కర్నల్ కుటుంబానికి సీఎం పరామర్శ
భారత్-చైనా సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. వీర సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన సీఎం... ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
శత్రువులు చుట్టుముట్టినా...
అప్పటికే శరీరంపై తీవ్ర గాయాలు.. చుట్టూ పెద్ద సంఖ్యలో శత్రు బలగాలు.. తన వద్ద చాలా తక్కువ మంది సైనికులు.. అయినా వెనక్కి తగ్గలేదు ఆ తెలుగు యోధుడు.. శత్రువుతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. అతడే కర్నల్ సంతోష్ బాబు. వైరిపక్ష దురాగతంపై తుదికంటూ పోరాడుతూ భరతమాత రక్షణలో అమరుడయ్యారు. మృత్యు ముఖంలోనూ ఆయన ప్రదర్శించిన అద్భుత నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మూడు రైళ్లేనా ?
దేశంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, ఉన్నవాటి పొడిగింపుపై రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందాయి. దేశవ్యాప్తంగా 62 కొత్త రైళ్లు ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించగా తెలంగాణ నుంచి మూడే ఉన్నాయి. అవి కూడా వారానికోసారి నడిచేవే. రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 12 కొత్త రైళ్లు జాబితాలో ఉండగా రైల్వేమంత్రుల రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
నేడు 4 స్లిప్, లింక్ రోడ్లు ప్రారంభం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గించేందుకు బల్దియా దృష్టి సారించింది. అందులో భాగంగా స్లిప్, లింక్ రోడ్లను నిర్మించింది. ఇటీవల నిర్మించిన 4 స్లిప్, లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
సైబర్ దాడులకు చైనా కుట్ర!
భారత్-చైనా సరిహద్దుల వెంబడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా.. చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌పై సైబర్ దాడులకు దిగేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సైబర్ దాడులు జరిగితే? భారత్ వాటిని ఎలా ఎదుర్కోగలదు? ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...