తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM - తెలంగాణ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 5, 2022, 12:59 PM IST

  • విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తెరాస మద్దతు

TRS Supports Margaret Alwa : రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్​ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు పార్లమెంట్​ భవనంలో రేపు జరగనున్న ఎన్నికలో మార్గరెట్​ అల్వాకు మద్దతుగా ఓటు వేయనున్నారు.

  • వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు

Revanth Reddy on MP Venkat Reddy : ''మీరు' వెన్నుపోటు పొడుస్తున్నారు' అని కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్​రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అపోహలతో వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.

  • ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

congress protest at indira park: హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణులు ధర్నాకు దిగారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • సికింద్రాబాద్‌ ఘటనలో వాట్సాప్‌ సంభాషణలే కీలకం

Secunderabad Protest Case : సికింద్రాబాద్​లో జరిగిన 'అగ్నిపథ్​' అల్లర్ల ఘటనలో వాట్సాప్​ సంభాషణలే కీలకంగా మారాయి. ‘‘వివిధ వాట్సాప్‌ గ్రూపులలో ఏకమైన నిరుద్యోగ యువకులు విధ్వంసానికి ప్రణాళిక వేసుకున్నారు. ఎన్ని గంటలకు ఎక్కడ కలవాలి, ఏమి చేయాలన్నది ముందే నిర్ణయించుకున్నారు. వీరిని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు మరింత రెచ్చగొట్టారు. ఇదంతా వాట్సప్‌ వేదికగా సాగింది’’ అని రైల్వే పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఈ కేసులో వాట్సప్‌ చాటింగ్‌లే కీలకంగా మారాయి.

  • కల్తీ మద్యానికి 8 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది

Spurious liquor Bihar: కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరోమారు బిహార్​లో కలకలం సృష్టించింది. సారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.

  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని లక్షలకు తీసుకుంటే బెటర్?

Health insurance policy for family : అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు.. ఆర్థికంగా భారం పడకుండా ఆదుకునేది ఆరోగ్య బీమా. ఎప్పుడో ఏళ్ల క్రితం తీసుకున్న పాలసీకి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కానీ, ఆ ధీమా మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు సరిపోతుందన్నది మాత్రం సమీక్షించుకోరు. ఇది ఎంతమాత్రం సరికాదనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన బీమా పాలసీలోనూ మార్పులు, చేర్పులు తప్పనిసరి.

  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి..

  • మైదానంలో కొట్టుకున్న హాకీ ప్లేయర్స్

Commonwealth Games 2022 Hockey players fight: కామన్వెల్త్​ గేమ్స్​లో భాగంగా జరిగిన హాకీ పోటీల్లో ఇద్దరు ఆటగాళ్లు కొట్లాటకు దిగారు. మ్యాచ్​ మధ్యలో మైదానంలోనే ప్రొఫెషనల్ రెజ్లర్ల లాగా తలపడ్డారు. ఆ వీడియో చూసేయండి...

  • షారుక్​ 'మన్నత్'​తో సల్మాన్​కు ఉన్న బంధం తెలుసా?

Sharukh Mannat: బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ బంగలా 'మన్నత్​'పై మనసు పారేసుకున్నారు కథానాయకుడు సల్మాన్​ ఖాన్​. దాని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details