ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుసభ వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని భాజపా విజయ సంకల్ప సభ వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని మోదీకి భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. భాజపా శ్రేణులకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. కాషాయ తీర్థం పుచ్చుకున్న కొండాKonda Vishweshwar Reddy Join in BJP: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కమలనాథులతో అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా విజయ సంకల్ప సభ వేదికగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం గూటికి చేరారు.' డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది' భాజపా పోరాటం చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌లో భయం మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదని.. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు. తెరాసకు మరో షాక్Badangipet Mayor joins congress: హస్తం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మరో కీలక నేత చేరేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఖైరతాబాద్ కార్పొరేటర్ హస్తం గూటికి చేరగా.. ఇవాళ తాజాగా బడంగ్‌పేట మేయర్ తెరాసకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.'సార్.. మా పిల్లాడిని డైరెక్ట్‌గా ఒకటో తరగతిలో వేసేస్తాం..' "సార్.. మా పిల్లాడికి ఆరేళ్లు వచ్చాయి. రెండేళ్లుగా ఇంటి దగ్గరే అక్షరాలు చదవడం, రాయడం నేర్పించాం. మావాడు ఒకటో తరగతికి తగ్గ స్థాయిలో ఉన్నాడు. మళ్లీ ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటే వయసు ఎక్కువ అవుతుంది. ఫీజులూ కట్టాలి. నేరుగా ఒకటిలో చేర్చుకోండి.’’ -నగరంలో ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో చెబుతున్న మాటలివి..!'వర్క్ ఫ్రం ఆఫీస్'కు సిద్ధమై.. అంతలోనే Software Suicide: చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ తర్వాత ఉద్యోగంలో చేరేందుకు ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వచ్చేందుకు శనివారమే అన్ని సర్ధుకుంది. ఇంతలో ఏమైందో.. శనివారం రాత్రి 8 గంటలకు.. "నేను చనిపోతున్నా.." అని తల్లిదండ్రులకు వాట్సప్‌లో మెస్సేజ్ పంపింది. ఆ తర్వాత..ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూలకు ఇండిగో సిబ్బంది Indigo Flights Delayed: ఇండిగో విమానాల రాకపోకలకు శనివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ మంది సిబ్బంది.. సిక్ లీవ్‌లో ఉండటమే ఇందుకు కారణం. అయితే.. వారంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు వెళ్లినట్లు తెలిసింది. దీంతో.. డీజీసీఏ స్వయంగా రంగంలోకి దిగింది.సీఎం ఇంట్లోకి ఆగంతుకుడు.. రాత్రంతా...అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి గోడ ఎక్కి తెల్లారేవరకు అక్కడే కూర్చున్నాడు. ఈ భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు.రష్యా అధీనంలోకి మరో నగరం! Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని లిసిచాన్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. ఈ విజయంతో డాన్‌బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న.. తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు.లాయర్ అవతారం ఎత్తిన కీర్తి సురేశ్రాఘవ లారెన్స్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. మరోవైపు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ లాయర్‌గా ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో మరికొన్ని అప్డేట్స్ ఏమున్నాయంటే..