ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుభారతీయుల కోసం ప్రత్యేక విమానాలు Indian evacuation from Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరీకి మూడు ప్రత్యేక విమానాలు పంపుతోంది. రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకున్నవారిని విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి భారత్‌కు తీసుకురానున్నారు.రష్యా అధీనంలోకి ఎయిర్పోర్ట్ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. హోస్టోమెల్లో అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది.అనధికార లేఅవుట్లపై హైకోర్టు కీలక తీర్పు Registrations In Unauthorized Layouts: రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వ్యాజ్యాలపై విచారణ న్యాయస్థానం.. ఆయా ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.' ఏ క్షణాన ఏమవుతుందో తెలియడం లేదు..'Wanaparthy students stuck in ukraine : ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలతో అక్కడున్న విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భయానకర పరిస్థితుల మధ్య పిల్లలు కాలం గడుపుతుంటే.... ఇక్కడ వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులు నెలకొనడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.'డిస్కంలకు డిఫాల్టర్ ప్రభుత్వమే' Revanth Reddy on Current Charges hike: విద్యుత్తు ఛార్జీల పెంపుపై ట్రాన్స్‌కో ప్రతిపాదనలు నియంత్రణ మండలి తోసిపుచ్చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు అయ్యాయని తెలిపారు.యుద్ధంపై తాలిబన్ల షాకింగ్ కామెంట్స్Russia-Ukraine War Crisis: ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు పాల్పడిన రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు. రష్యాను అదుపు చేసేందుకు ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. మరోవైపు.. రష్యా చర్యను ఖండిస్తూ తీర్మానం చేసేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై తాలిబన్లు కీలక ప్రకటన చేశారు.మూగజీవిపై అత్యాచారం- పట్టుకున్న యజమాని Unnatural Sex with Cow: మనిషి రూపంలో ఉన్న ఓ మృగాడు మూగ జీవిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో జరిగింది. అర్ధరాత్రి వేళ పశువుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని.. ఆవు యజమాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్ యోగి' అతడే..!Himalayan Yogi: జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ ఓ యోగి ప్రభావానికి గురయ్యారన్న వార్త బిజినెస్ ప్రపంచం, స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఆ అదృశ్య యోగి ఎవరనే దానిపై అనేక వార్తలు వినిపించాయి. అయితే అందరూ ఊహించినట్లుగా ఆ హిమాలయ యోగి.. ఎన్‌ఎస్‌ఈ మాజీ అధికారి ఆనంద్ సుబ్రమణియనే అని తాజాగా తెలిసింది. 'భీమ్లా నాయక్' సక్సెస్‌పై చిరు ట్వీట్ Bheemla nayak chiranjeevi: 'భీమ్లా నాయక్' థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో కంగ్రాచ్యూలేషన్స్ చెప్పారు. పవర్ తుపాన్ అంటూ రాసుకొచ్చారు. రోహిత్ శర్మకు సన్మానంRohit Sharma Felicitation: టీమ్ఇండియాకు వరుస విజయాలను అందిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మను ముంబయి క్రికెట్ అసోసియేషన్ సన్మానించనుంది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లను కూడా ఎంసీఏ సన్మానించనుంది.