తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 6, 2022, 7:00 AM IST

  • తెలంగాణ రుణ పరిమితిలో కోత

ప్రస్థుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రుణ పరిమితిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ఈ ఏడాది తీసుకునే రుణాల పరిమితిని కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించిన నేపథ్యంలో అదనపు నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది.

  • బాసర ఆర్జీయూకేటీకి రూ.11 కోట్లు విడుదల

ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ తెలిపారు. అందులో రూ.11 కోట్లు విద్యాలయ ఖాతాలో జమయ్యాయని.. వాటితో విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

  • మందుల ధరలకు కళ్లెం

మందుల ధరలకు ముక్కుతాడు వేస్తూ.. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణలకు వాడే ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా వినియోగదారులపై 30-40 శాతం మేర భారం తగ్గనుంది

  • అత్యున్నత ప్రమాణాలతో సివిల్స్‌ స్టడీ సర్కిళ్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాలకే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర ఉద్యోగాలకు కూడా ఈ కేంద్రాల్లో శిక్షణ అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతురు

భారత వైమానిక దళం చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటు చోసుకుంది. తండ్రీకూతురు కలిసి ఓ ఫైటర్ జెట్​ను నడిపారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతురుగా రికార్డు సాధించారు.

  • పెన్ను పోయిందని కేసు పెట్టిన ఎంపీ

తమిళనాడు కన్యాకుమారి కాంగ్రెస్​ ఎంపీ విజయ్​ వసంత్​ తన లక్షా యాభై వేల రూపాయల పెన్ను పోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకమని ఆయన తెలిపారు.

  • ఆ కిరణాలతో ప్లాస్టిక్‌ను కరిగించేయొచ్చు!

ప్లాస్టిక్‌ను సురక్షితంగా కరిగించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. అతి నీలలోహిత కిరణాలను ఉపయోగించి ప్లాస్టిక్‌ను కరిగించవచ్చన్నారు.

  • 'వాణిజ్య వివాదాల పరిష్కారంలో 'మధ్యవర్తిత్వ విధానం' మేలు'

CJI NV Ramana News: ప్రపంచ వాణిజ్య రంగానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన వివాద పరిష్కార యంత్రాంగం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆయా అంశాల్లో నిపుణులైన న్యాయమూర్తులను ఈ కోర్టుల్లో నియమించాలని సూచించారు.

  • 'క్షమించు సింధు'.. బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ లేఖ!

బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుకు క్షమాపణలు తెలిపింది. ఇటీవల బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో జరిగిన పొరపాటుపై స్పందిస్తూ.. టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌ చిహ్‌ షెన్‌ చెన్‌.. సింధుకు లేఖ రాశారు.

  • దాని కోసం చాలా కష్టపడ్డా.. నా డ్రీమ్‌ రోల్​ అదే: కృతిశెట్టి

"నేనెప్పుడూ నాకు సరిపోయే కథల్నే ఎంచుకుంటాను. చేసే ప్రాజెక్ట్‌ పెద్దదా.. చిన్నదా? అని అసలు ఆలోచించను" అంది కృతి శెట్టి. 'ఉప్పెన'తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన ఈ అమ్మడు.. 'శ్యామ్‌ సింగరాయ్‌', 'బంగార్రాజు' చిత్రాలతో కెరీర్‌ కొనసాగించింది. ఇప్పుడు 'ది వారియర్‌'తో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన కృతిశెట్టి.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే తన కెరీర్​ సహా చిత్ర విశేషాలు పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details