తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 15, 2022, 2:59 PM IST

  • సీఎం కేసీఆర్​పై కేసు నమోదు..!

సీఎం కేసీఆర్​ భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రెస్​​ మీట్​లో సర్జికల్ స్ట్రైక్‌కు ఫ్రూప్​ కావాలని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. దీనిపై అసోం భాజపా నేతలు పలువురు కేసీఆర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసోం పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్​ఐ వెల్లడించింది.

  • అందరితో జీహుజూర్​ అనిపించుకోవాలని..

kishan reddy said that KCR : సీఎం కేసీఆర్‌ భాజపాపై చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ సమాజం తనకు జీ హుజూర్‌ అన్నట్లుగా ఉండాలని... సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని ఆరోపించారు. నియంతల మాదిరిగా తరతరాలు పాలించేందుకు కొత్త రాజ్యాంగం తేవాలని భావిస్తున్నారని విమర్శించారు.

  • కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి మొదటిసారి భేటీ..

Revanth - Komati Reddy Meet: ఆ ఇద్దరు కాంగ్రెస్​ పార్టీలో కీలక నేతలు. ఒక్కరంటే ఒకరికి పడదు. వారు ఇరువురు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు తక్కువే. వాళ్లు ఇంకెవరో కాదు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి(tpcc chief revanth reddy), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి(komatireddy)లు. ఇప్పుడు వారిద్దరు హైదరాబాద్​లో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.

  • వైఎస్ షర్మిల అరెస్ట్..

YS Sharmila Arrest : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని వైతెపా అధ్యక్షురాలు వెఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి... ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు... షర్మిలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

  • మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజు..

Medaram Jatara 2022: మేడారం మహాజాతరకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. ఈనెల 16,17,18,19 తేదీల్లో కీకారణ్యం.. జనారణ్యమై కోలాహలంగా మారనుంది.

  • కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ..

Ashwani Kumar: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీనామా చేశారు.

  • సంసద్​ టీవీ యూట్యూబ్ ఛానల్​ హ్యాక్..​

Sansad TV Hack: పార్లమెంటు ఉభయసభల కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్​ టీవీ యూట్యూబ్​ ఛానల్​ హ్యాక్​ అయింది. ఈ మేరకు సంసద్​ టెలివిజన్​ ప్రకటించింది. అప్రమత్తమైన యూట్యూబ్​ యాజమాన్యం ప్రస్తుతానికి అకౌంట్​ను బ్లాక్​ చేసింది.

  • పది నిమిషాల్లోనే రూ.186 కోట్ల లాభం..

Rakesh Jhunjhunwala earns: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు నష్టాలను ఎదుర్కొని మంగళవారం లాభాల బాట పట్టగా.. 'బిగ్​బుల్​' రాకేశ్​ ఝున్​ఝున్​వాలాపై కాసుల వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల్లో ఏకంగా రూ. 186 కోట్లు గడించారు ఝున్​ఝున్​వాలా.

  • గ్రాండ్ స్లామ్ నుంచి తప్పుకుంటా కానీ..

Djokovic News: ఫ్రెంచ్ ఓపెన్​, వింబుల్డన్ నుంచి తప్పుకుంటానని దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ అన్నాడు. టీకాను తప్పనిసరి చేస్తే.. అనే ప్రశ్నపై ఈ మేరకు ఓ ఇంటర్వూలో సమాధానమిచ్చాడు.

  • కొత్త సినిమా ముచ్చట్లు వచ్చేశాయి..

Gani Movie Release: కొత్త మూవీ అప్​డేట్స్ వచ్చేశాయి. 'గని', ఆడవాళ్లు మీకు జోహార్లు, గుర్తుందా శీతాకాలం, సర్కారు వారి పాట ఇందులో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details