ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు గవర్నర్, సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు.. Sri Rama Navami 2022: రాష్ట్రప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మావతారమైన శ్రీరాముని నుంచి సమగ్ర జీవన విధానం కోసం అందర ప్రేరణ పొందుదామని అన్నారు.'తెలంగాణ రైతులపై ఎందుకంత కక్ష'Nama Nageshwara rao Comments: తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిని తెరాస ఎంపీలు ఎండగట్టారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దిల్లీ భాజపా నేతలు ఓ విధంగా.. రాష్ట్ర నేతలు మరోవిధంగా మాట్లాడుతూ.. రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మోదీ, షాలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు Minister KTR Satires: ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోదంటూ ఎద్దేవా చేశారు.ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూతSenior Actor Balayya died: ప్రముఖ నటుడు బాలయ్య(92) శనివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కెరీర్లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు బాలయ్య. పుట్టినరోజు నాడే చనిపోవటం బాధాకరమైన విషయం.' వడ్ల రాజకీయం వెనక మహాకుట్ర" Bandi Sanjay Letter: తెలంగాణ రైతు సమాజానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెరాస చేస్తున్న వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ కుట్రలను ఛేదించేందుకు తమతో కలిసిరావాలాని సూచించారు.'అదే దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'Alternative Dispute Resolution: ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్‌కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు.భారత్‌లో 'ఎక్స్‌ఈ' వేరియంట్ కలకలం Omicron XE Variant in India: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ 'ఎక్స్‌ఈ' కేసు గుజరాత్లో బయటపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఇది నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రసుతం వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతన్ని కలిసిన మరో ముగ్గురికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించింది.భారీగా తగ్గిన కొవిడ్ టీకాల ధరలు..దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి'అందులోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు' Rahul Gandhi: తాను అధికారంలోనే పుట్టానని, దానిపై తనకెప్పుడూ ఆసక్తి లేదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఆధికారం కోసం తాపత్రయపడతూ ఉంటారని విమర్శించారు.ఐపీఎల్లో సన్‌రైజర్స్ బోణీCSK vs SRH: ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలివిజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.