ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు కర్ణాటకలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి Hyderabad tourists drowned: బంధుమిత్రులంతా కలిసి వెళ్లిన విహారయాత్ర.. ముగ్గురు ప్రాణాలను బలిగొంది. అప్పటివరకు ఎంతో వినోదంగా గడిపిన వారిని.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సరదాగా జలపాతంలో దిగిన ముగ్గురు వ్యక్తులు.. తిరిగి విగతజీవులుగానే బయటికివచ్చారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపారు. ఈ విషాదం.. కర్ణాటకలోని అబ్బి జలపాతంలో చోటుచేసుకుంది.నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..!ఒక చెట్టు వాడిపోకుండా ఉండాలంటే కావాల్సింది నీళ్లు.. అదే దంపతుల మధ్య విరిసిన ప్రేమ వాడిపోకుండా కలకాలం ఉండాలంటే.. కావాల్సింది నమ్మకం. అది గనకపోయి.. ఆ స్థానంలో అనుమానం అనే చీడ మొదలైందా.. సంసార వృక్షాన్ని మొత్తం నిర్వీర్యం చేసి నేలకూలుస్తుంది. రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు Central Minister Kishan Reddy: రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నులను మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణ కోసం ఉపయోగిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో....42 శాతం పన్నులను ఇస్తున్నామని వెల్లడించారు. గతంలోని పల్లెప్రగతి బిల్లులు చెల్లించండి..Uttam Letter to CM KCR: ఐదో విడత పల్లె ప్రగతి మొదలు పెట్టక ముందే గ్రామాలకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులను చెల్లించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ రాశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు.రాజ్యసభకు నిర్మల, పీయూష్‌కు ఛాన్స్ త్వరలో 9 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 16 రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్ధులను ప్రకటించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపంజాబ్‌లో కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా ఆయన బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్ Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత Pakistan drone shot down: జమ్ముకశ్మీర్, కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి భద్రతా దళాలు. డ్రోన్ మోసుకొచ్చిన బాక్సులో గ్రెనేడ్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.'ఆ పాత్ర కోసం ఆహారం తీసుకోలేదు' Sai Pallavi: ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి.. తన నటనా చాతుర్యంతో మైమరిపిస్తుంది సాయి పల్లవి. పాత్ర కోసం ఆమె ఎంతో శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే రానాతో కలిసి నటించిన 'విరాటపర్వం' సినిమా కోసం ఆమె ఆహారం తీసుకోకుండా ఉందని చెప్పారు దర్శకుడు వేణు ఊడుగుల.ఫైనల్ పంచ్.. రాజస్థాన్ బ్యాటింగ్IPL 2022 Final: గుజరాత్‌లోని మొతేరా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.