ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువిద్యార్థులు అసహనంతో ఉన్నారు.. governor tamilisai on rgukt problems: బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించదగినవే అని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.భాజపాలోకి దాసోజు శ్రవణ్..Dasoju Sravan Joined BJP: తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించేలా భాజపాలో పని చేస్తానన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ భాజపాలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో దిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు.తండ్రీకుమారులను మోసం చేసిన తండ్రీకుమారులు.. Cheating in hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. తండ్రీకుమారులు కలిసి ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.16.10 కోట్లు కాజేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజం బయటపడింది. అదేంటో మీరే చూడండి.మాయమాటలతో నాలుగు పెళ్లిళ్లు..marrying four people : ఇటీవల నిత్యపెళ్లికొడుకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తూ నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి మాయ మాటలతో నలుగురిని పెళ్లాడాడు. అతని వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది.నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. SSLV Rocket Launch: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు.సైబరాబాద్‌ను చూసినప్పుడు నాకెంతో సంతృప్తి..CBN: మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమని తెలుగేదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి.. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులు.. వయసు మీదపడిన వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..ఉద్యోగం కోసం దరఖాస్తు ఫారాన్ని నింపేందుకు కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లిన మహిళపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. మరోవైపు, కన్న కూతుర్ని చంపేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు ఓ తండ్రి. ఈ దారుణం యూపీలోని మేరఠ్‌లో వెలుగులోకి వచ్చింది.పంత్‌పై రోహిత్ ఫైర్.. captain Rohithsharma fire on pant: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 విజయంలో పంత్ కీలక పాత్ర పోషించిన వికెట్‌కీపర్ పంత్‌పై కెప్టెన్ రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..యుద్ధనౌకపై మోహన్‌లాల్..మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొచిన్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్(ఐఏసీ) విక్రాంత్‌ను సందర్శించారు. ఆ వివరాలు...