ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు Govt Decision on Holidays: విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఈనెల 30వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించింది. రేపు కేబినెట్ భేటీ CM KCR Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై రేపు మంత్రి వర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం..! Fire Accident in Secunderabad Club: అతిపురాతనమైన సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడిన మంటలను నాలుగు గంటలపాటు శ్రమించి.. ఏడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు. కొత్తగా 2,043 కేసులు.. పోలీస్‌శాఖలో భారీగా..! Telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.డీఎస్ సొంతగూటికి.. ముహూర్తం ఖరారు..! DS Joining in Congress: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్.. మళ్లీ తన సొంతగూటికి చేరుతున్నారు. ఈ నెల 24న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే.. India vaccination drive: భారత్‌లో కరోనా టీకా పంపిణీ.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా. వ్యాక్సినేషన్ ప్రారంభించి ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. టీకా పంపిణీలో భారత్ సాధించిన కీలక మైలురాళ్లపై ఓ సారి లుక్కేద్దాం.దేశంలో కరోనా ఉద్ధృతి Covid cases in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్‌ను జయించారు.' వ్యాక్సిన్లు శక్తిని అందించాయి' Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొవిడ్‌పై పోరులో టీకాలు శక్తిని అందించాయని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురింపించారు. 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ Acharya new release date: చిరు 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్ విడుదల చేశారు.ఇండియా ఓపెన్ నెగ్గిన లక్ష్యసేన్ India Open 2022 Badminton: ఇండియా ఓపెన్ ఫైనల్స్‌లో భారత్ స్టార్ షటర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి అదరగొట్టారు. సింగిల్స్‌లో సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీయన్ యూపై లక్ష్యసేన్ విజయం సాధించగా.. డబుల్స్‌లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇండోనేసియా మోహమ్మద్ అహసన్-హెంద్రా సెతియావాన్లపై సాత్విక్-చిరాగ్ జోడి నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది.