తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in telangana
టాప్ న్యూస్ @ 5PM

By

Published : Apr 9, 2022, 5:03 PM IST

  • భారీగా తగ్గిన కొవిడ్​ టీకాల ధరలు..

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా ధరలను భారీగా తగ్గించాయి.

  • 'తెరాస మహాకుట్ర"

Bandi Sanjay Letter: తెలంగాణ రైతు సమాజానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. తెరాస చేస్తున్న వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ కుట్రలను ఛేదించేందుకు తమతో కలిసిరావాలాని సూచించారు.

  • కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు

Minister KTR Satires: ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోదంటూ ఎద్దేవా చేశారు.

  • సోదరిపై సోదరుడు కత్తులతో దాడి

Brother Attack on Sister with Knife: తమకు తెలియకుండా భూమి అమ్మిందనే కారణంతో తోడబుట్టిన సోదరులే.. సోదరి, ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

  • జన్మలో స్టేజ్‌ ఎక్కనని.. గొప్ప నటుడిగా ఎదిగిన బాలయ్య

కళాశాల రోజుల్లో నాటకం వేసినప్పుడు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. జన్మలో మళ్లీ స్టేజ్‌ ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు మన్నవ బాలయ్య. విధి ఆడిన నాటకంలో అనుకోని విధంగా సినీ రంగంవైపు అడుగులు వేసి నటుడిగా పేరుపొందారు. ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల్ని అలరించిన ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మన్నవ బాలయ్యకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలివే..

  • 'నాకు దానిపై ఆసక్తి లేదు'

Rahul Gandhi: తాను అధికారంలోనే పుట్టానని, దానిపై తనకెప్పుడూ ఆసక్తి లేదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఆధికారం కోసం తాపత్రయపడతూ ఉంటారని విమర్శించారు.

  • బాలికపై ఎనిమిది మంది కలిసి దారుణం....!

Bangalore Girl Gang Rape: ఓ బాలిక(16)పై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో పబ్లిక్ టాయిలెట్​లో బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు.

  • స్టార్‌ హీరోయిన్‌ ఇంట్లో చోరీ..!

స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో చోరీ జరిగింది. విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరగ్గా.. పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు.

  • ఇవి పాటిస్తే ఆర్థిక ఒత్తిడి దూరం

financial stress avoid plans: ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాట వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ డబ్బు అవసరం ఎంతో ఉంది. ఆర్థికారోగ్యం బాగున్నప్పుడే.. అనుకున్నవన్నీ సాధించగలం. క్రమం తప్పని వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లే.. మన ఆర్థిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమూ అవసరం.

  • ఆ​ క్రికెటర్లు ఐపీఎల్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేకపోయారు!

Famous Players Never Played IPL: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ఎందరినో స్టార్లను చేసింది. భారత్​లో ఎందరో వర్ధమాన క్రికెటర్లను జాతీయ జట్టు తలుపుతట్టేలా చేసింది. విదేశీ క్రికెటర్లలోనూ ప్రతిభను ప్రపంచానికి చాటింది. అయితే ఆయా దేశాల తరఫున అద్భుతంగా రాణించిన కొందరు అసలు ఐపీఎల్​ ఆడలేకపోయారు. వారెవరో చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details