తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Sep 1, 2022, 9:00 AM IST

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM
Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM

  • భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి

Gas Cylinder Price: ఒకటో తేదీ ఊరట. గ్యాస్​ సిలిండర్ రేటును భారీగా తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబరు 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

  • వరద బాధితుల పడవ బోల్తా.. 20 మందికి పైగా..

ఓ పక్క వరద.. వారి ఇళ్లను ముంచేస్తే మరో పక్క పడవ ప్రయాణం వారి జీవితాలను చిదిమేసింది. కాసేపట్లో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సిన పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 20 మందికి పైగా నీటిలో పడిపోయారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • ఉద్యోగాల నియామక పురోగతిపై ప్రతి వారం ప్రభుత్వం సమీక్ష

ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రతి వారం సమీక్షించనుంది. ఆలస్యం చేయకుండా దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోనుంది. అనుమతులు, నోటిఫికేషన్లు సహా పురోగతిని ప్రతి సోమవారం నివేదించాలని సాధారణ పరిపాలనా శాఖను ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశించారు.

  • నేటి నుంచి మునుగోడు ప్రచార బరిలో కాంగ్రెస్‌

congress campaign in munugode constituency: కాంగ్రెస్‌ నేడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగనుంది. గడప గడపకు కాంగ్రెస్‌ అనే నినాదంతో మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు ఈ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల ఆరో తేదీ వరకు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మీ మునుగోడు - మీ కాంగ్రెస్‌ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది.

  • సేంద్రియ ఎరువు తయారీలో సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐసీటీ

సేంద్రియ ఎరువు తయారీలో హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్- ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత సేంద్రియ ఎరువులను మరింత చేరువ చేసేలా.. యాక్సిలరేటెడ్ అనరోబిక్ కంపోస్ట్ ఎరువును అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎరోబిక్, వర్మీ కంపోస్టింగ్‌ అనే రెండు విధానాల్లో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.

  • విఘ్నాలు తొలగించేవాడే కాదు, కలిగించేవాడు కూడా

వినాయకుని చూడగానే తెలియకుండానే మనలో చిరునవ్వు మెదుల్తుంది. భక్తిభావం కలుగుతుంది. ఇంతకీ గణపతి ప్రసన్నవదనుడేనా! శత్రు భయంకరుడు కూడానా? పార్వతమ్మ ముద్దులతనయుడేనా! పరమాత్మతత్వానికి ఆధారం కూడానా? చూద్దాం!

  • ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..

నాలుగు పెళ్లిళ్లు, ఏడుగురు పిల్లలు. ఇది చాలదని ఓ వ్యక్తి ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. రాత్రికి రాత్రే రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి రెండో భార్యతో పాటు ఏడుగురు పిల్లలు, బంధువులు అక్కడికి వెళ్లి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • 50 వేల జవాన్లతో రష్యా సైనిక విన్యాసాలు.. భారత్​, చైనా సహా!

రష్యా మరోసారి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు జరగనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో భారత్‌, చైనా సహా మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది. రష్యాతో కలిసి ఇతర దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.

  • సూర్యకుమార్‌ మెరుపులు.. హాంకాంగ్​పై టీమ్​ఇండియా విజయం

Asiacup 2022 teamindia vs Hongkong పాకిస్థాన్​పై గెలిచిన టీమ్​ఇండియా హాంకాంగ్​పై కూడా సునాయసంగా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ సూపర్-4కు దూసుకెళ్లింది.

  • చిరంజీవి కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్న శ్రీకాంత్​

మెగాస్టార్ చిరంజీవి కోసం తాను ఓ సారి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నట్లు తెలిపారు సీనియర్​ నటుడు శ్రీకాంత్​. అసలేం జరిగిందంటే.

ABOUT THE AUTHOR

...view details