ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు రాత్రి కర్ఫ్యూ వాయిదా AP Night Curfew: ఏపీలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత.. ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేస్తూ.. తాజాగా ఆదేశాలను జారీ చేసింది.ఆర్జీవీ వరుస ట్వీట్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లు చేశారు. నిన్న మంత్రి పేర్ని నానితో భేటీ తర్వాత ఆర్జీవీ ట్వీట్ల్ పర్వం మళ్లీ మొదలెట్టారు. సినిమా టికెట్ల ధరపై మంత్రితో భేటీలో చర్చించారు. 'గొడవ ఎవరు చేశారో విచారిస్తాం' Nizamabad family suicide: నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. సురేష్ ఇంటికి వచ్చి ఎవరెవరు గొడవ చేశారో విచారిస్తామని సీఐ చెప్పారు. ఫోన్ కాల్స్, సెల్ఫీ వీడియో, వాయిస్ మెసెజ్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.అందుకు మాట్లాడేందుకు గర్వపడాలి VENKAIAH NAIDU on Telgugu: మాతృభాషలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. దేశ యువత అవకాశాలను అందిపుచ్చుకుని.. నైపుణ్యాభివృద్ధితో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతీ నిర్వహించారు. సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!' Sidhu on Punjab CM: రానున్న ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పీసీసీ చీఫ్ సిద్ధూ అన్నారు.వారందరికీ వర్క్ ఫ్రం హోమ్..! Private offices WFH: కరోనా పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది దిల్లీ సర్కార్. ఈ క్రమంలోనే ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అందరూ వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేయాలని సూచించింది. మినహాయింపులు ఉన్న సంస్థలు మాత్రం 100 శాతం సిబ్బందితో పనిచేయవచ్చని తెలిపింది. వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు! Sheep Sold For Record Price: సాధారణంగా గొర్రెల ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ గొర్రె పిల్ల మాత్రం ఏకంగా రూ. రెండు లక్షలకు అమ్ముడుపోయింది. గొర్రె పిల్లకు ఈ స్థాయి ధర పలకడం వెనుక కారణం లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందాం.సెన్సెక్స్ 221 ప్లస్ Stock Market Today: మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పైగా ఎగబాకింది.కపూర్ సిస్టర్స్ నెగటివ్ తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్కు ఏడు రోజుల కిందటే కరోనా సోకినట్లు తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్. తాజా పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు పేర్కొంది. కాగా, ఇటీవల వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్ నటుడు సత్యరాజ్ డిశ్ఛార్జ్ అయ్యారు.స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ Chris Morris Retirement: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నాడు.