ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుదేశంలో కరోనా తగ్గుముఖం దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 22,270 మందికి కొత్తగా వైరస్ సోకింది. 325 మంది కొవిడ్ కారణంగా చనిపోయారు.ఆస్పత్రికి వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు దుర్మరణంములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వరంగల్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేడారం సమీపంలోని గట్టమ్మ ఆలయం సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయోధ్యలో ఉద్రిక్తత ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అయోధ్యలో ఎస్పీ భాజపా మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కాల్పులు సైతం జరిగినట్లు తెలుస్తోంది.బయో ఆసియా సదస్సులో బిల్గేట్స్ఈనెల 24 నుంచి జరిగే బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్.. బిల్‌గేట్స్‌తో దృశ్యమాధ్యమంలో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఆయనతో చర్చాగోష్ఠి కోసం తానెంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానని మంత్రి తెలిపారు.వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ ఏపీ మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ డీఐజీ చౌరాసియా.. ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసులో మొదటి నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సిట్ దర్యాప్తు నివేదికలు కావాలంటూ పులివెందుల కోర్టులో వేసిన పిటిషన్‌పై... సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది.తల్లిని కర్రతో కొడుతూ.. కాలితో తన్నుతూకన్నతల్లి అని చూడకుండా అమానుషంగా దాడి చేశాడు ఓ కుమారుడు. ఆస్తి రాసివ్వాలంటూ చిత్ర హింసలకు గురి చేశాడు. అతడి తీరుతో వేదనకు గురై విలపిస్తున్న తల్లిని.. కనికరం లేకుండా కర్రతో చితకబాదాడు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలు రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. శాంతి చర్చలకు సిద్ధమని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కానీ ఉక్రెయిన్ చుట్టూ బలగాలను మోహరించడం కారణంగా రష్యా మాటలను పాశ్చాత్య దేశాలు విశ్వసించడం లేదు.. అతి త్వరలో ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడికి దిగే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ కూడా హెచ్చరించారు.మూడో టీ20కు కోహ్లీ దూరంవెస్టిండీస్తో జరగనున్న మూడో టీ20కు టీమ్ఇండియా బ్యాటర్ కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. అతడికి బయోబబుల్ నుంచి విరామం ఇవ్వనున్నట్లు తెలిపింది బోర్డు.కోహ్లీ నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: రోహిత్ శర్మ వెస్టండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్‌శర్మ. భువనేశ్వర్ వేసిన 19 ఓవర్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిందని అన్నాడు. కోహ్లీ తనపై ఒత్తిడి లేకుండా చేశాడని పేర్కొన్నాడు.వెండితెరపైకి ఆ స్టార్ ప్లేయర్ బయోపిక్.. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. తన తండ్రి కెరీర్లో ఎలా ఎదిగారో వివరించారు.