ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలునేడు, రేపు సీఎం ఏరియల్ సర్వే.. శనివారం రాత్రి హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్ ఆ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల నష్టం వివరాలపై ఆరా తీశారు. నేడు వరంగల్ నుంచి భద్రాచలం వరకు సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.నీట్ పరీక్షకు సర్వం సిద్దం..Neet Exam: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 60వేల మంది అభ్యర్థుల కోసం.. 25 పట్టణాలు, నగరాల్లో.. 115 కేంద్రాలను సిద్దం చేశారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎన్టీఏ వెల్లడించింది.అమ్మా బైలెల్లినాదో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలసంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. పోతురాజుల వీరంగం, శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్లతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగిపోతున్నాయి.భద్రాద్రిలో నేడు గవర్నర్ పర్యటన..గోదారమ్మ మహోగ్ర స్వరూపంతో.. భద్రాద్రి వణికిపోతోంది. వరదలతో అతలాకుతలమవుతోన్న జిల్లాలో ఈరోజు గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. భద్రాచలంలోని వరద బాధితులను ఆమె కలుసుకోనున్నారు.ఇకపై అలా జరగదు.. బాసర ట్రిపుల్ ఐటీలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు, నిజామాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఓ విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను విపక్ష నేతలు పరామర్శించారు.ఆ జిల్లాలతోనే మార్పు సాధ్యం..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా చైతన్యవంతమైందని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందజేశారు.ఆ ఆరుగురి ఆందోళన.. ప్రభుత్వాన్ని పడగొట్టింది! Sri Lanka Crisis: అధికారమంతా ఒక్క కుటుంబం చేతిలోనే.. అవినీతిమయమైన పాలన.. రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతూ నిత్యావసరాలు లభ్యం కాక ప్రపంచం ముందు చేతులు చాచాల్సిన దుస్థితి.. ఇవన్నీ శ్రీలంక ప్రజల్లో నిరసన జ్వాలలు రగిల్చాయి.రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి వరకు..సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వాక్చాతుర్యంతో దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న నేతగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది.క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ICC FTP 2023 to 2027: ఐపీఎల్ కోసం ఎఫ్టీపీ క్యాలెండర్లో రెండున్నర నెలలను ఐసీసీ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది. విదేశీ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్జిస్తున్నారు.అసలు వేట మొదలైంది..రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ట్రైలర్ విడుదలైంది. తన మాస్ డైలాగులతో ట్రైలర్లో అదరగొట్టారు రవితేజ.