ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇది ప్రారంభం Amit Ahah in Munugode Meeting మునుగోడులో నిర్వహించిన భాజపా సమరభేరిలో పాల్గొన్న అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.భాజపా తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిRajagopal reddy BJP Joining కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడులో నిర్వహిస్తోన్న భాజపా సమరభేరి వేదికగా రాజగోపాల్‌రెడ్డిని పార్టీ కండుపా కప్పి కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు.అమిత్ షా పర్యటనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు KTR Tweet Today on Amith Shah Tour మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన దృష్ట్యా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కలవనున్న అమిత్ షామునుగోడు సమరభేరి పేరిట భాజపా నిర్వహిస్తున్న సభ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు.మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేశారన్న రేవంత్‌రెడ్డి revanth reddy comments on cm kcr praja deevena sabha మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ మునుగోడు సమస్యలను ప్రస్తావించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. డిండి ప్రాజెక్టులో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో చెప్పకుండా, జాతీయ రాజకీయాలు చెప్పి మునుగోడు ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌కు షాక్హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సీనియర్ నేత ఆనంద్ శర్మ. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. భాజపా పక్కా గేమ్ ప్లాన్ నితిన్ గడ్కరీ వంటి కీలక నేతను ఎందుకు తప్పించారు, 75ఏళ్ల వయోపరిమితి నిబంధన యడియూరప్పకు వర్తించదా, ఇటీవల భాజపా పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ తర్వాత బాగా వినిపించిన ప్రశ్నలివి. ఇవే కాక, వేర్వేరు రాష్ట్రాల్లో నాయకత్వం విషయంలో భాజపా తీసుకున్న అనేక నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకిలా, కమలదళంలో మార్పులకు వ్యూహాత్మక కారణాలున్నాయా, అసలు లక్ష్యం 2024 ఎన్నికలేనా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.సిసోదియాపై లుక్ఔట్ నోటీసులతో మరో దుమారంతనపై లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఇప్పటి వరకు ఎలాంటి లుక్ఔట్ నోటీసులు జారీచేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే జారీ చేస్తామని సీబీఐ వెల్లడించింది.గాడ్ ఫాదర్ వచ్చేసింది మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టీజర్ విడుదలైంది. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగాఅంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా యువప్లేయర్ దీపక్ హుడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే