ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.'నైరుతి'లోనే కుండపోత వర్షాలుతెలంగాణ మొన్నటి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈనెల 9 నుంచి 14 వరకు 100 నుంచి 1000 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో వర్షపాతం పెరుగుతోంది. ఈ ఏడాది ‘నైరుతి’లోనే కుండపోత వర్షాలు పడ్డాయని టీఎస్‌డీపీఎస్ విశ్లేషణనిచ్చింది.పోలవరం గేట్ల నిర్వహణే కీలకం భద్రాచలంలో ముంపును, నష్టాన్ని నివారించడానికి పోలవరం డ్యాం గేట్లకు క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని హైదరాబాద్‌లోని ఐఐటీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతంపై పడే ప్రభావం గురించి ఐఐటీహెచ్ అధ్యయనం చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అవేంటంటే..?పార్ట్ టైమ్ గురువుల నియామకానికి అనుమతిసర్కార్ ఉన్నత పాఠశాలల్లో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. పార్ట్ టైమ్ గురుకుల నియామకాలపై ఈనాడు-ఈటీవీ భారత్ రాసిన కథనానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన స్పందించారు. ఈ మేరకు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వంశీకృష్ణ వలలో వెయ్యి మందికి పైగా అతడి పేరు వంశీకృష్ణ. రెండో పెళ్లికి సిద్ధమైన మహిళలకు వల వేసి మోసగించడమే అతడి వృత్తి. వెయ్యి నుంచి 1500 మంది ఆడవాళ్లు అతడి మాయలో పడి మోసపోయారు. ఇప్పటికి వారి నుంచి వంశీ.. దాదాపు 50 కోట్ల రూపాయలు కాజేశాడు. చాలా రోజులుగా ఈ మాయగాడి కోసం వెతుకుతున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు వంశీని అరెస్టు చేశారు.13 ఏళ్ల పగ.. తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం13 ఏళ్ల కిందట తండ్రిని హతమార్చిన వ్యక్తిని.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి ఓ ముఠాతో హత్య చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని మల్కాజిగిరి ఎస్‌వోటీ, జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తులు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ వ్యవహారం ఎలా బయటపడిందంటే..కొరడాతో కొట్టించుకున్న మహిళలు.. అలా జరగాలనే! తమిళనాడు.. పెరంబలూరులోని థేరణి గ్రామంలోని సెలనమ్మాళ్ దేవాలయంలో వినూత్నంగా పూజలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ పూజల్లో మహిళా భక్తులను పూజారులు కొరడాతో కొట్టారు. ఇలా కొట్టడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని పూజారులు చెబుతున్నారు. ఈ సంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పాటిస్తున్నామని తెలిపారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు అస్వస్థతకడుపునొప్పితో బాధపడుతున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి.స్వల్పంగా తగ్గిన బంగారం ధర దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?డోప్ పరీక్షలో ఫెయిల్.. కామన్వెల్త్ రేసు నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు ఔట్భారత జట్టులో మరోసారి డోపింగ్ కలకలం సృష్టించింది. కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైన అథ్లెట్లు ఎస్.ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది. ఈ అథ్లెట్లు ఇలా డోప్ పరీక్షల్లో విఫలమవడం ఇది రెండోసారి.