తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 6, 2022, 1:00 PM IST

  • ఉపరాష్ట్రపతి పోలింగ్.. మళ్లీ వీల్​ఛైర్​లోనే మన్మోహన్

Vice president election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ వీల్​ఛైర్​లోనే వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేసేందుకు లైన్లలో నిల్చున్నారు.

  • ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్

Faridkot jail news: పంజాబ్.. మాదకద్రవ్యాల అడ్డాగా మారుతోంది. తాజాగా ఫరీద్​కోట్​లోని జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్టులు చేయగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. మహిళా ఖైదీలలో కొందరు సైతం మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు పరీక్షల్లో బయటపడింది.

  • ముర్ము, మలాలా.. ఇద్దరూ గిరిజనులే.. కానీ వ్యత్యాసాలు ఎన్నో!

ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్​జాయ్... పురుషులకు దీటుగా విజయ శిఖరాలు అధిరోహించిన ఇద్దరు వనితారత్నాలు! ఇద్దరూ గిరిజన తెగకు చెందినవారే. కానీ వీరి తెగల మధ్య వ్యత్యాసాలు మాత్రం అనేకం కనిపిస్తున్నాయి.

  • కడుపులో స్టీల్ గ్లాస్​.. గంటసేపు వైద్యుల సర్జరీ..

ఉత్తర్​ప్రదేశ్​లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు గంటపాటు శ్రమించి రోగి కడుపులో నుంచి స్టీల్​ గ్లాసును తొలగించారు.

  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!

China taiwan war: తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది.

  • చేపలు పట్టేందుకు వెళ్లి.. వాగులో చిక్కుకుని..

young man stuck in Paleru vagu: మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో ఓ యువకుడు చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. యాకేశ్​ను రక్షించేందుకు గ్రామస్థుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు తాడు సాయంతో యాకేశ్‌ను బయటకు లాగారు.

  • సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదు

Governor Tamilisai at Ambedkar University : జీవితం అనేది అంత సులభం కాదని.. సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో పాల్గొన్న గవర్నర్​.. విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

  • 'సర్‌.. డబ్బులు లేవంటున్నా.. రూ.2 వేలు వసూలు చేశారు'

Complaint on government hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసూతి విభాగాల్లో వసూళ్లపై ఓ బాలింత వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావుకు ఫిర్యాదు చేసింది. తన వద్ద డబ్బులు లేవన్నా వినకుండా.. రూ.2 వేలు వసూలు చేశారంటూ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

  • లైగర్​ నుంచి మరో పాట.. ఈ ఏడాది 'మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌' ఇదే!

Aafat song liger: విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' నుంచి మరో పాట విడుదలైంది. 'ఆఫత్‌' అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. "మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌"గా అభివర్ణించారు విజయ్‌.

  • 'బింబిసార' తొలిరోజు కలెక్షన్స్​ ఎంతంటే?

Kalyanram Bimbisara collections: సూపర్​హిట్​ టాక్​తో దూసుకుపోతున్న నందమూరి హీరో కల్యాణ్​రామ్​ నటించిన 'బింబిసార' సినిమా తొలి రోజు మంచి వసూళ్లను సాధించింది. ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details