ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..తెలంగాణ, ఏపీ ఇప్పటికీ నష్టపోతున్నాయి.. Modi on Andhra Pradesh Bifurcation : ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మురిసిపోతోన్న ముచ్చింతల్..Ramanuja Sahasrabdi Utsav : ముచ్చింతల్‌లో శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది వేదపండితులు, జీయర్‌స్వాములు ఈ క్రతువులో పాల్గొన్నారు.ఆ 4 జిల్లాల్లో తలసేమియా ఉద్ధృతి.. Thalassemia disease facts : జన్యుపరమైన లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. ఆడిపాడే బాల్యాన్ని బలి తీసుకుంటోంది. తల్లిదండ్రులకు శోకం మిగుల్చుతోంది. తలసేమియా గురించే ఇదంతా. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎంత అనేదానిపై నిపుణుల మాటేంటి?రైతులకు ఐదేళ్లు ఉచిత విద్యుత్..UP BJP Manifesto: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. అన్నదాతలకు ఉచితంగా ఐదేళ్ల పాటు విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని తెలిపింది.ముదిరిన హిజాబ్ వివాదం.. Hijab-saffron row: కర్ణాటక శివమొగ్గలో హిజాబ్ వివాదం మరింత ముదిరింది. ఓ కళాశాల ఆవరణలో కాషాయ శాలువా, హిజాబ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పెన్షన్ కోసం లింగ మార్పిడి..Man Changes Gender for retirement: స్విట్జర్లాండ్‌లో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఒక ఏడాది ముందుగా రిటైర్ అయ్యి, పెన్షన్ పొందడానికి ఏకంగా తనను తాను మహిళగా ప్రకటించుకున్నాడు. అది కూడా అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాన్ని ఆసరాగా చేసుకొని. అంతేగాకుండా రికార్డుల్లో పేరు మార్పించాడు. ఎలా చేశాడో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.హ్యుందాయ్ సారీపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. Hyundai apology: వివాదాస్పద ట్వీట్ చేసినందుకు హ్యుందాయ్ సంస్థ క్షమాపణలు బలంగా చెప్పాల్సిందని కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'..IPL 2022: ఫిబ్రవరి 12, 13 తేదీల్లోనే ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు. ఇకపై దీనిని టాటా ఐపీఎల్‌గా వ్యవహరించనున్నారు.డచ్ సింగర్ నోట.. శ్రీవల్లి పాట.. ప్రధాన భారతీయ భాషలన్నింటీలో విడుదలైన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట ఎంతగానో ఆకట్టుకుంది. మరి.. ఈ పాటని మీరు ఇంగ్లీష్‌లో విన్నారా..? వినకపోతే.. వెంటనే నెదర్లాండ్ యువతి.. ఎమ్మా హీస్టర్స్ పాడిన పాటను ఓ సారి వినండి. సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా ఎన్నో వీడియోలు రూపొందిస్తున్న ఈమె యూట్యూబ్ ఛానెల్‌లో.. ఇలాంటి మరిన్నె సూపర్ హిట్ పాటలు వినొచ్చు.మహాభారతం నటుడు కన్నుమూత..Mahabharat Praveen Kumar: ప్రముఖ అథ్లెట్, మహాభారతం సీరియల్ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.