సమ్మె విరమించిన జూడాలు
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు(JUDAS) సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా సీఎం హామీతో విరమిస్తున్నట్లు చెప్పారు.పెంచిన స్టైపండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈటలకు భాజపా పచ్చజెండా
మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala rajendar) చేరికకు భాజపా(BJP) అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధిష్ఠానంతో వర్చువల్గా సమావేశమైన బండి సంజయ్ (Bandi Sanjay) ఈటల విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (J.P.Nadda) వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3,614 కొత్త కేసులు
రాష్ట్రంలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ (corona positive) నిర్ధరణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు (telangana director of health) శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు (corona positivity rate) 4 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జులైలో ఇంటర్ పరీక్షలు!
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (inter second year exams) జులై మధ్యలో నిర్వహించే యోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుతం తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాసింది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గించే యోచన ఉన్నట్లు విద్యాశాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తగ్గుతున్న కరోనా
దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచినప్పటికీ.. గత వారం నుంచి పాజిటివిటీ రేటు తగ్గుతోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.