ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు అప్పటివరకు ఆందోళన విరమించం.. Basara RGUKT: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో వరుసగా రెండోరోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యాలయంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంగళవారం నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.కేటీఆర్ చెప్పిన ఉద్యోగ మంత్రKTR Inspiring Words: మూడు నెలలు కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమి కాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సెల్ఫోన్లను పక్కకు పెట్టి శ్రద్ధగా చదవాలని నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపారు. టాలెంట్ ఉన్న వ్యక్తికి అవకాశాలకు కొదవలేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా... చింతించ్చవద్దన్న ఆయన... ప్రైవేటులోనూ విస్తారంగా అవకాశాలున్నాయని తెలిపారు.' ప్రతిపక్షాల మాయలో పడొద్దు' Gauravelli Project Issue: గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళనపై మంత్రి స్పందించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేయదని భరోసా ఇచ్చారు.కలెక్టర్ చర్చలు విఫలంనిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులతో కలెక్టర్ చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థి నాయకులతో కలెక్టర్ ముషారఫ్ అలీ చర్చించారు. కలెక్టర్ ముందు ఆర్జీయూకేటీ విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారురాష్ట్రపతి ఎన్నికపై ఏకగ్రీవం దిశగా...! President election news: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?... కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు, విపక్షాలను ఏకం చేసేందుకు మమత ఏర్పాటు చేసిన భేటీకి తెరాస, ఆప్ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా?పీఎం మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. భాజపాకు కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని ప్రశ్నించారు.'ఉమ్మడి అభ్యర్థి'పై విపక్షాల ఏకాభిప్రాయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని తీర్మానించాయి 17 పార్టీలు. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒప్పించటంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భాజపా పావులు కదుపుతోంది. ఉమ్మడి అభ్యర్థి ప్రకటనపై ఈనెల 20-21 మధ్య విపక్షాలు మరోమారు భేటీ కానున్నాయని సమాచారం.అగ్నివీరులకు ప్రత్యేక డిగ్రీ కోర్స్Agniveers bachelor degree: సాయుధ దళాల్లో ఒప్పంద ప్రాతిపదికన సేవలందించే అగ్నివీరుల కోసం ప్రత్యేక డిగ్రీ కోర్సును తీసుకొస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఇందులో సైనిక శిక్షణలో పొందిన నైపుణ్యాలకు డిగ్రీలో 50 శాతం క్రెడిట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ వీడియోతో సీఎంఓ కౌంటర్ రెండేళ్ల క్రితం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్న 30 కిలోల బంగారం వ్యవహారం ఇప్పుడు కేరళ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలు ఏకంగా సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులకు ఇందులో భాగముందంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. అయితే.. ముఖ్యమంత్రిపైనే బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు చేసిన ఆ మహిళ ఎవరు..? ఆ కేసు ఏమిటి..?'టీమ్ఇండియాతో అంత ఈజీ కాదు'టీమ్ఇండియాను ఓడించడం అంత ఈజీ కాదన్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్. టీమ్ఇండియాకు ద్రవిడ్ ఉన్నాడని.. అండర్-19 జట్టుతో పనిచేసిన అనుభవం అతనికి ఉందని ప్రశంసించాడు. కీలక మ్యాచ్‌ను భారత్ గెలవడం వల్ల ఈ పోటీ ఆసక్తికరంగా మారిందన్నాడు.5G స్పెక్ట్రం వేలానికి కేబినెట్ 5G Spectrum Auction: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా కేంద్రం మరో ముందడుగు వేసింది. 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జీలో వస్తున్న డౌన్‌లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే వీలుంటుంది.