తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 16, 2022, 3:00 PM IST

  • మోదీకి మరో అవకాశమిస్తే అంతే..

KTR Comments on Modi : నరేంద్ర మోదీకి ప్రధానిగా మరో అవకాశమిస్తే.. తెలంగాణను ఆంధ్రాను కలుపుతారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం ధర్మం అని చెప్పే భాజపా సర్కార్.. దేశానికి ఏం చేస్తుందో మాత్రం చెప్పదని వ్యాఖ్యానించారు. మోదీ కేవలం ఉత్తర్​ప్రదేశ్, ఉత్తర భారత్​కు మాత్రమే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

  • ఆపరేషన్‌ సక్సెస్‌ పేషెంట్‌ డెడ్‌ అన్నట్టుగా..

Revanth reddy about Assam cm case : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ధర్నా సమయంలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని కోరారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఆయన మరో ఫిర్యాదు చేశారు. మొదటి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు కేసు నమోదు చేయలేదన్నారు. నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

  • ప్రశాంత్‌ కిశోర్‌ కంటే మేధావులు..

Etela Comments On KCR: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి అరిష్టమని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. మోకాళ్ల మీద నడిచినా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తన కుట్రలు, కుతంత్రాలు పారనందుకే పీకే సాయం తీసుంటున్నారని విమర్శించారు.

  • కాంగ్రెస్​కు ఆప్ ఫొటోకాపీ​..

PM Modi in Pathankot: బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్ వీడ్కోలు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్​కు భాజపా అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. విపక్షాలు మాత్రం రాష్ట్రాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాయని మండిపడ్డారు.

  • డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నం..

NSA Ajit Doval residence infiltration: ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నించిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • హిజాబ్​ ధరించిన విద్యార్థులకు నో ఎంట్రీ..

Hijab issue in karnataka: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత వారం రోజులుగా మూతపడిన ప్రీయూనివర్సిటీ కళాశాలలు తెరుచుకున్నాయి. కొంత మంది విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కళాశాలకు హాజరయ్యారు. యాజమాన్యం వారిని లోనికి అనుమతించకపోవడం కారణంగా సిబ్బందితో వాదించారు.

  • వృద్ధుడిని మోస్తూ మంచులోసాహస యాత్ర..

భారీ హిమపాతం మధ్య అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని సుమారు 16 కి.మీ మేర మోసుకువచ్చారు గ్రామస్థులు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని ఉత్తర్​కాశీలో జరిగింది. ఓస్లా గ్రామానికి చెందిన కృపా సింగ్​ అనే వ్యక్తి ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన్ను గ్రామంలోని యువకులు కర్రలకు కట్టుకుని రహదారి వరకు తమ భుజాలపై మోసుకువెళ్లారు.

  • కానిస్టేబుల్ వార్షిక ఆదాయం కోట్లలో..

Amitabh Bachchan ex body guard suspend: అతడు పేరుకే కానిస్టేబుల్... వార్షికాదాయం మాత్రం రూ.కోట్లలో ఉంటుంది. విదేశీ టూర్​లు, ఖరీదైన ప్రాపర్టీలకు లెక్కే లేదు! బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర పనిచేసిన ఆ కానిస్టేబుల్ అక్రమాల కథేంటో ఓసారి పరిశీలిస్తే..

  • వీళ్లైనా సన్​రైజర్స్​ను గట్టెక్కిస్తారా..

IPL 2022 Mega auction: ఐపీఎల్​ మెగావేలం పూర్తైంది. ముగ్గిరిని రిటెయిన్​ చేసుకున్న సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఈ వేలంలో 20 ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఆ ఆటగాళ్లు ఎవరు? జట్టులో వారి పాత్ర ఏంటి? ఎలాంటి ప్రదర్శన చేయగలరు? ఈ సారైనా విజయాల బాట పడుతుందా? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం..

  • అందాల్ని అస్సలు దాచుకోవట్లేదుగా..

అందాల తారలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో మెరుస్తూ.. అభిమానులకు చేరువవుతున్నారు. తమ అందాల్ని ఆరబోయటంలో ఏమాత్రం వెనకాడకుండా.. ఫ్యాన్స్​ని ఫుల్​ ఖుష్​ చేస్తున్నారు. నిధిఅగర్వాల్​, కేతిక శర్మ, నికితాశర్మ తమ హాట్​ పోజులతో నెట్టింట సందడి చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం...

ABOUT THE AUTHOR

...view details