తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news in TS: టాప్ న్యూస్@ 9PM - టాప్ న్యూస్ ఇన్ తెలంగాణ

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్ న్యూస్

By

Published : Jun 30, 2022, 8:58 PM IST

  • మహారాష్ట్ర సీఎంగా శిందే

Maharashtra CM Eknath shinde oath: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు.

  • కింగ్ మేకర్ కాదు.. 'కింగ్'!

EKNATH SHINDE MAHARASHTRA CM: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్​నాథ్ శిందే! తిరుగుబాటును విజయవంతంగా నడిపించి.. ఠాక్రే సర్కారును కూల్చేసిన ఆయన.. ఇప్పుడు సీఎం పదవిని దక్కించుకున్నారు. శివసేనకు షాక్ ఇస్తూ భాజపా పక్షాన చేరిన ఆయన.. కింగ్ మేకర్​గా నిలుస్తారని అందరూ భావించారు. అయితే, ఆయన ఏకంగా సీఎం పదవిని దక్కించుకొని కింగ్​గా నిలిచారు. అసలు ఆయన తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓసారి పరిశీలిస్తే..

  • బిగ్ ట్విస్ట్.. 'మహా' సీఎంగా శిందే

Maharashtra politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్​గా నిలుస్తారనుకున్న ఏక్​నాథ్ శిందే.. ఏకంగా కింగ్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నరకు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు.. మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వంలో ఫడణవీస్ భాగమయ్యేలా భాజపా జాతీయ నాయకత్వం ఆయన్ను ఒప్పించింది.

  • పదిలో మళ్లీ బాలికలదే పైచేయి

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 90శాతం విద్యార్థులు పాసయ్యారు.

  • ' బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్​ తాగి జంప్​..'

KTR Comments on BJP: తెలంగాణ భవన్​లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, భాజపా నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై, భాజపా నాయకులపై కేటీఆర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • ' తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..'

Revanth Reddy Comments: ప్రధాని మోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను మోదీ మోసం చేశారని దుయ్యబట్టారు.

  • కమలం చెంతకు కొండా

రాష్ట్రంలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భాజపా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

  • క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్​.. కస్టమర్లకే బెనిఫిట్​!

కొత్త క్రెడిట్​ కార్డుల జారీ, ప్రస్తుతమున్న కార్డుల అప్​గ్రేడ్ విషయంలో ఆర్​బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బిల్లింగ్​ తేదీలు, క్రెడిట్ కార్డుల క్లోజింగ్ విషయంలోనూ మార్పులు చేసింది. వినియోగదారులకు మేలు చేసేలా ఉన్న ఈ మార్గదర్శకాలేంటి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం.

  • హైదరాబాద్‌ మెట్రోలో అమితాబ్‌ సందడి

Amitab bachan metro rail: దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.. రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ప్రాజెక్ట్​ కె షూటింగ్​లో భాగంగా అక్కడ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ ఆయ్యాయి.

  • రోహిత్​ దూరం.. టీమ్​ ఇండియా కొత్త కెప్టెన్​గా పేసర్​

ఇంగ్లాండ్​తో చివరిదైన ఐదో టెస్టుకు కెప్టెన్​ రోహిత్​ శర్మ దూరం అయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నాడని స్పష్టం చేసింది. వికెట్​ కీపర్​ బ్యాటర్​ రిషభ్​ పంత్​ వైస్​- కెప్టెన్​గా నియమితుడయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details