లీ రావాలని సమన్లు జారీ చేసింది. సోనియాను ఈడీ విచారణకు పిలవడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

  • నడిరోడ్డుపై 'లిప్​ లాక్​ ఛాలెంజ్​'..

సోషల్ మీడియా ఛాలెంజ్​ల పేరిట బహిరంగ ప్రదేశాల్లో నానా రభస చేశారు ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు. యువతీయువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన వారు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ, వారిని 'ఎంకరేజ్' చేశారు. చివరకు పోలీసులు ఏం చేశారంటే..

  • ఇటలీ ప్రధాని రాజీనామా.. 17 నెలలకే ముగిసిన పాలన

ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మారియో ద్రాగి ధన్యవాదాలు తెలిపారు.

  • ట్రైలర్‌ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్'​​ ఫ్యాన్స్

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' సినిమా ట్రైలర్​ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్​ ఫాన్స్​ కేక పుట్టించారు. భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ట్రైలర్​ రిలీజ్​ సందర్భంగా విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details