తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @9AM - టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today: టాప్​న్యూస్ @9AM
Telangana News Today: టాప్​న్యూస్ @9AM

By

Published : Jul 17, 2022, 9:01 AM IST

  • ధైర్యం చెప్పేందుకే భద్రాచలం..

కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తాను భద్రాచలం వెళుతున్నట్లు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పేర్కొన్నారు. భద్రాచలం పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్న ఆమె.. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

  • ముంపులోనే ఊళ్లు..

'పల్లె ఏదో... పట్టణం ఏదో' కనిపించటం లేదు. 'పూరి గుడిసెలు-అద్దాల మేడలు' అనే తేడా లేదు. 'పేద-ధనిక' అన్న భావనే లేదు. అందరిదీ ఒకే వ్యథ. అందరికీ ఒకటే కష్టం. ఎవరిని కదిలించినా నిర్వేదమే. ఎవరి పలకరించినా దయనీయమే. ప్రకృతి విలయతాండవానికి గోదావరి పరీవాహక ప్రాంతాలు కకావికలమయ్యాయి. సర్వస్వం కోల్పోయి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీరప్రాంత గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో మగ్గుతుండగా... ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

  • పునరుద్ధరణకు చర్యలు..

వరద ఉద్ధృతి తగ్గడంతో అన్నారం పంపుహౌస్‌ నుంచి.. నీటిని తోడే ప్రక్రియ కొనసాగుతోంది. భారీ మోటార్లను ఉపయోగించి నీటిని తోడుతున్న అధికారులు.. మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత మోటార్లను బయటకు తీసి పరీక్షిస్తారు. ఇంకా మేడిగడ్డ జలదిగ్భంధలోనే ఉన్నందున అక్కడ నుంచి నీటిని తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.

  • కాల్పుల క‌ల‌క‌లం..

Gun firing in Rangareddy: నగర శివారు తుక్కుగూడ వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న లారీపై కారులో వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • జూ​.ఎన్టీఆర్​ను చూడాలి..

9 నెలల వయసులో వెన్నెముకకు తగిలిన గాయం.. ఆ యువకుడిని కదల్లేని స్థితికి తీసుకొచ్చింది. ఆడుతూ.. పాడుతూ.. తిరుగుతూ.. అందరి పిల్లల్లా చదువుకోవాల్సిన వయసులో మంచానికే పరిమితమయ్యాడు. అతడి వైద్యం కోసం తల్లిదండ్రులు తమకున్న 60 సెంట్ల పొలంతో పాటు ఓ ఇంటినీ అమ్మేశారు. అయినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మంచానికే పరిమితమైనా సినిమాలు ఎక్కువగా చూసే ఆ యువకుడు జూ.ఎన్టీఆర్​కు అభిమానిగా మారిపోయాడు.

  • వైద్య పట్టా ఇవ్వకుండా వేధింపులు!

చర్మ, కంటి, జననేంద్రియాలు, ఉదర, మూత్రకోశ వ్యాధులు.. నిమోనియా వంటి ఎన్నో జబ్బులను మానవాళి సమర్థంగా తట్టుకుంటోందంటే.. మనిషి ఆయుః ప్రమాణం పెరిగిందంటే.. కేవలం ఒక్క మహానుభావుడి పుణ్యమే! ఆయనే ఎల్లాప్రగడ సుబ్బారావు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా.. ఖద్దరు కట్టాడని కక్షగట్టి.. వైద్య పట్టా ఇవ్వకుండా వేధించింది భారత్‌ను ఏలిన బ్రిటిష్‌ సర్కారు!

  • పెరుగుతున్న గిరాకీ..

భారత్​లో ఫార్మాస్యూటికల్ మార్కెట్ రాబోయే దశాబ్దంలో దూసుకెళ్తుందని అన్నారు పరాక్సెల్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ వ్యాస్‌. ప్రస్తుతం 44 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 130 డాలర్లుకు చేరుకుంటుందని తెలిపారు. దీని వల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు గిరాకీ ఎంతగానో పెరుగుతుందని వెల్లడించారు. పరాక్సెల్ ఎండీ సంజయ్ వ్యాస్ 'ఈనాడు'తో పలు విషయాలు ముచ్చటించారు. వాటి గురించి తెలుసుకుందాం.

  • చైనా దూకుడుకు కళ్లెం..

చైనాకు కళ్లెం వేసేందుకు ఏర్పడిన 'ఆకస్' కూటమి భారత్​పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్​లో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోందని విమర్శిస్తోంది. ఆకస్ కూటమిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలు. భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ అమెరికా మొసలి కన్నీరు కారుస్తుంటే- బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో సిక్కు వర్గానికి చెందిన కొందరు ఖలిస్థాన్‌ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  • భారత అథ్లెట్​ అద్భుతం..

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారుడ మురళీ శ్రీశంకర్​ అదరగొట్టాడు. లాంగ్​జంప్​​ అర్హత రౌండ్లో 8 మీటర్లు దూకి ఫైనల్​కు చేరాడు. ఇతర భారత అథ్లెట్లు జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. మిక్స్​డ్​ రిలే రేసులో కాంస్యం అందుకుంది ఫెలిక్స్.

  • 'మెగా154' సెట్​లో సందడి..

చిరు-బాబీ కాంబినేషన్​లో తీస్తున్న కొత్త సినిమా 'మెగా154' షూటింగ్​లో ఆసక్తికర పరిణామం జరిగింది. శనివారం షూటింగ్​లో మాస్​హీరో రవితేజ జాయిన్ అయ్యారు. రవితేజ వచ్చిన వెంటనే.. తన కారవాన్​లోకి లాగేశారు మెగాస్టార్​.

ABOUT THE AUTHOR

...view details