ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఏమన్నారంటే? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. రష్యా దురాక్రమణను నియంత్రిస్తున్నట్లు ప్రధానికి తెలిపిన జెలెన్.. ఐరాస భద్రతా మండలిలో తమకు భారత్ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు. దురాక్రమణను కలిసి పోరాడదామని పేర్కొన్నారు.కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో.. సురక్షితంగా..! ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల యుద్ధంతో.. రెండు రోజులుగా కంటిమీద కునుకులేకుండా బతుకుతున్న భారతీయ విద్యార్థులకు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. ఇండియన్ ఎంబసీ, కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో వారిని స్వదేశానికి తరలించేందుకు చర్యలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేక బస్సుల ద్వారా వారిని సరిహద్దులకు తరలిస్తున్నారు. సర్వం సిద్ధం.. బరిలో 692 మంది UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఆదివారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.పట్టాలపై వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు..?Train Accident Today: ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిన ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. బిహార్ పాట్నా రైల్వేస్టేషన్లో రైలు రావడానికి ముందు ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పట్టాలపై పడిపోయాడు. ఇంతలోనే రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాల మధ్యలో కదలకుండా అలాగే ఉండిపోయాడు. రైలు వెళ్లిపోగానే లేచి ప్లాట్‌ఫామ్‌పైకి పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు.అక్కడ లీటర్ పెట్రోల్ రూ.200 ప్లస్ Petrol price in Sri Lanka: అసలే ఆకలి సంక్షోభంలో మగ్గుతున్న శ్రీలంక నెత్తిన మరో పిడుగు పడింది. తినడానికి తిండి లేకుండా ఉన్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. చమురు కొనుగోళ్లకు డబ్బులు లేవంటూ గతవారం అక్కడి సర్కారు చేతులెత్తేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచుతూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజలను మరింత కుంగదీస్తోంది.కేయూలో ఆందోళన.. KU students protest: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పరిపాలన భవనం ముందు నిరసన చేపట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న వారిని వసతిగృహాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వాగు ఒడ్డున భారీ మొసలి..! Crocodile in Vishaka : విశాఖ మన్యం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో భారీ మొసలి కళేబరం ప్రత్యక్షమైంది. అయితే..దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో వాగు సమీపంలోనే పూడ్చిపెట్టారు గిరిజనులు.భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?Gold price today: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగినప్పటికీ, యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే సూచనలు లేకపోవడంతో శుక్రవారం పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి బంగారం ధర రూ.51,800కు చేరింది. యుద్ధం ఇంకా కొనసాగితే.. బంగారం ధరలు ఎలా ఉండనున్నాయంటే..?ప్రభాస్ రోల్‌కు ఆయన జీవితమే స్పూర్తి! 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ప్రభాస్, పామిస్ట్(హస్త సాముద్రిక నిపుణుడు) పాత్రలో నటించడం ఆసక్తి రేపుతోంది. దీని గురించి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌ను అడగ్గా.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రముఖ పామిస్ట్ కైరో జీవితంలో కొన్ని సంఘటనలు స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలోని సన్నివేశాలు రాసుకున్నట్లు పేర్కొన్నారు.బౌలింగ్ ఎంచుకున్న భారత్IND vs SL 2nd T20: ధర్మశాల వేదికగా భారత్ శ్రీలంక మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.