తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్ న్యూస్ @ 5PM

By

Published : May 28, 2022, 4:59 PM IST

  • 'తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్'

NTR 100th Anniversary: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏపీ ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు.

  • మూడురోజులపాటు మోస్తరు వర్షాలు

Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • 'సాంఘిక చైతన్యానికి ఆయనే స్ఫూర్తి'

Niranjan Reddy On Suravaram: భిన్న కోణాల్లో సమాజాన్ని పరిశీలించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం విగ్రహానికి నివాళులర్పించారు.

  • 'అలాంటి ప్రధానులయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారు'

Bhatti Vikramarka: ఆజాదీ కా అమృత్​ మహోత్సవాల్లో జవహర్​ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడం పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. దీన్ని ఖండిస్తూ సాలార్​ జంగ్​ మ్యూజియంలో ప్రదర్శన చేపట్టిన ఎన్​ఎస్​యూఐ విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

  • రైతు ఆత్మహత్య

Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూమినే నమ్ముకుని కష్టపడుతున్న కర్షకులు... కాలం వేస్తున్న కాటుకు అదే భూమిలో బూడిదవుతున్నారు. అలాంటి మరో విషాదకర ఘటనే వరంగల్​ జిల్లాలోలోని నల్లబెల్లిలో జరిగింది.

  • 'ఆప్​' సర్కార్​ మరో కీలక నిర్ణయం

Punjab Govt Withdraws Security: పంజాబ్​లో అధికారంలో ఉన్న ఆప్​ సర్కార్​.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు భద్రతను తొలగించింది. మొత్తం 424 మందికి పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించింది.

  • బస్సును తప్పించబోయి కారు బీభత్సం

కేరళ మలప్పురంలోని అరీకోడే వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ బస్సును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన కారు.. రోడ్డుపైకి దూసుకొచ్చింది.

  • సింహాన్ని కాటేసిన విషసర్పం

Lioness Dies Snake Bite: విషసర్పం కాటుకు ఓ ఆడసింహం ప్రాణాలు కోల్పోయింది. బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ప్రాణాలు దక్కలేదు. ఒడిశాలోని నందన్​కనన్​ జూ పార్క్​లో ఈ ఘటన జరిగింది.

  • హీరోల్లో ఎన్టీఆర్​దే అగ్రస్థానం

ప్రస్తుతం పాన్​ ఇండియా రేంజ్​లో నెం.1 స్టార్​ ఎవరంటే చెప్పడం కాస్త కష్టమే. అయితే ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ కొంత కాలంగా ఈ విషయమై సర్వే చేస్తూ.. ప్రతినెలా వివిధ భాషల్లో మోస్ట్​ పాపులర్ స్టార్స్​ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్​ నెలకు గానూ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హీరోహీరోయిన్లకు సంబంధించి కొత్త జాబితాను ప్రకటించింది. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం...

  • నాయకుడు మారినా తలరాత మారలేదే.?

Reasons RCB out of IPL 2022: ఈ ఐపీఎల్​లోనూ ఆర్సీబీ కెప్టెన్​ మారినా దాని తలరాత మాత్రం మారలేదు. కీలక మ్యాచ్​లో ఓడి సీజన్​ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓడిపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం...

ABOUT THE AUTHOR

...view details